తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Kgf 3 | అవన్నీ పుకార్లే.. ఇప్పట్లో కేజీఎఫ్‌ 3 లేనట్లే: నిర్మాత

KGF 3 | అవన్నీ పుకార్లే.. ఇప్పట్లో కేజీఎఫ్‌ 3 లేనట్లే: నిర్మాత

HT Telugu Desk HT Telugu

15 May 2022, 14:57 IST

    • కేజీఎఫ్‌: ఛాప్టర్‌ 2 సృష్టించిన సంచలనాలు అన్నీ ఇన్నీ కావు. ఈ సినిమా బాక్సాఫీస్‌ రికార్డులను తిరగరాసింది. ఏకంగా రూ.1200 కోట్ల మార్క్‌ను కూడా దాటింది.
కేజీఎఫ్ ఛాప్టర్ 2 మూవీలో హీరో యశ్
కేజీఎఫ్ ఛాప్టర్ 2 మూవీలో హీరో యశ్ (twitter)

కేజీఎఫ్ ఛాప్టర్ 2 మూవీలో హీరో యశ్

కేజీఎఫ్‌, కేజీఎఫ్‌ ఛాప్టర్‌ 2 విజయాలతో ఈ ఫ్రాంఛైజీ నుంచి థర్డ్‌ పార్ట్‌ అప్‌డేట్స్‌ కోసం ఫ్యాన్స్‌ ఆతృతగా ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే ఈ మూవీ ఛాప్టర్‌ 3 కూడా ఉంటుందని మేకర్స్‌ ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే కేజీఎఫ్‌ 3 షూటింగ్‌ కూడా త్వరలోనే ప్రారంభం కాబోతోందని, ఇప్పటికే దీనికి సంబంధించిన పని మొదలైందన్న వార్తలు వచ్చాయి.

ట్రెండింగ్ వార్తలు

Heeramandi 2: హీరామండి వెబ్ సిరీస్‍ రెండో సీజన్ వస్తుందా? డైరెక్టర్, యాక్టర్ ఏం చెప్పారంటే..

OTT Web Series: నేహా శర్మ పాపులర్ వెబ్ సిరీస్ మూడో సీజన్ వచ్చేస్తోంది.. స్ట్రీమింగ్ డేట్ ఖరారు

Devara Fear Song: దేవర నుంచి వచ్చేసిన ఫియర్ సాంగ్.. పవర్‌ఫుల్‍గా ఫస్ట్ పాట: చూసేయండి

Adivi Sesh: హనీమూన్ ఎక్స్‌ప్రెస్ వదిలిన అడవి శేష్.. అన్నపూర్ణ ఏడెకరాల ప్రాంగణంలో అప్డేట్

ఈ వార్తలపై శనివారం రాత్రి ప్రొడ్యూసర్‌ కార్తీక్‌ గౌడ స్పందించాడు. ట్విటర్‌లో ఓ ప్రకటన జారీ చేయడం విశేషం. ప్రొడక్షన్‌ హౌజ్‌ హోంబళె ఫిల్మ్స్‌ తరఫున అతడు ఈ క్లారిటీ ఇస్తూ.. వార్తలను ఖండించాడు. కేజీఎఫ్‌ ఎగ్జిక్యూటివ్‌ ప్రొడ్యూసర్‌ అయిన కార్తీక్‌ గౌడ ట్విటర్‌ ద్వారా స్పందిస్తూ.. కేజీఎఫ్‌ 3 పనులు ఇప్పట్లో ప్రారంభం కావని స్పష్టం చేశాడు.

"ఇప్పుడు వస్తున్న వార్తలన్నీ పుకార్లే. ప్రస్తుతం హోంబళె ఫిల్మ్స్‌ ముందు ఎన్నో ఆసక్తికరమైన ప్రాజెక్ట్‌లు ఉన్నాయి. అందువల్ల కేజీఎఫ్‌3ని ఇప్పట్లో మొదలుపెట్టబోము. దీనిపై పని మొదలుపెట్టినప్పుడు చాలా ఘనంగా ప్రకటిస్తాం" అని కార్తీక్‌ గౌడ చెప్పాడు. యశ్‌, ప్రశాంత్‌ నీల్‌ కాంబినేషన్‌లో వచ్చిన ఈ కేజీఎఫ్‌ సినిమా అంచనాలకు మించి విజయం సాధించిన విషయం తెలిసిందే.

హిందుస్తాన్ టైమ్స్ తెలుగు నుంచి ఎంటర్‌టైన్మెంట్, అలాగే ఓటీటీ తాజా అప్‌డేట్స్ పొందండి.
తదుపరి వ్యాసం