తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Lavanya Tripathi: వరుణ్ తేజ్‌తో పెళ్లి తర్వాత మార్పుపై లావణ్య త్రిపాఠి కామెంట్స్.. ఇన్వాల్వ్ కాడంటూ!

Lavanya Tripathi: వరుణ్ తేజ్‌తో పెళ్లి తర్వాత మార్పుపై లావణ్య త్రిపాఠి కామెంట్స్.. ఇన్వాల్వ్ కాడంటూ!

Sanjiv Kumar HT Telugu

03 February 2024, 9:49 IST

google News
  • Lavanya Tripathi About Miss Perfect: హీరోయిన్ లావణ్య త్రిపాఠి తాజాగా నటించిన వెబ్ సిరీసి మిస్ పర్ఫెక్ట్. ఫిబ్రవరి 2 నుంచి స్ట్రీమింగ్ అవుతోన్న ఈ సిరీస్ ప్రమోషన్స్‌లో భాగంగా తాజాగా ఇంటర్వ్యూ ఇచ్చింది. అందులో వరుణ్ తేజ్‌తో పెళ్లి తర్వాత జరిగిన మార్పుల గురించి లావణ్య త్రిపాఠి కామెంట్స్ చేసింది.

వరుణ్ తేజ్‌తో పెళ్లి తర్వాత మార్పుపై లావణ్య త్రిపాఠి కామెంట్స్.. ఇన్వాల్వ్ కాడంటూ!
వరుణ్ తేజ్‌తో పెళ్లి తర్వాత మార్పుపై లావణ్య త్రిపాఠి కామెంట్స్.. ఇన్వాల్వ్ కాడంటూ!

వరుణ్ తేజ్‌తో పెళ్లి తర్వాత మార్పుపై లావణ్య త్రిపాఠి కామెంట్స్.. ఇన్వాల్వ్ కాడంటూ!

Lavanya Tripathi About Varun Tej: మెగా కోడలు లావణ్య త్రిపాఠి హీరోయిన్‌గా నటించిన ఇంట్రెస్టింగ్ వెబ్ సిరీస్ మిస్ పర్ఫెక్ట్. ఈ వెబ్ సిరీస్‌లో బిగ్ బాస్ ఫేమ్ అభిజీత్ హీరోగా నటించాడు. "మిస్ పర్ఫెక్ట్" వెబ్ సిరీస్‌ను అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్‌‌పై సుప్రియ యార్లగడ్డ నిర్మించారు. విశ్వక్ ఖండేరావ్ దర్శకత్వం వహించిన మిస్ పర్ఫెక్ట్ డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌లో ఫిబ్రవరి 2 నుంచి స్ట్రీమింగ్ అవుతోంది. ఈ సందర్భంగా లేటెస్ట్ ఇంటర్వ్యూలో ఈ సిరీస్ హైలైట్స్ తెలిపింది హీరోయిన్ లావణ్య త్రిపాఠి.

"మిస్ పర్ఫెక్ట్‌లో మంచి యాక్టర్స్ ఉన్నారు. అయితే నేను ఈ సిరీస్ గురించి మాట్లాడాలంటే ముందు స్క్రిప్ట్ గురించే చెప్పాలి. రొమాంటిక్, కామెడీ ఎలిమెంట్స్ బ్లెండ్ చేసిన గుడ్ స్క్రిప్ట్ ఇది. ఇలాంటి స్క్రిప్ట్ నాకు రావడం హ్యాపీగా ఉంది. ఇందులో రెగ్యులర్‌గా చూసే కామెడీ ఉండదు. డిఫరెంట్ క్యారెక్టర్స్ ఉంటాయి. ఈ వెబ్ సిరీస్‌లో నేను మిస్ లావణ్య, లక్ష్మీ అనే క్యారెక్టర్స్‌లో నటించాను. ఆమె ఒక పర్ఫెక్షనిస్ట్. అలా ప్రతి పనిలో పర్ఫెక్ట్‌గా ఉండాలనుకోవడం కొన్ని ఇబ్బందులు తీసుకొస్తుంది. ఈ క్యారెక్టర్స్‌లో అన్ని ఎమోషన్స్ ఉన్నాయి. ఒక నటిగా నేను భిన్నమైన రోల్స్ చేయాలని కోరుకుంటాను. ఆ క్రమంలో నాకు మిస్ పర్ఫెక్ట్‌లో చేసే ఛాన్స్ దక్కింది" అని లావణ్య పేర్కొంది.

"నేను నటించిన మిస్ లావణ్య, లక్ష్మీ క్యారెక్టర్స్ నా పర్సనల్ లైఫ్ కు దగ్గరగా ఉంటాయి. నేను రియల్ లైఫ్ లో కొద్దిగా ఈ క్యారెక్టర్స్ తో రిలేట్ చేసుకోగలను. ఇంట్లో ఉన్నప్పుడు లక్ష్మీలా ఉంటాను. సెట్ లో లావణ్య క్యారెక్టర్‌లా పర్పెక్షన్ కోరుకుంటాను. నేను అడిగి మరీ సెకండ్ టేక్స్ చేస్తుంటాను. సినిమాలకు వెబ్ సిరీస్‌కు పెద్ద తేడా ఏం కనిపించలేదు. మిస్ పర్ఫెక్ట్ షూటింగ్ ఒక సినిమాకు జరిగినట్లే అనిపించింది. అయితే ఇక్కడ 30 డేస్ షూట్‌తో కంప్లీట్ చేశాను. సినిమాకు అయితే ఏడాది పాటు వర్క్ చేయాల్సి వస్తుంది" అని లావణ్య తెలిపింది.

"వరుణ్ తేజ్‌తో పెళ్లి తర్వాత కెరీర్ పరంగా ఏమీ మారలేదు. మెగా కుటుంబంలోకి వచ్చాక నువ్వు ఇలా చేయాలి, అలా చేయాలి అని నాకు ఎవరూ చెప్పడం లేదు. కెరీర్ పరంగా నాకు కావాల్సినంత స్వేచ్ఛ ఉంది. వరుణ్ లాంటి అర్థం చేసుకునే లైఫ్ పార్టనర్ ఉన్నాడు. మిగతా వాళ్లు నన్ను చూసే విధానంలో తేడా ఉందేమో. మా వరకు గతంలోలాగే ఉన్నాం. ఒక పెద్ద ఫ్యామిలీలోకి అడుగుపెట్టడం గుడ్ ఫీలింగ్ ఇచ్చింది" అని లావణ్య త్రిపాఠి చెప్పుకొచ్చింది.

"మిస్ పర్ఫెక్ట్ సిరీస్‌ను వరుణ్ చూసి మంచి క్వాలిటీతో బాగుందని చెప్పాడు. తనకు సిరీస్ మొత్తం నచ్చింది. ఇన్ స్టాగ్రామ్‌లో పోస్ట్ కూడా చేశాడు. వరుణ్, నేను ఎవరి ప్రొఫెషనల్ వర్క్ వాళ్లం ముందుకు వెళ్తాం. నేను చేసే ప్రాజెక్ట్స్‌లో తను ఇన్వాల్వ్ కాడు. నేను ఎప్పుడైనా సెలెక్ట్ చేసుకున్న స్క్రిప్ట్ గురించి చెబితే వింటాడు. ఈ సిరీస్ స్క్రిప్ట్ వరుణ్ కు తెలుసు. చదివి బాగుందని చెప్పాడు" అని లావణ్య త్రిపాఠి తెలిపింది.

"కొత్త డైరెక్టర్స్‌తో వర్క్ చేయడం ఎప్పుడూ రిఫ్రెషింగ్ గా ఉంటుంది. విశ్వక్ ఖండేరావ్ రైటింగ్ యూనిక్ గా ఉంటుంది. అతనితో వర్క్ చేయడం హ్యాపీగా ఫీలయ్యా. సెట్‌లో ఎవరి ఓపీనియన్ అయినా తీసుకునేవారు. నేను చెప్పే సజెషన్స్ వినేవారు. పర్పెక్షనిస్ట్‌గా ఉండటం ఎలా ప్రాబ్లమ్ అయ్యింది అనేది మీరు ఈ సిరీస్‌లో చూస్తారు. కొత్త హీరోతో పీపుల్ మీడియా ఫ్యాక్టరీ సంస్థలో ఓ సినిమా ఫినిష్ చేశాను. అందులో పోలీస్ ఆఫీసర్ గా కనిపిస్తా. ఒక తమిళ్ మూవీ చేస్తున్నా" అని లావణ్య తన అప్ కమింగ్ సినిమాల గురించి చెప్పింది.

హిందుస్తాన్ టైమ్స్ తెలుగు నుంచి ఎంటర్‌టైన్మెంట్, అలాగే ఓటీటీ తాజా అప్‌డేట్స్ పొందండి.
తదుపరి వ్యాసం