Kiran Abbavaram: కిరణ్ అబ్బవరం నేను మీకు బాగా కావాల్సిన వాడిని సినిమాకు వచ్చిన వసూళ్లు ఎంతంటే...
19 September 2022, 13:29 IST
Kiran Abbavaram: కిరణ్ అబ్బవరం హీరోగా శ్రీధర్ గాదే దర్శకత్వంలో రూపొందిన నేను మీకు బాగా కావాల్సిన వాడిని సినిమా ఇటీవల ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఈ సినిమాకు మూడు రోజుల్లో వచ్చిన కలెక్షన్స్ ఎంతంటే...
కిరణ్ అబ్బవరం
Kiran Abbavaram: నేను మీకు బాగా కావాల్సిన వాడిని సినిమాతో ఇటీవలే ప్రేక్షకుల ముందుకొచ్చాడు యంగ్ హీరో కిరణ్ అబ్బవరం. మాస్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కిన ఈ సినిమాకు శ్రీధర్ గాదే దర్శకత్వం వహించాడు. దివంగత దర్శకుడు కోడి రామకృష్ణ కుమార్తె దివ్య దీప్తి ఈ సినిమాతో నిర్మాతగా అరంగేట్రం చేసింది. గతశుక్రవారం ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ సినిమా మూడు రోజుల్లో 4.5 కోట్ల కలెక్షన్స్ రాబట్టినట్లు చిత్ర యూనిట్ ప్రకటించింది.
ఫ్యామిలీ ఎమోషన్స్ తో పాటు కామెడీని థియేటర్లలో ప్రేక్షకులు ఎంజాయ్ చేస్తున్నారని దర్శకనిర్మాతలు వెల్లడించారు. క్యాబ్ డ్రైవర్ తో ప్రేమలో పడిన సాఫ్ట్ వేర్ ఇంజినీర్ కథతో ఫన్ లవ్ ఎంటర్ టైనర్ గా ఈ సినిమా రూపొందింది. నేను మీకు బాగా కావాల్సిన వాడిని లో హీరోగా నటిస్తూనే ఈ సినిమాకు రైటర్ గా వ్యవహరించాడు కిరణ్ అబ్బవరం.
ఎస్.ఆర్ కళ్యాణ మండపం తర్వాత కిరణ్ అబ్బవరం, శ్రీధర్ గాదే కలయికలో రూపొందిన సినిమా ఇది. సంజన ఆనంద్ హీరోయిన్ గా నటించగా కొరియోగ్రాఫర్ బాబా భాస్కర్ కీలక పాత్ర పోషించాడు. ప్రస్తుతం వినరో భాగ్యము విష్ణు కథ తో రూల్స్ రంజన్ అనే సినిమాలు చేస్తున్నాడు కిరణ్ అబ్బవరం.