Lavanya Tripathi: పెళ్లి తర్వాత ఫస్ట్ మూవీని అనౌన్స్ చేసిన మెగా కోడలు లావణ్య త్రిపాఠి - టైటిల్ ఇదే!
15 December 2024, 13:41 IST
Lavanya Tripathi: పెళ్లి తర్వాత ఫస్ట్ మూవీకి లావణ్య త్రిపాఠి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. సతీలీలావతి పేరుతో ఓ మూవీ చేయబోతున్నది. లావణ్య త్రిపాఠి బర్త్‌డే సందర్భంగా ఆదివారం ఈ మూవీ టైటిల్‌ను అనౌన్స్‌చేశారు. ఈ సినిమాకు తాతినేని సత్య దర్శకత్వం వహిస్తోన్నాడు.
లావణ్య త్రిపాఠి
Lavanya Tripathi: మెగా హీరో వరుణ్‌తేజ్‌తో గత ఏడాది ఏడడుగులు వేసింది లావణ్య త్రిపాఠి. పెళ్లి తర్వాత సినిమాలకు ఏడాది పాటు గ్యాప్ ఇచ్చింది. ఈ మెగా కోడలు సినిమాలకు గుడ్‌బై చెప్పినట్లు ప్రచారం జరిగింది. ఈ పుకార్ల నేపథ్యంలో ఆదివారం రోజు కొత్త మూవీని అనౌన్స్‌చేసి అభిమానులకు సర్‌ప్రైజ్ ఇచ్చింది.
సతీ లీలావతి...
సతీ లీలావతి పేరుతో లావణ్య త్రిపాఠి ఓ మూవీ చేయబోతున్నది. లావణ్య త్రిపాఠి బర్త్‌డే సందర్భంగా ఆదివారం ఈ మూవీ టైటిల్‌ను రివీల్ చేశారు. ఈ సినిమాకు తాతినేని సత్య దర్శకత్వం వహిస్తోన్నాడు. గతంలో భీమిలీ కబడ్డీ జట్టు, ఎస్.ఎం.ఎస్(శివ మనసులో శృతి), శంకరతో పాటు మరికొన్ని సినిమాలు చేశాడు తాతినేని సత్య. దుర్గాదేవి పిక్చర్స్, ట్రియో స్టూడియోస్ పతాకాలపై నాగమోహన్ బాబు.ఎమ్, రాజేష్.టి ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు
డిఫరెంట్ రోల్...
సతీలీలావతి సినిమాలో లావణ్య త్రిపాఠి డిఫరెంట్ రోల్‌లో కనిపించబోతున్నట్లు సమాచారం. గత సినిమాలకు పూర్తి భిన్నంగా ఆమె క్యారెక్టర్ సాగుతుందని అంటున్నారు. త్వరలోనే ఈ మూవీ రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుంది. ఈ సినిమాలో ఇతర నటీనటుల ఎవరన్నది త్వరలోనే తెలియజేస్తామని నిర్మాతలు తెలిపారు.
సతీ లీలావతి మూవీ మిక్కీ జె.మేయర్ సంగీతం అందిస్తోన్నాడు. బినేంద్ర మీనన్ సినిమాటోగ్రాఫర్‌గా వర్క్ చేస్తున్నారు. గతంలో సతీలీలావతి పేరుతో కమల్‌హాసన్ సినిమా చేశాడు. ఈ మూవీ తమిళంతో పాటు తెలుగులో పెద్ద హిట్‌గా నిలిచింది. ఈ సూపర్ హిట్ మూవీ టైటిల్‌తో లావణ్య త్రిపాఠి సినిమా చేయడం బోతుండటం ఆసక్తికరంగా మారింది.
అందాల రాక్షసి...
అందాల రాక్షసి సినిమాతో టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చింది లావణ్య త్రిపాఠి. భలే భలే మగాడివోయ్, సోగ్గాడే చిన్ని నాయానాతో పాటు మరికొన్ని సినిమాలతో సక్సెస్‌లను అందుకున్నది. జయాపజయాలతో సంబంధం లేకుండా తెలుగులో వరుసగా అవకాశాలను అందుకుంటూ వచ్చింది. చివరగా 2022లో వచ్చిన హ్యాపీ బర్త్‌డే సినిమాతో తెలుగు ప్రేక్షకులను పలకరించింది.
వరుణ్‌తేజ్‌తో రెండు సినిమాలు...
మెగా హీరో వరుణ్ తేజ్‌తో మిస్టర్, అంతరిక్షం సినిమాలు చేసింది. ఈ సినిమాల షూటింగ్‌లోనే వరుణ్‌తేజ్ ఏర్పడిన పరిచయం ప్రేమగా మారింది. గత ఏడాది ఇటలీలో పెళ్లిచేసుకున్నారు.