OTT Releases This Week: ఈ వారం ఓటీటీలో రిలీజ్ కానున్న సినిమాలు వెబ్‌సిరీస్‌లు ఇవే
01 December 2022, 6:25 IST
OTT Releases This Week: ఈ వారం ఓటీటీలో డిఫరెంట్ కాన్సెప్ట్‌లతో కూడిన సినిమాలు వెబ్‌సిరీస్‌లు రిలీజ్ కానున్నాయి. ఆ సిరీస్‌లు ఏవంటే...
అమితాబ్‌బచ్చన్, రష్మిక మందన్న
OTT Releases This Week:
లవ్ టుడే (Lovetoday) - డిసెంబర్ 2 - నెట్‌ఫ్లిక్స్ (Netflix)
ఈ ఏడాది కోలీవుడ్‌లో చిన్న సినిమాల్లో సెన్సేషనల్ హిట్‌గా నిలిచిన చిత్రం లవ్ టుడే. ప్రదీప్ రంగనాథన్ హీరోగా నటిస్తూ దర్శకత్వం వహించిన ఈ సినిమా ఐదు కోట్లతో నిర్మిస్తే అరవై కోట్లకుపైగా కలెక్షన్స్ రాబట్టింది. థియేటర్లలో ప్రేక్షకుల్ని అలరించిన ఈ సినిమా డిసెంబర్ 2 నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ కానుంది.
పెళ్లి చేసుకోవడానికి సిద్ధపడిన ఓ యువ జంటకు ఒక రోజు ఒకరి ఫోన్‌ను మరొకరు మార్చుకోవాలని హీరోయిన్ తండ్రి కండీషన్ పెడతాడు. ఈ కండీషన్ వల్ల ఆ ప్రేమ జంట ఎదుర్కొన్న సమస్యలను వినోదాత్మక పంథాలో ఆవిష్కరిస్తూ దర్శకుడు ఈ సినిమాను తెరకెక్కించారు. తెలుగులో డబ్బింగ్ ద్వారా విడుదలైన ఈ సినిమా భారీ వసూళ్లను రాబట్టింది. ఓటీటీలో తెలుగుతో పాటు తమిళంలో ఈ సినిమా స్ట్రీమింగ్ కానుంది.
నీథమ్ ఒరు వానమ్ (తెలుగులో ఆకాశం)- డిసెంబర్ 2 - నెట్‌ఫ్లిక్స్
అశోక్ సెల్వన్, రీతూవర్మ, శివాత్మిక రాజశేఖర్ ప్రధాన పాత్రల్లో నటించిన నీథమ్ ఒరు వానమ్ డిసెంబర్ 2 నుంచి ఓటీటీ ప్రేక్షకుల ముందుకు రాబోతున్నది. నెట్‌ఫ్లిక్స్‌లో ఈ సినిమా స్ట్రీమింగ్ కానుంది. రొమాంటిక్ డ్రామాగా రూపొందిన ఈ సినిమాకు ఆర్ కార్తిక్ దర్శకత్వం వహించాడు. అర్జున్ అనే ట్రావెల్ ఏజెంట్ కథ ఇది. అతడి జీవితంలోకి వచ్చిన ముగ్గురు అమ్మాయిల కథతో రొమాంటిక్ లవ్ ఎంటర్‌టైనర్‌గా ఈ సినిమా రూపొందింది.
మోహన్‌లాల్ మాన్‌స్టర్(Mohanlal Monster) - డిసెంబర్ 2 - డిస్నీ ప్లస్ హాట్‌స్టార్(Disneyplus Hotstar)
మోహన్‌లాల్ హీరోగా నటించిన మాన్‌స్టర్ సినిమా డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌లో డిసెంబర్ 2న రిలీజ్ కానుంది. యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రూపొందిన ఈ సినిమాతో టాలీవుడ్ నటి మంచు లక్ష్మి మలయాళంలోకి అరంగేట్రం చేసింది. ఇందులో డ్యూయల్ షేడ్ క్యారెక్టర్‌లో మోహన్ నటించాడు.
గుడ్‌బై (Goodbye) - డిసెంబర్ 2 - నెట్‌ఫ్లిక్స్
అమితాబ్‌బచ్చన్(Amitabh Bachchan), రష్మిక మందన్న(Rashmika Mandanna) ప్రధాన పాత్రల్లో నటించిన గుడ్‌బై సినిమా డిసెంబర్ 2 ఓటీటీ ప్రేక్షకుల ముందుకు రాబోతున్నది. ఆర్థిక బంధాలు మనుషుల మధ్య దూరాన్ని ఎలా పెంచుతాయనే కథాంశంతో ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా రూపొందిన ఈ సినిమాకు వికాస్ భల్ దర్శకత్వం వహించాడు. గుడ్‌బై సినిమాతోనే రష్మిక మందన్న బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చింది. నెట్‌ఫ్లిక్స్‌లో సినిమా రిలీజ్ కానుంది.
ధర్మపురి (తెలుగు) - డిసెంబర్ 2 - ఆహా ఓటీటీ
వదంతి - డిసెంబర్ 2 - అమెజాన్ ప్రైమ్
క్రష్‌డ్ - డిసెంబర్ 2 - అమెజాన్ ప్రైమ్
విల్లో (వెబ్‌సిరీస్) - డిసెంబర్ 2 - డిస్నీ ప్లస్ హాట్‌స్టార్
ఫ్రెడ్డీ - డిసెంబర్ 2 - డిస్నీ ప్లస్ హాట్‌స్టార్
ఇండియన్ లాక్‌డౌన్ - డిసెంబర్ 2 - జీ5
వారియర్స్ ఆఫ్ ఫ్యూచర్ - డిసెంబర్ 2 - నెట్‌ఫ్లిక్స్