Kotabommali PS Folk Song: 'కోటబొమ్మాళి పీఎస్' నుంచి ‘లింగి.. లింగి.. లింగిడి’ ఫోక్ సాంగ్ వచ్చేసింది.. ఊపున్న బీట్‍తో..
11 September 2023, 20:13 IST
- Kotabommali PS Folk Song: శ్రీకాంత్ హీరోగా నటిస్తున్న కోటబొమ్మాళి సినిమా నుంచి ఫస్ట్ సాంగ్ వచ్చేసింది. జానపద బీట్‍తో మంచి ఊపుతో ఈ సాంగ్ ఉంది.
Kotabommali PS Folk Song: కోటబొమ్మాళి నుంచి ‘లింగి.. లింగి’ ఫోక్ సాంగ్ వచ్చేసింది.. ఊపున్న బీట్‍తో..
Kotabommali PS Folk Song: సీనియర్ హీరో శ్రీకాంత్ ప్రధాన పాత్రలో నటిస్తున్న కోటబొమ్మాళి పీఎస్ చిత్రంపై చాలా ఆసక్తి ఉంది. మలయాళంలో బ్లాక్‍బాస్టర్ అయిన నయట్టు చిత్రానికి రీమేక్‍గా ఈ సినిమా రూపొందుతోంది. పోలీసులు, రాజకీయాల చుట్టూ పొలిటికల్ సర్వైవల్ డ్రామాగా కోటబొమ్మాళి పీఎస్ సినిమా ఉండనుంది. యంగ్ డైరెక్టర్ తేజ మార్ని ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. కాగా, కోటబొమ్మాళి పీఎస్ సినిమా నుంచి నేడు (సెప్టెంబర్ 11) ఫస్ట్ సాంగ్ రిలీజ్ అయింది. శ్రీకాకుళం మాస్ ఫోక్ సాంగ్‍గా ఇది ఉంది. వివరాలివే..
“లింగి లింగి.. లింగిడి” అంటూ కోటబొమ్మాళి పీఎస్‍లోని ఈ తొలి పాట మొదలైంది. ఉత్తరాంధ్ర జానపద పాటలా ఉంది. మంచి బీట్‍తో ఆకట్టుకునేలా ఉంది. మ్యూజిక్ డైరెక్టర్ మిథున్ ముకుందన్ ఈ పాటను ఫోక్ సాంగ్‍గా ఫాస్ట్ బీట్‍తో స్వరపరిచారు. రఘు కుంచె లిరిక్స్ అందించటంతో పాటు ఈ పాటను స్వయంగా పాడారు. కొరియోగ్రాఫర్ విజయ్ పోలంకీ ఈ పాటకు డ్యాన్స్ కంపోజ్ చేశారు.
ఈ పాట లిరికల్ సాంగ్‍లో శ్రీకాంత్ కనిపించారు. ఇది సెలెబ్రేషన్ సాంగ్‍లా ఉంది. రాహుల్ విజయ్, శివానీ రాజశేఖర్ కూడా కోటబొమ్మాళి పీఎస్ చిత్రంలో ప్రధాన పాత్రలు చేస్తున్నారు. వరలక్ష్మి కూడా కీలక పాత్ర చేస్తున్నారు. గీతాఆర్ట్స్2 పతాకంపై బన్నీ వాస్, విద్యా కొప్పినీడి సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. జగదీశ్ చీకటి ఈ చిత్రానికి సినిమాటోగ్రాఫర్‌గా ఉండగా.. కార్తీక శ్రీనివాస్ ఎడిటర్ బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు.