Krishna Mukunda Murari August 7th Episode: కృష్ణ మెడలో మూడుముళ్లు వేసిన మురారి - ముకుంద ఫుల్ హ్యాపీ!
07 August 2023, 9:15 IST
Krishna Mukunda Murari August 7th Episode: పొడుపు కథల పోటీ ద్వారా మురారితో తనకున్న బంధాన్ని ఇన్‌డైరెక్ట్‌గా బయటపెడుతుంది కృష్ణ. మురారి తనకు భర్త కాదని చెబుతుంది. ఆ తర్వాత నేటి కృష్ణ ముకుంద మురారి సీరియల్‌లో ఏం జరిగిందంటే...
కృష్ణ ముకుంద మురారి సీరియల్
Krishna Mukunda Murari August 7th Episode: మురారి, కృష్ణ మళ్లీ పెళ్లికి ఏర్పాట్లు వైభవంగా జరుగుతోంటాయి. ఒకరిపై మరొకరికి ప్రేమ లేదనే అపోహతో పాటు తమది అగ్రిమెంట్ మ్యారేజీ అనే నిజం భవానీకి చెప్పలేక ముభావంగా ఉంటారు కృష్ణ, మురారి. వారి ముఖంలో పెళ్లి ఆనందం కొంచెం కూడా కనిపించదు. అసలు కృష్ణ, మురారిల మనసులో ఏముంది?
కృష్ణ మనసులో మురారి పట్ల కేవలం కృతజ్ఞత భావం ఉంటే పెళ్లికి ఎలా సిద్ధమవుతుంది? ఇద్దరి ఆలోచనల్లో తప్పు ఉందా? అని నందు అనుమానపడుతుంది. మరోవైపు నందు ఆలోచనల్ని ముకుంద కనిపెడుతుంది. కృష్ణ, మురారిల మనసుల్లో ఉన్న ప్రేమను బయటపెట్టి నందునే వారిని కలిపేలా ఉందని ముకుంద టెన్షన్ పడుతుంది. కృష్ణను నందు అసహ్యించుకునేలా చేయాలని అనుకుంటుంది.
ఎన్ని పూజలు చేసినా...
కృష్ణ, మురారిల ఇష్టాలు తెలియకుండా ఎన్ని పూజలు చేసిన వాళ్ల మనసులో ప్రేమను పుట్టించలేమని రేవతి మనసులోనే బాధపడుతుంది. అందరూ తమపై సెటైర్స్ వేస్తున్నా కృష్ణ, మురారి మాత్రం డల్‌గానే ఉంటారు. ఫ్యామిలీ మెంబర్స్ రెండు టీమ్‌లుగా విడిపోయి పొడుపు కథల పోటీ పెట్టుకుంటారు. మగవాళ్లు ఓ టీమ్, లేడీస్ మరో టీమ్‌గా విడిపోతారు. ఈ పొడుపు కథల పోటీలో కృష్ణ, మురారి మాత్రం సెలైంట్‌గా ఉంటారు. ఆటలో ఉన్నా లేనట్లుగానే ఉండిపోతారు.
కృష్ణ పొడుపు కథ...
పొడుపు కథను అడ్డంపెట్టుకొని తమ మధ్య ఉన్న బంధం ఎక్కడ బయటపెడుతుందో అని మురారి భయపడతాడు. అన్నట్లుగానే తాళి కడతాడు. మెట్టెలు తొడుగుతాడు. ఉంగరం కూడా తొడుగుతాడు. కానీ అతడు ఆమెకు భర్త కాదని మురారి టీమ్‌పై పొడుపు కథ సంధిస్తుంది కృష్ణ.
ఆమె పొడుపు కథ విని మురారితో పాటు ముకుంద కూడా షాకవుతుంది. ఆవిడ నువ్వు, అతడు నేను మనం ఒకరికి ఒకరం ఏం కాదు కదా. ఈ పొడుపు కథ అర్థం అదేనా అని మురారి మనసులోనే అనుకుంటాడు. అంటే కృష్ణకు నిజంగానే మురారి అంటే ఇష్టం లేదా? లేకపోతే తాళి కట్టిన వాడు భర్త కాదని ఎందుకు అంటుదని కృష్ణ పొడుకు కథను ఉద్దేశించి నందు అనుమానపడుతుంది.
మురారి షాక్...
అగ్రిమెంట్ మ్యారేజీ గురించి పొడుపు కథ ద్వారా కృష్ణ ఇన్‌డైరెక్ట్‌గా బయటపెట్టిందని ముకుంద ఆనందపడుతుంది. కృష్ణ పొడుపు కథ విప్పడంలో మురారి టీమ్ ఫెయిలవుతుంది. దాంతో కృష్ణనే సమాధానం చెప్పమని భవానీని కోరుతుంది. కానీ కృష్ణ మాత్రం మురారినే చూస్తూ ఉండిపోతుంది. దాంతో ఆమె ఏం చెబుతుందా అని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తుంటారు.
మురారికి సమాధానం తెలుసునని కృష్ణ అంటుంది. తనకు సమాధానం తెలియదని కృష్ణకు బదులిస్తాడు మురారి. నిజంగా మీకు తెలియదా ఏసీపీ సార్ అని మరోసారి ప్రశ్నిస్తుంది కృష్ణ. తన పొడుపు కథకు పూజారి అని సమాధానం చెబుతుంది.
పొడుపు కథతో మరోసారి తనపై ఎలాంటి ప్రేమ లేదని కృష్ణ చాటిచెప్పిందని మురారి అనుకుంటాడు. నిజంగానే మురారిపై కృష్ణకు ప్రేమ లేదని నందు, రేవతి కూడా అనుకుంటారు. ఓడిపోయినందుకు పనిష్‌మెంట్‌గా కృష్ణకు మురారి గోరింటాకు పెట్టాలని చెబుతుంది భవానీ. పెద్దమ్మ చెప్పినట్లుగానే చేస్తాడు మురారి.
పెళ్లి వేడుకలో...
మురారి భార్యగా అతడితో కలిసి జంటగా పాల్గొనే చివరి వేడుక ఇదేనని, అతడు కట్టిన తాళిని ఎప్పటికీ తీయకూడదని కృష్ణ అనుకుంటుంది. కృష్ణతో గడిపే చివరి వేడుకను జీవితాంతం గుర్తుపెట్టుకోవాలని మురారి అనుకుంటాడు. అక్కడితో నేటి కృష్ణ ముకుంద మురారి సీరియల్ ముగిసింది. పూజారి చెప్పిన పెళ్లి మంత్రాలను పఠిస్తూ కృష్ణ మెడలో మూడు ముళ్లు వేస్తాడు మురారి. ఆ తర్వాత ఏం జరిగిందన్నది మంగళవారం ఎపిసోడ్‌లో చూడాల్సిందే.