తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Leo Twitter Review: విజ‌య్ ర్యాంప్ ఆడించాడు - లియో ఓవ‌ర్‌సీస్ ప్రీమియ‌ర్స్ టాక్ ఎలా ఉందంటే?

Leo Twitter Review: విజ‌య్ ర్యాంప్ ఆడించాడు - లియో ఓవ‌ర్‌సీస్ ప్రీమియ‌ర్స్ టాక్ ఎలా ఉందంటే?

19 October 2023, 6:26 IST

google News
  • Leo Twitter Review: ద‌ళ‌ప‌తి విజ‌య్ హీరోగా న‌టించిన లియో మూవీ గురువారం (అక్టోబ‌ర్ 19న) ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చింది. క‌శ్మీర్ బ్యాక్‌డ్రాప్‌లో యాక్ష‌న్ ఎంట‌ర్‌టైన‌ర్‌గా తెర‌కెక్కిన ఈ సినిమాకు లోకేష్ క‌న‌క‌రాజ్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించాడు.

ద‌ళ‌ప‌తి విజ‌య్ లియో మూవీ
ద‌ళ‌ప‌తి విజ‌య్ లియో మూవీ

ద‌ళ‌ప‌తి విజ‌య్ లియో మూవీ

Leo Twitter Review: ఈ ఏడాది కోలీవుడ్‌తో పాటు ద‌క్షిణాది సినీ అభిమానుల్లో అత్యంత ఆస‌క్తిని రేకెత్తించిన సినిమాల్లో లియో ఒక‌టి. ద‌ళ‌ప‌తి విజ‌య్ హీరోగా లోకేష్ క‌న‌క‌రాజ్‌ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందిన ఈమూవీ గురువారం (అక్టోబ‌ర్ 19న‌) వ‌ర‌ల్డ్ వైడ్‌గా రిలీజైంది. యాక్ష‌న్ ఎంట‌ర్‌టైన‌ర్‌గా రూపొందిన ఈ సినిమాలో త్రిష హీరోయిన్‌గా న‌టించ‌గా....సంజ‌య్‌ద‌త్‌, అర్జున్ ప్ర‌ధాన పాత్ర‌లు పోషించారు. ఈ సినిమా ఓవ‌ర్‌సీస్ ప్రీమియ‌ర్స్ టాక్ ఎలా ఉందంటే....

విజ‌య్ వ‌న్ మెన్ షో...

లియో ఓవ‌ర్‌సీస్ ప్రీమియ‌ర్స్‌కు పాజిటివ్ టాక్ ల‌భిస్తోంది. డిఫ‌రెంట్ యాక్ష‌న్ ఎంట‌ర్‌టైన‌ర్‌గా డైరెక్ట‌ర్ లోకేష్ క‌న‌క‌రాజ్ ఈ సినిమాను తెర‌కెక్కించాడ‌ని అంటున్నారు. విజ‌య్ యాక్టింగ్‌, స్క్రీన్ ప్ర‌జెన్స్‌, అత‌డిపై చిత్రీక‌రించిన యాక్ష‌న్ ఎపిసోడ్స్, గూస్‌బంప్స్‌ను క‌లిగిస్తాయ‌ని చెబుతోన్నారు. విజ‌య్ వ‌న్ మెన్ షోగా లియో ఉంటుంద‌ని అభిప్రాయ‌ప‌డుతోన్నారు.

గ్యాంగ్‌స్ట‌ర్‌గా...

ఫ‌స్ట్ హాఫ్‌లో ఓ సాధార‌ణ వ్య‌క్తిగా, సెకండాఫ్‌లో ప‌వ‌ర్‌ఫుల్ గ్యాంగ్‌స్ట‌ర్‌గా రెండు డిఫ‌రెంట్ వేరియేష‌న్స్‌లో విజ‌య్ క్యారెక్ట‌ర్ సాగుతుంద‌ని ట్వీట్స్ చేస్తున్నారు. ఇంట‌ర్వెల్ ట్విస్ట్ ఈసినిమాకు మైండ్‌బ్లోయింగ్‌గా నిలుస్తుంద‌ని అంటున్నారు. లోకేష్ సినిమాటిక్ యూనివ‌ర్స్‌లో లియో ఓ భాగ‌మ‌ని, ఖైదీతో లింక్ చేస్తూ లోకేష్ క‌న‌క‌రాజ్ సీన్స్ క్రియేట్ చేసిన విధానం హైలైట్‌గా ఉంటుంద‌ని చెబుతోన్నారు. ఖైదీలోని కొన్ని క్యారెక్ట‌ర్ ఈ సినిమాలో క‌నిపిస్తాయ‌ని పేర్కొంటున్నారు.

క్లైమాక్స్ ఫైట్ హైలైట్‌...

క్లైమాక్స్‌లో లియోదాస్‌, రోలెక్స్ ఫైట్ హైలైట్‌గా ఉంటుంద‌ని అంటున్నారు. సాంకేతికంగా సినిమా ఉన్నంత‌గా ఉన్న క‌థ విష‌యంలో డైరెక్ట‌ర్ లోకేష్ క‌న‌క‌రాజ్ రొటీన్‌గా అడుగులు వేశాడ‌ని చెబుతోన్నారు. ఫ‌స్ట్ హాఫ్ కొన్ని చోట్ల స్లోగా న‌డ‌వ‌డం ఇబ్బంది పెడుతోంద‌ని చెబుతోన్నారు. హైనా ఫైట్‌లోని గ్రాఫిక్స్ అంచ‌నాల‌కు త‌గ్గ‌ట్లుగా లేవ‌నే కామెంట్స్ వినిపిస్తున్నాయి.

అర్జున్ ఇంట‌ర్వెల్ టైమ్‌లోనే ఎంట్రీ ఇస్తాడ‌ని, సంజ‌య్ ద‌త్ క్యారెక్ట‌ర్ పూర్తిగా సెకండాఫ్‌లోనే క‌నిపిస్తుంద‌ని చెబుతున్నారు. అనిరుధ్ బీజీఎమ్ లియోకు బిగ్గెస్ట్ ప్ల‌స్ పాయింట్‌గా పేర్కొంటున్నారు. ద‌ళ‌ప‌తి విజ‌య్ ఫ్యాన్స్ ఫుల్ కిక్ ఇచ్చే మూవీగా లియో నిలుస్తుంద‌ని ట్వీట్స్ చేస్తున్నారు.

తదుపరి వ్యాసం