తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Katrina Kaif Pregnancy: కత్రినా కైఫ్ ప్రెగ్నెన్సీ రూమర్లపై మౌనం వీడిన హీరో విక్కీ కౌశల్.. ఏం చెప్పారంటే..

Katrina Kaif Pregnancy: కత్రినా కైఫ్ ప్రెగ్నెన్సీ రూమర్లపై మౌనం వీడిన హీరో విక్కీ కౌశల్.. ఏం చెప్పారంటే..

15 July 2024, 18:27 IST

google News
    • Katrina Kaif - Vicky Kaushal: స్టార్ హీరోయిన్ కత్రినా కైఫ్ గర్భంతో ఉన్నారని కొంతకాలంగా రూమర్లు వస్తున్నాయి. అయితే, ఈ విషయంపై ఎట్టకేలకు స్పందించారు ఆమె భర్త, హీరో విక్కీ కౌశల్. అసలు విషయం చెప్పారు.
Katrina Kaif Pregnancy: కత్రినా కైఫ్ ప్రెగ్నెన్సీ రూమర్లపై మౌనం వీడిన హీరో విక్కీ కౌశల్.. ఏం చెప్పారంటే..
Katrina Kaif Pregnancy: కత్రినా కైఫ్ ప్రెగ్నెన్సీ రూమర్లపై మౌనం వీడిన హీరో విక్కీ కౌశల్.. ఏం చెప్పారంటే..

Katrina Kaif Pregnancy: కత్రినా కైఫ్ ప్రెగ్నెన్సీ రూమర్లపై మౌనం వీడిన హీరో విక్కీ కౌశల్.. ఏం చెప్పారంటే..

బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కత్రినా కైఫ్ ప్రెగ్నెంట్ అంటూ సుమారు ఆరు నెలలుగా రూమర్లు వస్తూనే ఉన్నాయి. అనంత్ అంబానీ - రాధికా మెర్చంట్ వివాహానికి కూడా కత్రినా హాజరయ్యారు. ఈ తరుణంలోనూ ఆమె గర్భంతో ఉన్నారన్న పుకార్లు వచ్చాయి. ఆమె గర్బాన్ని ఎవరూ గుర్తించకుండా దాచుకున్నారనే ఊహాగానాలు సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టాయి. ఈ విషయంపై హీరో, కత్రినా భర్త విక్కీ కౌశల్ మౌనం వీడారు. బ్యాడ్ న్యూజ్ మూవీ ప్రమోషన్లలో తాజాగా పాల్గొన్న విక్కీ.. కత్రినా విషయంపై స్పందించారు.

వాస్తవం కాదు

జూలై 16న తేదీన కత్రినా కైఫ్ పుట్టిన రోజు జరుపుకోనున్నారు. దీంతో కత్రినా బర్త్ డేను ఎలా సెలెబ్రేట్ చేయనున్నారని, అభిమానుల కోసం ఏదైనా గుడ్‍న్యూస్ ప్రకటిస్తారా అనే ప్రశ్న విక్కీకి ఎదురైంది. కత్రినా ప్రెగ్నెన్సీ రూమర్లపై పరోక్షంగా క్వశ్చన్ వచ్చింది. దీనికి విక్కీ స్పందించారు. ఆ పుకార్లలో నిజం లేదని తేల్చేశారు.

ఏదైనా ఉంటే తాము ప్రకటిస్తామని, అవి ఊహాగానాలే అని విక్కీ కౌశల్ వెల్లడించారు. “అది జరిగినప్పుడు ప్రకటించేందుకు మేం కూడా సంతోషిస్తాం. కానీ ఇప్పటికి అందులో ఎలాంటి నిజం లేదు. అవి కేవలం ఊహాగానాలే” అని విక్కీ కౌశల్ చెప్పారు. కత్రినా పుట్టిన రోజున ఇద్దరం కలిసి సమయం గడుపేందుకు ప్లాన్ చేసుకున్నామని, ఇటీవలే ప్రమోషన్లతో బిజీగా ఉంటున్నట్టు విక్కీ కౌశల్ అన్నారు.

కత్రినా కైఫ్ ఇటీవల లండన్‍కు వెళ్లగా.. విక్కీ కౌశల్ కూడా కొంతకాలానికి బయలుదేరారు. అయితే, కత్రినా ప్రెగ్నెన్సీతో ఉన్నారని, ప్రసవం కోసమే అక్కడికి వెళ్లారంటూ ఊహాగానాలు వచ్చాయి. అయితే, అందులో నిజం లేదని అప్పుడు కత్రినా టీమ్ వెల్లడించింది. అయినా రూమర్లు ఆగలేదు. అనంత్ అంబానీ పెళ్లికి కత్రినా హాజరవటంతో మరోసారి ఊహాగానాలు వచ్చాయి. ఇప్పుడు విక్కీ కౌశల్ స్పందించారు. కత్రినా గర్భంతో లేరని క్లారిటీ ఇచ్చేశారు.

కత్రినా కైఫ్ కొంతకాలంగా బ్రేక్ తీసుకుంటున్నారు. ఆఖరిగా మేరీ క్రిస్మస్ చిత్రంలో కత్రినా నటించారు. ఈ మూవీ జూన్ 12వ తేదీన థియేటర్లలో విడుదలైంది. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద అంచనాలను అందుకోలేకపోయింది. ఈ థ్రిల్లర్ చిత్రాన్ని శ్రీరామ్ రాఘవన్ దర్శకత్వం వహించారు.

‘బ్యాడ్‍న్యూజ్’ మూవీ గురించి..

బ్యాడ్‍ న్యూజ్ మూవీలో విక్కీ కౌశల్, తృప్తి డిమ్రి హీరోహీరోయిన్లుగా నటించారు. ఈ చిత్రం జూలై 19వ తేదీన రిలీజ్ కానుంది. ఈ తరుణంలో మూవీ టీమ్ ప్రమోషన్లను జోరుగా చేస్తోంది. ప్రెస్‍మీట్లను నిర్వహిస్తోంది. ఈ సినిమా నుంచి ఇటీవలే జానమ్ అనే సాంగ్ వచ్చింది. ఈ పాటలో విక్కీ, తృప్తి మధ్య రొమాంటిక్ సీన్లు ఉన్నాయి. ఈ సాంగ్ తర్వాత బ్యాడ్‍న్యూజ్ మూవీకి మంచి బజ్ వచ్చింది. అయితే, పాటకు మిక్స్డ్ రెస్పాన్స్ వస్తోంది. బ్యాడ్‍న్యూజ్ మూవీకి ఆనంద్ తివారి దర్శకత్వం వహించారు. ధర్మ ప్రొడక్షన్స్, లియో మీడియా కలెక్టివ్ బ్యానర్లు ప్రొడ్యూజ్ చేశాయి. 2019లో అక్షయ్ కుమార్, కరీనా కపూర్ నటించిన గుడ్‍న్యూస్ చిత్రానికి సీక్వెల్‍గా ఇప్పుడు బ్యాడ్‍న్యూజ్ వస్తోంది.

హిందుస్తాన్ టైమ్స్ తెలుగు నుంచి ఎంటర్‌టైన్మెంట్, అలాగే ఓటీటీ తాజా అప్‌డేట్స్ పొందండి.
తదుపరి వ్యాసం