తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Krithi Shetty: రామ్‌చరణ్‌ క్యూట్‌.. మహేష్‌ హ్యాండ్సమ్‌ అంటున్న ఉప్పెన బ్యూటీ

Krithi Shetty: రామ్‌చరణ్‌ క్యూట్‌.. మహేష్‌ హ్యాండ్సమ్‌ అంటున్న ఉప్పెన బ్యూటీ

HT Telugu Desk HT Telugu

05 July 2022, 20:34 IST

    • Krithi Shetty: క్యూట్‌ బేబీ కృతి శెట్టి మన హీరోల గురించి కామెంట్‌ చేస్తే ఎలా ఉంటుంది? ఈ సొట్ట బుగ్గల సుందరి ఈ మధ్య వారియర్‌ మూవీ ప్రమోషన్‌లో భాగంగా టాలీవుడ్‌ హీరోలపై ఇంట్రెస్టింగ్ కామెంట్స్‌ చేసింది.
కృతి శెట్టి
కృతి శెట్టి (twitter)

కృతి శెట్టి

ఉప్పెన సినిమాలో తన క్యూట్‌ లుక్స్‌తో తెలుగు ప్రేక్షకులను మైమరిపించింది కన్నడ బ్యూటీ కృతి శెట్టి. ఆ సినిమా మొదలు ఆమెకు ఆఫర్లు క్యూ కట్టాయి. ఉప్పెన తర్వాత శ్యామ్‌ సింగరాయ్‌, బంగార్రాజుల్లో కనిపించిన ఆమె లేటెస్ట్‌గా ది వారియర్‌తో రామ్ సరసన కనిపించనుంది. ప్రస్తుతం ఈ మూవీ ప్రమోషన్లలోనే కృతి చాలా బిజీగా ఉంది.

ట్రెండింగ్ వార్తలు

Kareena Kapoor Toxic: యశ్ టాక్సిక్ నుంచి తప్పుకున్న కరీనా కపూర్.. కారణం అదేనా?

Bharti Singh Hospitalised: హాస్పిటల్లో చేరిన ప్రముఖ కమెడియన్.. కంటతడి పెడుతూ వీడియో

Salaar TRP: ప్రభాస్ సలార్ మూవీకి టీవీలో దారుణమైన టీఆర్పీ.. ఆ రెండు సినిమాల కంటే తక్కువే.. కారణం ఇదేనా?

Kamal Haasan Linguswamy: కమల్ హాసన్ మోసం చేశాడు: నిర్మాతల మండలికి డైరెక్టర్ ఫిర్యాదు

ఈ సినిమాలో తొలిసారి ఎనర్జిటిక్‌ హీరో రామ్‌ పోతినేని పోలీస్‌ ఆఫీసర్‌ రోల్‌లో కనిపిస్తున్నాడు. ఈ మూవీ తెలుగుతోపాటు తమిళంలోనూ రిలీజ్‌ కానుంది. రామ్‌ ఇంటెన్స్‌ లుక్‌ ఈ సినిమాపై అంచనాలు భారీగా పెంచాయి. పైగా ఇదే సినిమాతో కోలీవుడ్‌లోనూ ఎంట్రీ ఇస్తోంది కృతి శెట్టి. ఈ సందర్భంగా మేకర్స్‌ నిర్వహిస్తున్న ప్రమోషనల్‌ ఈవెంట్స్‌లో కృతి శెట్టి మీడియాతో మాట్లాడింది.

అయితే టాలీవుడ్‌ హీరోలు రామ్‌చరణ్‌, మహేష్‌ బాబులపై ఆమె చేసిన కామెంట్స్ ఇప్పుడు వైరల్‌ అవుతున్నాయి. రామ్‌ చరణ్‌ సూపర్‌ క్యూట్‌గా ఉంటాడని, మహేష్‌ బాబు చాలా హ్యాండ్సమ్‌ అని కృతి అనడం విశేషం. ఈ ఇద్దరు హీరోలతో కలిసి నటించడానికి తాను ఎదురుచూస్తున్నట్లు కూడా ఆమె చెప్పింది. ఇక రానున్న ది వారియర్‌ మూవీలో కృతి శెట్టి.. విజిల్‌ మహాలక్ష్మి అనే ఆర్జే క్యారెక్టర్‌లో కనిపిస్తోంది.

ఈ సినిమా కాకుండా నాగ చైతన్యతో మరో మూవీ కూడా కృతి చేస్తోంది. ఇప్పటికే ఈ ఇద్దరూ బంగర్రాజులో కలిసి నటించిన విషయం తెలిసిందే. అటు కోలీవుడ్‌లో సూర్యతో నటించే ఛాన్స్‌ కూడా ఈ బ్యూటీ కొట్టేసింది. ఈ సినిమాపై తాను చాలా ఎక్సైటింగ్‌గా ఉన్నట్లు చెప్పింది.

హిందుస్తాన్ టైమ్స్ తెలుగు నుంచి ఎంటర్‌టైన్మెంట్, అలాగే ఓటీటీ తాజా అప్‌డేట్స్ పొందండి.