తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Kgf 3 | కేజీఎఫ్‌ 3లో బాలీవుడ్‌ స్టార్‌ హృతిక్‌ రోషన్‌.. మేకర్స్ ఏమన్నారంటే?

KGF 3 | కేజీఎఫ్‌ 3లో బాలీవుడ్‌ స్టార్‌ హృతిక్‌ రోషన్‌.. మేకర్స్ ఏమన్నారంటే?

HT Telugu Desk HT Telugu

28 May 2022, 7:18 IST

    • కేజీఎఫ్‌ ఛాప్టర్‌ 2 బాక్సాఫీస్‌ రికార్డుల పరంపర ఇంకా కొనసాగుతుండగానే కేజీఎఫ్‌ ఛాప్టర్‌ 3 గురించి ఏదో ఒక వార్త బయటకు వస్తూనే ఉంది. కేజీఎఫ్‌ 2 ఎండ్‌ టైటిల్స్‌ సమయంలో థర్డ్‌ పార్ట్‌ కూడా మేకర్స్‌ అనౌన్స్‌ చేయడంతో ఆ మూవీ అప్‌డేట్స్‌ కోసం ఫ్యాన్స్‌ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
బాలీవుడ్ నటుడు హృతిక్ రోషన్
బాలీవుడ్ నటుడు హృతిక్ రోషన్ (Instagram)

బాలీవుడ్ నటుడు హృతిక్ రోషన్

కేజీఎఫ్‌ ఛాప్టర్‌ 1 ఒక సంచలనమైతే.. కేజీఎఫ్‌ ఛాప్టర్‌ 2 ఒక ప్రభంజనం. ఇక ఇదే ఫ్రాంఛైజీ నుంచి థర్డ్‌ పార్ట్‌ వస్తుందంటే దానిపై అంచనాలు ఏ రేంజ్‌లో ఉంటాయో అర్థం చేసుకోవచ్చు. అందుకే దీనిపై ప్రతి అప్‌డేట్‌ గురించి ఫ్యాన్స్‌ ఆతృతగా ఎదురుచూస్తున్నారు. ఇక తాజాగా ఈ థర్డ్‌ పార్ట్‌లో బాలీవుడ్ నటుడు హృతిక్‌ రోషన్‌ నటిస్తున్నాడన్న వార్తలు వచ్చాయి. సెకండ్‌ పార్ట్‌లోనూ బాలీవుడ్ నటులు సంజయ్‌ దత్, రవీనా టండన్‌ కనిపించిన విషయం తెలిసిందే. థర్డ్ పార్ట్ కోసం హృతిక్‌తో డీల్‌ కుదుర్చుకుంటున్నారన్న వార్తలు రావడంతో మేకర్స్‌ స్పందించారు.

ట్రెండింగ్ వార్తలు

Aavesham OTT: ఓటీటీ హక్కుల విషయంలో ఆవేశం మూవీ రికార్డు.. ఎన్ని కోట్లంటే.. మరికొన్ని గంటల్లోనే స్ట్రీమింగ్!

Prashanth Neel: సలార్ 2, కేజీఎఫ్ 3 సినిమాలపై అప్‍డేట్ చెప్పిన డైరెక్టర్ ప్రశాంత్ నీల్.. ముందు ఏదో క్లారిటీ ఇచ్చేశారు

Project Z OTT: ఆరున్నరేళ్ల తర్వాత ఓటీటీలోకి వస్తున్న సందీప్ కిషన్ సినిమా 'ప్రాజెక్ట్ జెడ్'

Heeramandi Sex Scene: ఆ బోల్డ్ సెక్స్ సీన్ అందుకే చేయాల్సి వచ్చింది.. మగాళ్లంటే ఇష్టం లేకే..: సోనాక్షి సిన్హా

హోంబళె ఫిల్మ్‌ కోఫౌండర్‌ విజయ్‌ బాలీవుడ్ హంగామాతో మాట్లాడుతూ.. దీనిపై క్లారిటీ ఇచ్చారు. "కేజీఎఫ్‌ 3 ఈ ఏడాది ప్రారంభం కావడం లేదు. మాకు కొన్ని ప్లాన్స్‌ ఉన్నాయి. కానీ ప్రశాంత్‌ సలార్‌ షూటింగ్‌లో బిజీగా ఉన్నాడు. యశ్‌ తన తర్వాతి సినిమాను అనౌన్స్ చేయబోతున్నాడు. ఆ ఇద్దరూ అందుబాటులోకి వచ్చి సమయం కేటాయించినప్పుడే కేజీఎఫ్ 3 పని మొదలుపెడతాం. ప్రస్తుతానికైతే థర్డ్‌ పార్ట్‌ ఎప్పుడు మొదలుపెట్టడానికి ఓ కచ్చితమై సమయం అంటూ ఏమీ అనుకోలేదు. ఒకసారి ఇది ఫైనల్‌ అయిన తర్వాత నటీనటుల గురించి ఆలోచిస్తాం" అని విజయ్‌ స్పష్టం చేశారు.

నటీనటుల ఎంపిక కూడా వాళ్లు అందుబాటులో ఉంటారా లేదా అన్నదానిపై ఆధారపడి ఉంటుందని, అది కూడా కేజీఎఫ్ 3 పని మొదలుపెట్టిన తర్వాతే డిసైడ్‌ అవుతామని చెప్పారు. కేజీఎఫ్‌ 3 కచ్చితంగా ఉంటుందని, అయితే అది ఎప్పుడు అన్నది మాత్రం ఇప్పుడే చెప్పలేనని గతంలోనూ విజయ్‌ ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు.

టాపిక్

హిందుస్తాన్ టైమ్స్ తెలుగు నుంచి ఎంటర్‌టైన్మెంట్, అలాగే ఓటీటీ తాజా అప్‌డేట్స్ పొందండి.