తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Nikhil: తండ్రి అయిన టాలీవుడ్ హీరో నిఖిల్

Nikhil: తండ్రి అయిన టాలీవుడ్ హీరో నిఖిల్

21 February 2024, 14:59 IST

google News
    • Nikhil Siddhartha - Pallavi Baby Boy: టాలీవుడ్ యంగ్ హీరో నిఖిల్ తండ్రి అయ్యారు. ఆయన భార్య పల్లవి మగబిడ్డకు జన్మనిచ్చారు. 
Nikhil Siddhartha: తండ్రైయిన టాలీవుడ్ హీరో నిఖిల్
Nikhil Siddhartha: తండ్రైయిన టాలీవుడ్ హీరో నిఖిల్

Nikhil Siddhartha: తండ్రైయిన టాలీవుడ్ హీరో నిఖిల్

Nikhil Siddhartha: టాలీవుడ్ యువ హీరో నిఖిల్ సిద్ధార్థ గుడ్‍న్యూస్ చెప్పారు. ఆయన తండ్రి అయ్యారు. నిఖిల్ భార్య డాక్టర్ పల్లవి.. మగబిడ్డకు జన్మనిచ్చారు. హైదరాబాద్‍లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో నేడు (ఫిబ్రవరి 21) వారికి కుమారుడు జన్మించారు. దీంతో నిఖిల్, పల్లవి తొలిసారి తల్లిదండ్రులయ్యారు. ఈ విషయాన్ని నిఖిల్ అధికారికంగా వెల్లడించారు. ఓ ఫొటోను కూడా షేర్ చేశారు.

తన కుమారుడిని చేతుల్లోకి తీసుకొని నుదుటిపై నిఖిల్ ప్రేమగా ముద్దు పెడుతున్న ఫొటో బయటికి వచ్చింది. ఈ ఫొటోను పోస్ట్ చేస్తూ నిఖిల్‍, పల్లవి దంపతులకు ఫ్యాన్స్, నెటిజన్లు శుభాకాంక్షలు చెబుతున్నారు. 2020లో నిఖిల్, పల్లవి వివాహం జరిగింది. ఇప్పుడు (ఫిబ్రవరి 21, 2024) వారు తల్లిదండ్రులయ్యారు.

నిఖిల్, పల్లవి కుటుంబ సభ్యులు, సన్నిహితులు ఆసుపత్రికి వెళ్లి వారికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. చాలా మంది టాలీవుడ్ ప్రముఖులు సోషల్ మీడియాలో కంగ్రాచులేషన్స్ చెబుతూ పోస్టులు చేస్తున్నారు.

పల్లవి సీమంతం వేడుక గత నెలాఖర్లో ఘనంగా జరిగింది. నిఖిల్ ఇంట్లో సంబరంగా ఈ కార్యక్రమం జరిగింది. ఇందుకు సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.

నిఖిల్, పల్లవి ప్రేమ - పెళ్లి

తమ ఇద్దరి మధ్య ప్రేమ ఎప్పుడు మొదలైందో నిఖిల్ గతంలో ఓ సందర్భంలో చెప్పారు. ఓ పార్టీలో తాను పల్లవిని చూశానని, తొలి చూపులోనే ప్రేమలో పడ్డానని తెలిపారు. ఆ తర్వాత ఓ కామన్ ఫ్రెండ్ ద్వారా పల్లవి నంబర్ తీసుకొని కాల్ చేశానని చెప్పారు. అనంతరం తాను, పల్లవి ఒకరినొకరం అర్థం చేసుకున్నామని తెలిపారు. ఆ తర్వాత ఇద్దరు పెద్దలను ఒప్పించామని వివరించారు. కరోనా సమయంలో హైదరాబాద్‍లోని ఫామ్‍హౌస్‍లో 2020 మే 14వ తేదీన నిఖిల్, పల్లవి వివాహం జరిగింది.

సినిమాల విషయానికి వస్తే..

నిఖిల్ ప్రస్తుతం పీరియాడికల్ మూవీ స్వయంభు చేస్తున్నారు. భరత్ కృష్ణమాచారి ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రంలో సంయుక్త మీనన్ హీరోయిన్‍గా నటిస్తున్నారు. రాజుల కాలం నాటి బ్యాక్‍డ్రాప్‍లో ఈ చిత్రం ఉండనుంది. యోధుడిగా ఈ చిత్రంలో నిఖిల్ కనిపించనున్నారు. స్వయంభు నుంచి వచ్చిన నిఖిల్ ఫస్ట్ లుక్ అంచనాలను అమాంతం పెంచేసింది. పిక్సెల్ స్టూడియోస్ బ్యానర్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి రవి బస్రూర్ సంగీతం అందిస్తున్నారు. భారీ బడ్జెట్‍తో పాన్ ఇండియా రేంజ్‍లో ఈ మూవీ రూపొందనుంది. ఈ సినిమా కోసం నిఖిల్ ప్రత్యేక శిక్షణ కూడా తీసుకున్నారు. ఇందుకు సంబంధించిన వీడియోలను కూడా గతంలో షేర్ చేశారు. సంయుక్త మీనన్ ఈ చిత్రం కూడా గుర్రపు స్వారీ నేర్చుకుంటున్నట్టు తెలిపారు.  

కార్తికేయ 2 చిత్రంతో నిఖిల్ పాన్ ఇండియా రేంజ్‍లో ఫేమస్ అయ్యారు. 2022 ఆగస్టులో రిలీజైన ఆ చిత్రం తెలుగుతో పాటు హిందీలోనూ బంపర్ హిట్ అయింది. అయితే, తదుపరి నిఖిల్ చేసిన స్పై మూవీ తీవ్రంగా నిరాశపరిచింది. స్వయంభు చిత్రంపై మాత్రం భారీ అంచనాలు ఉన్నాయి. ఈ ఏడాదిలోనే ఈ సినిమా రిలీజ్ కానుంది.

తదుపరి వ్యాసం