karthikeya -2 day 1 collection: కార్తికేయ 2 ఫస్ట్ డే కలెక్షన్స్ - నిఖిల్ కెరీర్ లో హయ్యెస్ట్
14 August 2022, 13:34 IST
నిఖిల్ (Nikhil) హీరోగా చందూ మొండేటి (Chandoo Mondeti) దర్శకత్వంలో రూపొందిన కార్తికేయ -2 (karthikeya -2) చిత్రం శనివారం రిలీజ్ అయ్యింది. ఈసినిమాకు తొలిరోజు వచ్చిన వసూళ్లు ఎంతంటే...
నిఖిల్
karthikeya -2 day 1 collection: కృష్ణతత్వానికి అడ్వెంచర్ థ్రిల్లర్ అంశాలను జోడిస్తూ నిఖిల్ చేసిన తాజా చిత్రం కార్తికేయ 2. చందూ మొండేటి దర్శకత్వంలో రూపొందిన ఈ ఫాంటసీ సినిమా శనివారం ప్రేక్షకుల ముందుకొచ్చింది. సరికొత్త పాయింట్‌తో కంటెంట్ ప్రధానంగా తెరకెక్కిన ఈ సినిమా పాజిటివ్ మౌత్‌టాక్ లభిస్తోంది. నిఖిల్ యాక్టింగ్‌తో పాటు విజువల్స్, స్టోరీ లైన్ బాగుందంటూ ప్రశంసలు వస్తున్నాయి.
పాజిటివ్ టాక్ కారణంగా తొలిరోజు ఈ సినిమా భారీగా వసూళ్లను సాధించింది. నిఖిల్ కెరీర్‌లో ఫస్ట్ డే హయ్యెస్ట్ కలెక్షన్స్ సాధించిన సినిమాగా నిలిచింది. శనివారం రోజు వరల్డ్‌వైడ్ ఈ సినిమా 8.5 కోట్ల గ్రాస్, 5.05 కోట్ల షేర్‌ను సాధించింది. తెలుగు రాష్ట్రాల్లో 5.30 కోట్ల గ్రాస్, 3.50 కోట్ల షేర్‌ను రాబట్టింది. మొదటిరోజు నైజాంలో అత్యధికంగా 1.24 కోట్ల కలెక్షన్స్ కార్తికేయ 2కు వచ్చాయి. సీడెడ్‌లో 40 లక్షలు, గుంటూర్‌లో 44 లక్షల వసూళ్లను సాధించింది. ఉత్తరాంధ్రలో 45 లక్షలు, ఈస్ట్ గోదావరిలో 33 లక్షలు, వెస్ట్ గోదావరిలో 20 లక్షలు, కృష్ణ 27, నెల్లూరులో 17 లక్షల వసూళ్లను కార్తికేయ 2 రాబట్టినట్లు ట్రేడ్ వర్గాలు పేర్కొన్నాయి.
నిఖిల్ గత చిత్రాలతో పోలిస్తే ఈ సినిమా రెండింతల వసూళ్లను సొంతం చేసుకున్నది. రిలీజ్ ఫస్ట్ డే రోజు నిఖిల్ కెరీర్‌లో హయ్యెస్ట్ కలెక్షన్స్ రాబట్టిన సినిమాగా నిలిచింది. పలుమార్లు రిలీజ్ వాయిదాపడటం, థియేటర్లు తక్కువగా దొరికినా ప్రేక్షకాదరణతో ఈసినిమా భారీగా కలెక్షన్స్ రాబట్టింది. కంటెంట్ బాగుంటే సినిమాకు ఆదరణ ఉంటుందని మరోసారి కార్తికేయ 2 నిరూపించిందని సినీ వర్గాలు అంటున్నాయి. కార్తికేయ 2లో అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్‌గా నటించింది. అనుపమ్ ఖేర్ కీలక పాత్ర పోషించారు.