తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Ott Korean Dramas: కొరియన్ డ్రామాలంటే మీకు ఇష్టమా.. ఈ ఓటీటీల్లో వాటిని ఫ్రీగా చూసేయొచ్చు

OTT Korean Dramas: కొరియన్ డ్రామాలంటే మీకు ఇష్టమా.. ఈ ఓటీటీల్లో వాటిని ఫ్రీగా చూసేయొచ్చు

Hari Prasad S HT Telugu

10 October 2024, 22:07 IST

google News
    • OTT Korean Dramas: కొరియన్ డ్రామాలంటే మీకు ఇష్టమా? లేదంటే ఇప్పుడిప్పుడే వాటిని ఫాలో అవుతున్నారా? అయితే ఇప్పుడు చెప్పబోయే ఓటీటీల్లో వాటిని ఫ్రీగా చూసేయొచ్చు. వీటిలో కొన్ని తెలుగులో అందుబాటులో ఉండగా.. మరికొన్ని ఇంగ్లిష్ సబ్ టైటిల్స్ తో చూడొచ్చు.
కొరియన్ డ్రామాలంటే మీకు ఇష్టమా.. ఈ ఓటీటీల్లో వాటిని ఫ్రీగా చూసేయొచ్చు
కొరియన్ డ్రామాలంటే మీకు ఇష్టమా.. ఈ ఓటీటీల్లో వాటిని ఫ్రీగా చూసేయొచ్చు

కొరియన్ డ్రామాలంటే మీకు ఇష్టమా.. ఈ ఓటీటీల్లో వాటిని ఫ్రీగా చూసేయొచ్చు

Korean Dramas: ఓటీటీలే కాదు ఇది కొరియన్ డ్రామాల హవా నడుస్తున్న కాలం. ఈ ఓటీటీల పుణ్యమాని ఇంట్లో కూర్చొని ప్రపంచవ్యాప్తంగా వివిధ భాషల కంటెంట్ ను చూసే అవకాశం ప్రేక్షకులకు దక్కుతోంది. అలా కొరియన్ డ్రామాలకు మెల్లగా మన ప్రేక్షకులు కూడా అలవాటు పడ్డారు. మరి వీటిని ఫ్రీగా కూడా చూసే వీలుందని మీకు తెలుసా?

కొరియన్ డ్రామాస్ ఇక్కడ చూసేయండి

కొరియన్ డ్రామాస్ కు ఇప్పుడు దేశంలోనే కాదు తెలుగు రాష్ట్రాల్లోనూ వీరాభిమానులు ఉన్నారు. రొమాన్స్, కామెడీ, క్రైమ్ థ్రిల్లర్, హారర్.. ఇలా వివిధ జానర్ల మూవీస్, వెబ్ సిరీస్ పలు ఓటీటీల్లో అందుబాటులో ఉన్నాయి. వాటిలో కొన్నింటిని ఫ్రీగా కూడా చూడొచ్చు.

హులు ఓటీటీ

ప్రముఖ ఓటీటీల్లో ఒకటి హులు. ఇందులో ఎన్నో భాషల కంటెంట్ ఉన్నా.. కొరియన్ డ్రామాస్ కు బాగా పాపులర్. అందులోనూ వీటిని ఫ్రీగా చూసే అవకాశం కల్పిస్తోంది. ఇంగ్లిష్ సబ్ టైటిల్స్ తో వీటిని చూడొచ్చు. ఒకేసారి మల్టీపుల్ డివైసెస్ లోనూ చూసే వీలుండటం మరో సానుకూలంశంగా చెప్పొచ్చు.

ఎంఎక్స్ ప్లేయర్

ఈ మధ్యే అమెజాన్ కొనుగోలు చేసిన మరో ఓటీటీ ఎంఎక్స్ ప్లేయర్. ఇది కూడా కొరియన్ డ్రామాస్ కు మంచి అడ్డా. అందులోనూ తెలుగులో డబ్ అయిన ఎన్నో కొరియన్ మూవీస్, వెబ్ సిరీస్ ఇందులో ఉన్నాయి. వీటిని ఎలాంటి సబ్‌స్క్రిప్షన్ లేకుండా ఫ్రీగా చూసేయొచ్చు. ఒకవేళ తెలుగు డబ్బింగ్ లేకపోతే సబ్ టైటిల్స్ ఆప్షన్ అయితే కచ్చితంగా ఉంటుంది. ఇందులో డౌన్ లోడ్ చేసుకొని మరీ చూసే వీలుంది.

యూట్యూబ్

కొరియన్ డ్రామాస్ ఫ్రీగా చూడటానికి మరో బెస్ట్ ఆప్షన్ యూట్యూబ్. అప్పుడప్పుడే కొరియర్ డ్రామాస్ కు అలవాటు పడుతున్న వారికైతే ఇది బెస్ట్ ప్లాట్‌ఫామ్. అంతేకాదు ప్రతి స్మార్ట్ ఫోన్ లోనూ ఉండే యాప్ ఇది. ఎవరైనా చాలా సులువుగా ఎలాంటి కంటెంట్ అయినా యాక్సెస్ చేయొచ్చు.

వికీ రాకుటెన్ (Viki Rakuten)

కే-డ్రామాస్ కు నంబర్ వన్ యాప్ వికీ రాకుటెన్. 200కుపైగా భాషల్లో సబ్ టైటిల్స్ తో ఇందులో కొరియన్ మూవీస్, వెబ్ సిరీస్ అందుబాటులో ఉండటం విశేషం. మీ దగ్గర ఆండ్రాయిడ్, ఐఓఎస్.. ఏ మొబైల్ ఉన్నా ఈ వికీ యాప్ డౌన్ లోడ్ చేసుకొని ఫ్రీగా కేడ్రామాస్ చూడొచ్చు. పైగా యాడ్స్ తలనొప్పులు కూడా ఉండవు.

వియు (Viu)

వియు యాప్ లో కూడా మంచి మంచి కొరియన్ డ్రామాస్ అందుబాటులో ఉన్నాయి. వాటన్నింటినీ ఉచితంగా చూడొచ్చు. కేవలం యాప్ డౌన్ లోడ్ చేసుకుంటే చాలు.

తదుపరి వ్యాసం