తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Krishna Mukunda Murari February 3rd :ఊహించని మలుపు తిరిగిన కృష్ణ జీవితం.. భర్తకు అబద్ధాలు చెప్పి నమ్మిస్తున్న ముకుంద

Krishna mukunda murari february 3rd :ఊహించని మలుపు తిరిగిన కృష్ణ జీవితం.. భర్తకు అబద్ధాలు చెప్పి నమ్మిస్తున్న ముకుంద

Gunti Soundarya HT Telugu

03 February 2024, 7:35 IST

google News
    • Krishna mukunda murari serial february 3rd episode: కృష్ణ జీవితం ఊహించని మలుపు తీసుకుంది. అటు ముకుంద ఆదర్శ్ కి మాయ మాటలు చెప్పి తన మీద నమ్మకం మరింత కలిగేలా చేయడంతో సీరియల్ ఇంట్రెస్టింగ్ గా సాగుతోంది. ఈరోజు ఎపిసోడ్లో ఏం జరిగిందంటే.. 
కృష్ణ ముకుంద మురారి సీరియల్ ఫిబ్రవరి 3వ తేదీ ఎపిసోడ్
కృష్ణ ముకుంద మురారి సీరియల్ ఫిబ్రవరి 3వ తేదీ ఎపిసోడ్ (disney plus hotstar)

కృష్ణ ముకుంద మురారి సీరియల్ ఫిబ్రవరి 3వ తేదీ ఎపిసోడ్

Krishna mukunda murari serial february 3rd episode: పెద్దమ్మ మన సంగతి మనల్ని చూసుకోమని చెప్పారు కదా శోభనం చేసేసుకుందామని మురారి అంటాడు. మీరు తిట్టను కొట్టను అంటే ఒక విషయం చెప్తాను.. ఇన్నాళ్ళూ ఆగింది మా సంగతి మేము చూసుకోవడానికా పెట్టుడు ముహూర్తాలు అక్కర్లేదు రెండు జంటలకి కలిపి అదే ముహూర్తానికి చేసుకుంటామని చెప్పానని కృష్ణ చెప్పేసరికి మురారి బిత్తరపోతాడు. సరదాగా కొట్టబోతుంటే కృష్ణ భయపడి పారిపోతుంది. వెంటనే తనని వెనక్కి పిలుస్తాడు. పంతులు పెట్టిన ముహూర్తానికి పెద్దమ్మ ఒప్పుకోకపోతే ఏం చేద్దామని మురారి అంటాడు.

ముకుంద మీద అనుమానం తొలగించాలన్న కృష్ణ

పెద్దత్తయ్య ముకుంద మీద ఇంకా నమ్మకం కలగలేదు. వాళ్ళిద్దరూ బాగాలేరు అనే భ్రమ తొలగించి బాగున్నారు అనే నమ్మకం కలిగించాలని కృష్ణ చెప్తుంది. ఇందాక గోపి ఫోన్ చేశాడు బెస్ట్ కపుల్ కాంపిటీషన్ పెడుతున్నాడంట మనల్ని పార్టిసిపెట్ చేయమని అడిగాడు. మనతో పాటు ఆదర్శ్, ముకుంద పేర్లు కూడా ఇస్తే పెద్దమ్మ అనుమానాలు పటాపంచలు అయిపోతాయని మురారి ఐడియా ఇస్తాడు. ఇది డెఫినెట్ గా వర్కవుట్ అవుతుందని అంటుంది కానీ వాళ్ళే గెలుస్తారని గ్యారంటీ ఏంటని కృష్ణ డౌట్ పడుతుంది. అది తర్వాత మ్యానేజ్ చేద్దాంలే అంటాడు.

కృష్ణ వంట చేసి ఎలా ఉందని మురారిని అడుగుతుంది. అన్ని కూరలకి వంకలు పెడతారు. ఏమైంది నీకు ఈరోజే వంట నేర్చుకున్నట్టు వండావ్ ఏంటని భవానీ అడుగుతుంది. మాములుగైతే ఇలా చెయ్యవు కదా ఏ తింగరి ఏమైందని మురారి అడుగుతాడు. కృష్ణ నందిని వైపు కొరకొరా చూస్తుంది. కృష్ణకి వంటలో హెల్ప్ చేసింది తనేనని నందిని చెప్తుంది. పక్కనే ఉండి వంట చేసేటప్పుడు టేస్ట్ చేయాలా లేదా అని మురారి అంటాడు. దానికి మధు కౌంటర్ వేస్తూ కాసేపు నవ్విస్తాడు. మురారి బెస్ట్ కపుల్ కాంపిటీషన్ లో ముకుంద, ఆదర్శ్ పేర్లు ఇచ్చామని మురారి చెప్పగానే ముకుంద షాక్ అయిపోతుంది. మా పేర్లు ఎందుకు నువ్వు కృష్ణ పార్టిసిపెట్ చేయవచ్చు కదా అంటుంది. మా పేర్లు ఇచ్చాం, మాతో పాటు మీ పేర్లు కూడా ఇచ్చామని కృష్ణ చెప్తుంది. ఇప్పుడు తొండ సంగతి, ఉంగరం సంగతి అన్ని తేలిపోతాయని మధుకర్ అనుకుంటాడు.

బెస్ట్ కపుల్ కాంపిటీషన్ కి వెళ్ళడం ఇష్టం లేదన్న ముకుంద

కాంపిటీషన్ లో పార్టిసిపెట్ చేయడానికి తనకి ఒకేనని ఆదర్శ్ చెప్తాడు. ముకుందని తన నిర్ణయం గురించి అడిగితే ఏం చెప్పాలో తెలియక మౌనంగా ఉంటుంది. ఎవరిని బలవంతం చేయవద్దని భవానీ అంటుంది. అలా ఏం లేదు ఆదర్శ్ ఇప్పుడే కదా వచ్చాడు ఇప్పుడు ఇవన్నీ ఎందుకని కవర్ చేసేందుకు చూస్తుంది. దీంతో మధు కల్పించుకుంటాడు. అవును మధు ఇష్టం లేకే అని ముకుంద అనేసరికి అందరూ షాక్ అవుతారు.

ఇష్టం లేదంటే ఆదితో కలిసి పార్టిసిపెట్ చేయడమని కాదు అక్కడ ఎవరైనా ఏమైనా అంటే ఆది తట్టుకోలేడెమో అని అలా అన్నానని చెప్తుంది. ఆదర్శ్ ని ఎవరు ఏమని అంటారని రేవతి అడుగుతుంది. బెస్ట్ కపుల్ కాంపిటీషన్ లో ఏ గొడవలు లేకుండా అన్యోన్యంగా ఉండే దంపతులని తీసుకుంటారు కానీ మేము కలిసి ఉన్నది లేదు పెళ్ళైన తర్వాత ఎందుకు దూరంగా ఉన్నారని అడిగితే ఏం చెప్పాలి. అందరి ముందు తల దించుకోవడం తప్ప చెప్పడానికి సమాధానం ఏముంటుంది. ఇంతవరకు నావల్ల జరిగింది చాలు ఆదికి మళ్ళీ నా వల్ల తలదించుకునే పరిస్థితి రాకూడదు అంటుంది.

ముకుందని ఒప్పించిన మురారి

నువ్వు చెప్పింది కరెక్టే ముకుంద కానీ ఎక్కువ కాలం కలిసి ఉండే కపుల్స్ బెస్ట్ కపుల్ అయితే లోకంలో 90 శాతం మంది బెస్ట్ కపుల్ కావాలి. కానీ అందరూ అవరు కదా వందేళ్లు ఒకే ఇంట్లో కలిసి ఉన్నా బెస్ట్ కపుల్ కాలేరు. బెస్ట్ కపుల్ అంటే ఎంత కాలం కలిసి ఉన్నామనేది కాదు ఉన్న దూరాన్ని అధిగమించి ఎలా కలిసి ఉన్నామనేదని మురారి చెప్తాడు. సూపర్ గా చెప్పారని కృష్ణ విజిల్ వేస్తుంది. ఇంకేం ఆలోచించొద్దు మీరు ఈ కాంపీటేషన్ లో పార్టిసిపెట్ చేసి గెలుస్తున్నారు. దీంతో మీ మీద ఉన్న అపోహలు తొలగిపోతాయని కృష్ణ చెప్తుంది. ఆది అని ఎంత సాఫ్ట్ గా మాట్లాడుతుంది తనకి ఇష్టం లేనివన్నీ తెలివిగా మ్యానేజ్ చేస్తుంది ఎంత కాలం ఇలా చేస్తుందో చూద్దామని మధు అనుకుంటాడు.

రింగ్ పెట్టడం దగ్గర నుంచి తప్పించుకున్నానని అనుకుంటే ఈరోజు బెస్ట్ కపుల్ కాంపిటీషన్ అంటున్నారు. ఈరోజు దీని నుంచి ఎలా తప్పించుకోవాలి. ఇలా దిన దిన గండం ఎన్నాళ్ళు. శాశ్వతంగా ఏదో ఒక పరిష్కారం చూడాలని ముకుంద మనసులో అనుకుంటుంది. భవానీ ముకుంద చెప్పిన మాటల గురించి ఆలోచిస్తుంది. ఎవరు ఏమైనా అంటే ఆదర్శ్ ఫీల్ అవుతాడనే వద్దు అని చెప్పిందా లేకపోతే ఆదర్శ్ తో వెళ్ళడం ఇష్టం లేకనా. ఆదర్శ్ కి ఫ్రెండ్స్ తో బయటకి వెళ్ళడం ఇష్టం. నైట్ బయటకి వెళ్ళడం మరీ ఇష్టం కానీ ముకుంద ముందే కలుగజేసుకుని వద్దని చెప్పించింది. ఆదర్శ్ కాదనలేక నీ ఇష్టం అన్నాడు. మొన్న ఇలాగే పెట్టమని రింగ్ ఇస్తే పెట్టమని కృష్ణకి ఇచ్చింది. ఇవన్నీ చూస్తుంటే తన మీద అనుమానం రోజురోజుకీ పెరిగిపోతుంది.

ముకుంద మీద బలపడుతున్న భవానీ అనుమానం

ఆదర్శ్ అంటే తనకి ఇష్టం లేదు బెస్ట్ కపుల్ కాంపిటీషన్ అంటున్నారు కదా చూద్దాం తనతో నిలబడుతుందా లేదంటే ఏదో ఒక ప్లాన్ వేసి తప్పించుకుంటుందా? ముకుంద మీద మాత్రం అనుమానం ఖచ్చితంగా ఉందని భవానీ అనుకుంటుంది. గదిలోకి వచ్చిన ముకుందతో మనం కూడా మురారి వాళ్ళతో బయటకి వెళ్తే బాగుండేది ఏమోనని ఆదర్శ్ తో అంటాడు. నీకు వాళ్ళతో కలిసి వెళ్ళడం ఇష్టం లేదు కదా అని అడుగుతాడు. వాళ్ళతో కాదు మీతో కలిసి వెళ్ళడం ఇష్టం లేదు ఆ మాట మీ మొహాన చెప్పలేనని మనసులో అనుకుంటుంది.

ఇంట్లో వాళ్ళతో కలిసి ఉంటున్నాం బయటకి వెళ్ళడానికి అభ్యంతరం ఏముంది. మీకు నా మీద నమ్మకం లేదా అని అడుగుతుంది. నమ్మకం లేకపోతే నేను వస్తానా? నువ్వు మాట్లాడిన దాని బట్టి అలా అనిపించి అడిగాను నీకు వెళ్ళడం ఇష్టం లేక తప్పించుకోవడానికి అలా చెప్పావని అనిపించిందని అంటాడు. తప్పించుకోవడానికి అలా చెప్పాను కానీ మీరు అనుకున్నట్టు వాళ్ళతో వెళ్ళడం ఇష్టం లేక కాదు మీకు చెప్పాను కదా నాకు డస్ట్ ఎలర్జీ ఉంది. నైట్ టైమ్ ఎక్కువ సఫర్ అవుతాను. ఈ విషయం ఇంట్లో వాళ్ళకి చెప్తే మీతో రావడం ఇష్టం లేక అలా చెప్తున్నానని అనుకుంటారు. ఇప్పుడు మీకు కూడా నేను సాకులు చెప్తున్నానని అనిపించవచ్చని ముకుంద అంటుంది. నేను పూర్తిగా మారిపోయాను కానీ అత్తయ్యకి ఇంట్లో ఇంకొంత మందికి నమ్మకం కలగడం లేదని బాధపడుతుంది.

అన్నింటికీ కాలమే సమాధానం చెప్తుంది. కృష్ణ మురారి నమ్మారు తర్వాత నేను నమ్మాను. నీలో వచ్చిన మార్పు నిజమైనప్పుడు అందరికీ అదే నమ్మకం కలిగిస్తుందని ఆదర్శ్ చెప్తాడు. మురారి, కృష్ణ బయటకి వెళతారు. కృష్ణ ఏదో ఆలోచిస్తూ ఉంటే ఏమైందని అడుగుతాడు. ఏం లేదని చెప్తుంది. వాళ్ళు బైక్ మీద వెళ్తూ ఉంటే ఒక పిల్లాడు అడ్డం వస్తాడు.

తరువాయి భాగంలో..

కృష్ణ మురారిని తీసుకుని గుడికి వస్తుంది. ఏవేవో భయాలు పెట్టుకుని మనసు పాడుచేసుకోవద్దని చెప్తాడు. కానీ కృష్ణ మాత్రం ఒకసారి జరిగితే ఏం కాదు కానీ పదే పదే జరుగుతుందని భయపడుతుంది. గుడిలో పంతులు మృత్యుంజయ మంత్రం పఠిస్తూ గుడిలో దేవుడి ముందు హారతి కర్పూరం వెలిగించమని చెప్తాడు. కృష్ణ కర్పూరం వెలిగించి దేవుడికి దణ్ణం పెట్టుకోగానే అది ఆరిపోతుంది. దీంతో కృష్ణ మరింత భయపడుతుంది.

హిందుస్తాన్ టైమ్స్ తెలుగు నుంచి ఎంటర్‌టైన్మెంట్, అలాగే ఓటీటీ తాజా అప్‌డేట్స్ పొందండి.
తదుపరి వ్యాసం