Krishna Mukunda Murari July 10th Episode: మురారిని క్షమించనని చెప్పిన భవానీ - కృష్ణ లవ్ స్టోరీలో మరో ట్విస్ట్?
10 July 2023, 9:21 IST
Krishna Mukunda Murari July 10th Episode: పెళ్లికి ముందు ముకుంద ప్రేమించింది ఎవరినో కనిపెట్టమని మురారిని కోరుతుంది భవానీ. ముకుంద ప్రేమించింది తననే అనే నిజం భవానీకి చెప్పలేకపోతాడు మురారి. ఆ తర్వాత నేటి కృష్ణ ముకుంద మురారి సీరియల్లో ఏం జరిగిందంటే...
కృష్ణ ముకుంద మురారి సీరియల్
Krishna Mukunda Murari July 10th Episode: కృష్ణకు తన ప్రేమ గురించి చెప్పాలని మురారి అనుకుంటాడు. కానీ ఆ మాట చెప్పడానికి భయపడిపోతాడు. అతడి భయాన్ని గమనించి కృష్ణ కళ్లు మూసుకుంటుంది. అప్పుడు కూడా మాట రాక మురారి తడబడిపోతాడు.తన ప్రేమను కృష్ణ ఎక్కడ నిరాకరిస్తుందో అనే ఆందోళన పడతాడు. చివరకు ఎలాగోకష్టపడి సగం మాట పూర్తిచేసేలోగా అలేఖ్య వచ్చి డిస్ట్రబ్ చేస్తుంది. భవానీ పిలుస్తుందని మురారితో అంటుంది.
రంగంలోకి దిగిన ముకుంద...
మురారి ఫొటోలు చూస్తూ నువ్వుంటే నాకు పిచ్చి బంగారం అని ఎమోషనల్ అవుతుంది ముకుంద. నేను ఉండగా నీ ప్రేమను కృష్ణకు ఎలా దక్కనిస్తానని అనుకుంటుంది. ఒక్కసారి నా హృదయంలో ఒకరికి స్థానం ఇచ్చానంటే నా గుండె చెప్పుడు ఆగిపోయేవరకు ఆ స్థానం వారికి మాత్రమే సొంతమని నిశ్చయించుకుంటుంది.
ఒకసారి నా ప్రేమను త్యాగం చేసి తప్పుచేశానని అనుకుంటుంది. ఇన్నాళ్లు నువ్వు నా ప్రేమను అర్థం చేసుకుంటావని ఆశతో ఎదురుచూశానని, కానీ ఇప్పుడు కృష్ణ కూడా నిన్ను ప్రేమిస్తుందని తెలిసిన తర్వాత కూడా ఎదురుచూడటం తన తప్పే అవుతుందని మురారి ఫొటో చూస్తూ తనలో తానే మాట్లాడుకుంటుంది.
భవానీతో రహస్యాలు చెప్పి....
కృష్ణతో నీది అగ్రిమెంట్ మ్యారేజీ అనే విషయం భవానీతో చెప్పి నిన్ను నేను సొంతం చేసుకుంటానని మురారి ఫొటోతో ఛాలెంజ్ చేస్తుంది ముకుంద. ఇంతలోనే ఆమె గదిలోకి కృష్ణ అడుగుతుపెడుతుంది. కృష్ణను అక్కడ చూసి ముకుంద షాక్ అవుతుంది. కృష్ణ కంట పడకుండా మురారితో తాను దాగిన ఫొటోను దాచిపెడుతుంది.
కానీ అనుకోకుండా ఆ ఫొటో కిందపడుతుంది. దానిని కృష్ణ తీసి ముకుందకు ఇస్తుంది. ఆ ఫొటో మాత్రం కృష్ణ చూడదు. గీతిక ఏమైనా కలిసిందా అని ముకుందను ఆరాలు తీస్తుంది కృష్ణ. మురారిని కృష్ట ప్రేమిస్తోన్న సంగతిని బయటపెట్టడం కోసమే ఆమె ఆరాలు తీస్తుందని ముకుంద పొరపడుతుంది. గీతిక తనను కలవలేదని అబద్దం ఆడుతుంది.
భవానీ ఎమోషనల్...
వచ్చి రావడంతోనే మురారిని కోపగించుకున్నందుకు పశ్చత్తాపపడుతుంది భవానీ. అదే విషయాన్ని మురారితో అంటుంది. కానీ ఆ మాటల్ని తాను పాజిటివ్‌గానే తీసుకున్నట్లు పెద్దమ్మతో అంటాడు మురారి. ఆశ్రమానికి వెళ్లేరోజు ముకుందకు విడాకులు ఇప్పించమని ఆమె తండ్రి అన్న మాటలు తనను బాధపెట్టాయని మురారితో చెబుతుంది భవానీ. ఆదర్శ్‌కు తిరిగి ఇంటికి రావడం ఇష్టం లేదని శ్రీనివాస్ తనతో అన్నాడని భవానీ ఎమోషనల్ అవుతుంది.
ఆదర్శ్ ఇంటికి రాకూడదని ఎందుకు అనుకుంటాడని కన్నీళ్లు పెట్టుకుంటుంది. కాలేజీ డేస్‌లో ఆదర్శ్ ఎవరినైనా ప్రేమించాడా? అని మురారిని అడుగుతుంది భవానీ. లేదని పెద్దమ్మకు సమాధానం చెబుతాడు మురారి. పెళ్లికి ముందు ఆదర్శ్ ఎవరిని ప్రేమించలేదు సరే..మరి ముకుంద ఎవరినైనా ప్రేమించి ఉండొచ్చు కదా అని మురారిని మరో ప్రశ్న అడుగుతుంది భవానీ. ముకుంద ప్రేమ గురించి తెలిసే ఆదర్శ్ ఇంటి నుంచి వెళ్లిపోయి ఉండొచ్చునని భవానీ సందేహం వ్యక్తం చేస్తుంది. ఆమె మాటలతో మురారి షాక్ అవుతాడు.
నిజాన్ని కరెక్ట్‌గా ఊహించడంతో ఆమెకు ఏం చెప్పాలోతెలియక సతమతమవుతాడు. ఆదర్శ్ వెళ్లిపోవడం వెనకున్న నిజాలు ఏమిటో తెలుసుకొని తనకు చెబుతానని మాటివ్వమని మురారిని కోరుతుంది భవానీ. సరే అని పెద్దమ్మకు మాటిస్తాడు మురారి. గతంలో ఒకసారి మాట తప్పావని, ఈ సారి మాట తప్పితే తాను తట్టుకోలేనని అంటుంది. జీవితాంతం నిన్ను క్షమించనని మురారిని హెచ్చరిస్తుంది భవానీ.
మురారి కన్ఫ్యూజన్..
ముకుంద ప్రేమ సంగతి కనుక్కొనే బాధ్యత తనకే అప్పగించడంతో మురారికి ఏం పాలుపోదు. ముకుంద ప్రియుడిని తానే అనే విషయం భవానీకి ఎలా చెప్పాలో అంతుపట్టక తానలో తానే నలిగిపోతాడు. తన వల్లే ముకుంద జీవితం పాడైపోయిందనే అపోహతో ముకుందతో పెద్దమ్మ తన పెళ్లి జరిపిస్తే కృష్ణ పరిస్థితి ఏమైపోతుందో అని కంగారు పడతాడు.
సీరియస్‌గా ఆలోచిస్తోన్న అతడి దగ్గరకు కృష్ణ వచ్చి ఇందాక ఏదో చెప్పాలని ఆగిపోయారు? అదేమిటో చెప్పమని అడుగుతుంది. కానీ మురారి మాత్రం ఇప్పుడు కాదు తర్వాత చెబుతానని మాట దాటేస్తాడు.
మురారి ప్లాన్ వర్కవుట్ అవుతుందా?
మా హాస్పిటల్లో ఓ స్టోరీ జరిగిందని తమ కథనే మార్చి మురారితో చెబుతుంది కృష్ణ. అలాంటి పరిస్థితుల్లో మీరు ప్రేమించి అమ్మాయి వైపు ఉంటారా? పెళ్లి చేసుకున్న భార్య వైపు ఉంటారా? అని అడుగుతుంది. మన జీవితంలో కొన్ని ప్రశ్నలకు సమాధానం దొరకదని, అందుకే ఆ ప్రేమికుడు తప్పించుకుతిరుగుతున్నాడని మురారి సమాధానమిస్తాడు.
మురారి కూడా అలాగే తప్పించుకు తిరుగితే తన పరిస్థితి ఏమిటని కృష్ణ మనసులోనే బాధపడుతుంది. కృష్ణకు డైరెక్ట్‌గా ప్రేమను వ్యక్తం చేయడం కష్టంగా ఉండటంతో బెలూన్స్ ద్వారా ఐ లవ్ యూ కృష్ణ అని బెడ్రూమ్లో డెకరేట్ చేస్తాడు మురారి. కానీ అనుకోకుండా ఆ డెకరేషన్‌ను ముకుంద చూస్తుంది. అక్కడితో నేటి కృష్ణ ముకుంద మురారి సీరియల్ ముగిసింది.