Krithi Shetty | ‘అరబిక్ కుతు’ పాటకు కృతిశెట్టి స్టెప్పులు చూశారా…
26 March 2022, 15:45 IST
టాలీవుడ్‌లో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్లలో ఒకరిగా చెలామణి అవుతోంది కృతిశెట్టి. ప్రస్తుతం నాలుగు సినిమాల్లో నటిస్తున్న ఈ ముద్దుగుమ్మ శుక్రవారం తమిళ చిత్రం బీస్ట్ లోని అరబిక్ కుతు పాటకు సరదాగా స్టెప్పులేసింది. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
కృతిశెట్టి
‘ఉప్పెన’ సినిమాతో టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చింది కన్నడ భామ కృతిశెట్టి. తొలి సినిమాలోనే నటనకు ప్రాధాన్యమున్న పాత్రలో కనిపించి మెప్పించింది. డిఫరెంట్ లవ్‌స్టోరీగా తెరకెక్కిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద వంద కోట్లకుపైగా కలెక్షన్స్ సాధించి బ్లాక్‌బస్టర్ హిట్‌గా నిలిచింది. ఈ విజయంతో తెలుగులో కృతిశెట్టికి పలు ఆఫర్స్ వరిస్తున్నాయి.
ప్రస్తుతం టాలీవుడ్ లో నాలుగు సినిమాలు అంగీకరించింది కృతిశెట్టి. శుక్రవారం తమిళ చిత్రం ‘బీస్ట్’ లోని అరబిక్ కుతు పాటకు కృతిశెట్టి సరదాగా డ్యాన్స్ చేసింది. ఈ వీడియోను ఇన్‌స్టాగ్రామ్ లో షేర్ చేసింది. చీరకట్టులో ఆమె వేసిన స్టెప్పులు, పాటకు తగినట్లుగా కనబరచిన ఎక్స్‌ఫ్రెషన్స్ ఫ్యాన్స్ ను ఆకట్టుకుంటున్నాయి. కృతిశెట్టి క్యూట్‌గా ఉందని,డ్యాన్స్ అద్భుతంగా చేసిందని నెటిజన్లు రిప్లై ఇస్తున్నారు. ఫ్రైడే మూడ్ అరబిక్ కుతు అంటూ ఈ వీడియోకు క్యాప్షన్ జోడించింది కృతిశెట్టి.
ప్రస్తుతం తెలుగులోనితిన్ తో ‘మాచర్ల నియోజకవర్గం’,రామ్ ‘ది వారియర్’ తో పాటు సుధీర్ బాబు సరసన ‘ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి’ సినిమాల్లో నటిస్తోంది కృతిశెట్టి. వీటితోపాటు విరించి వర్మ దర్శకత్వంలో ఆమె ఓ మహిళా ప్రధాన చిత్రం అంగీకరించినట్లు వార్తలొస్తున్నాయి.