తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Karthika Deepam 2 Today Episode: దీప పేరుతో రెస్టారెంట్ ఓపెన్ చేస్తానన్న కార్తీక్, షాక్ తిన్న జ్యోత్స్న

Karthika Deepam 2 Today Episode: దీప పేరుతో రెస్టారెంట్ ఓపెన్ చేస్తానన్న కార్తీక్, షాక్ తిన్న జ్యోత్స్న

Haritha Chappa HT Telugu

19 December 2024, 8:53 IST

google News
    • Karthika Deepam 2 Today Episode: కార్తీక్ తన భార్య దీప పేరుతో రెస్టారెంట్ పెట్టాలనుకుంటాడు. దీంతో జ్యోత్స్నకు, శివన్నారాయణకు కోపం వస్తుంది.
కార్తీక దీపం 2 సీరియల్
కార్తీక దీపం 2 సీరియల్ (Star maa)

కార్తీక దీపం 2 సీరియల్

కార్తీకదీపం నేటి ఎపిసోడ్ లో స్వప్న, కాశీలు కార్తీక్ ఇంటికి వస్తారు. స్వప్న తాము ఫుడ్ కోర్ట్ పెట్టాలనుకున్నామని, దానికి కార్తీక్ సాయం తీసుకోవాలనుకున్నామని చెబుతుంది. ఇప్పుడు కార్తీక్‌ని రెస్టారెంట్ స్టార్ట్ చేస్తే బాగుంటుందని సలహా ఇస్తుంది. దీప కూడా స్వప్న సలహాను సమర్థిస్తుంది. కార్తిక్ ఏది మొదలుపెట్టినా మంచి ఎత్తుకు చేరుకుంటారని అంటుంది. అందరం సాయం చేస్తామని కార్తీక్ కు మాట ఇస్తారు. అయితే కార్తీక్ మాత్రం బిజినెస్ స్టార్ట్ చేయడం ఎంతో కష్టమని అంటాడు. ఈలోపు కాంచన వచ్చి డబ్బు కోసం ఆలోచిస్తే తన ఆస్తిలో వాటా అడుగుతానని అంటుంది.

తల్లి మాటలకు కార్తీక్ వద్దని చెబుతాడు. అది ఉమ్మడి ఆస్తి అని ఇప్పుడు పంపకాలు పెట్టడం ఎందుకని అంటాడు. ‘ఆ డబ్బు నీది కదమ్మా నీ డబ్బులతో బిజినెస్ చేయడం’ అని అనగానే కాంచనకు కోపం వస్తుంది. నీది నాది అని వేరు చేసే మాట్లాడతావేంట్రా అంటూ ఏడుస్తుంది. నువ్వు నా కొడుకువి నాది అంటే నీదే అని అర్థం... నీకంటే నాకు ఈ ప్రాణం కూడా ఎక్కువ కాదని అంటుంది కాంచన.

డబ్బు కోసం లోన్ తీసుకోవాలన్న ఆలోచన కూడా చేస్తారు. కాంచన తన ఆస్తి అయినా ఇంటిపై లోన్ తీసుకుందామని చెబుతుంది. చివరికి రెస్టారెంట్ కు ఏ పేరు పెట్టాలన్న దగ్గరికి టాపిక్ వస్తుంది. దానికి స్వప్న... కార్తీక్ దీప రెస్టారెంట్ అని పెడదామా అని అడుగుతుంది. కార్తీక్ మాట్లాడుతూ స్వప్న చెప్పిన పేరు నచ్చలేదని, తన భార్య పేరు మీదే రెస్టారెంట్ పెడతానని అంటాడు. దీప రెస్టారెంట్ ఎలా ఉంది అని అడుగుతాడు. వెంటనే కాంచన చాలా బాగుంది.. నువ్వు చాలా గొప్ప వాడివి అవుతావు అని అంటుంది. వెంటనే దీప నా పేరు వద్దమ్మా అని అడ్డుకుంటుంది. ఈ లోపు దాసు దీపతో నువ్వు అలా అనకమ్మ దేవుడే ఏ పేరు పెట్టాలన్నది నిర్ణయిస్తాడు అని అంటాడు. దాసు మనసులో మాత్రం ‘నువ్వు ఆ ఇంటి వారసురాలివి కాబట్టే శివన్నారాయణ భార్య పేరు పెడితే కార్తీక్ నీ పేరు పెట్టాలనుకుంటున్నాడు’ అని అనుకుంటాడు.

దీపా రెస్టారెంట్ పేరు ఫైనలైజ్ అవుతుంది. దీంతో అందరూ కార్తీక్, దీపాలకు కంగ్రాట్స్ చెప్తారు. అప్పుడు దాసు... దీపతో నువ్వు కోరుకోకపోయినా నీకు దేవుడు అన్నీ ఇస్తాడు అని అంటాడు. ఆ మాటలు విన్న అనసూయ మనసులో దీప అసలైన తల్లిదండ్రులు ఈయనకు తెలిసే ఉంటుందా అని అనుకుంటూ ఉంటుంది. అదే విషయాన్ని దాసుని అడుగుతుంది. దాసు చెప్పాల్సిన రోజు వస్తే అన్ని విషయాలు చెబుతా అని అంటాడు.

సీన్ జ్యోత్స్న ఇంటికి మారుతుంది. తాను వేసిన ప్లాన్స్ అన్ని ఫెయిల్ అయిపోతున్నాయని ఏం చేయాలా అని తెగ బాధపడుతూ ఉంటుంది జ్యోత్స్న. అప్పుడే దాసు ఎంట్రీ ఇస్తాడు. మీరు కార్తీక్ ని బయటకు పంపేయడం వల్ల సొంతంగా రెస్టారెంట్ పెడుతున్నాడని, ఇంటి మీద లోన్ తీసుకుంటున్నాడని, ఆ రెస్టారెంట్ కి దీప పేరు పెడుతున్నాడని చెప్పడంతో జోత్స్న షాక్ తింటుంది. దీప జోలికి వెళితే నీ గురించి అందరికీ చెప్పేస్తానని అంటాడు.

జ్యోత్స్న తన తాత దగ్గరకు వెళ్లి దీపా రెస్టారెంట్ గురించి చెబుతుంది. ఇంటి పై లోన్ పెట్టి మరి రెస్టారెంట్ పెడుతున్నారని చెబుతుంది. దానికి శివన్నారాయణ ‘నా ఆస్తి మీద తాను లోన్‌కి ఎలా వెళుతుంది’ అని చెప్పి కార్తీక్ ఇంటికి వస్తారు.

దశరథ, సుమిత్రతో మాట్లాడుతూ ఇంత జరుగుతున్నా కాంచన ఒక్క విషయం కూడా తమకు చెప్పడం లేదని బాధపడతారు. కార్తీక్ ఇంటికి చేరుకున్న శివన్నారాయణ చూస్తుండగానే కాంచన బ్యాంకు లోన్ కోసం అప్లికేషన్ పై సంతకాలు పెడుతూ ఉంటుంది. వెంటనే శివన్నారాయణ ఫైల్ తీసుకుంటాడు. రెస్టారెంట్ పెట్టాలని అనుకుంటున్నారట, రెస్టారెంట్‌కి ఏం పేరు పెడతారు అని అడుగుతాడు. దానికి దీప.. కార్తీక్ బాబు పేరే పెడతామని అంటుంది. అది విన్న కార్తీక్ కాదు దీప పేరే పెడుతున్నామని చెబుతాడు. దానికి శివన్నారాయణ పేరు అద్భుతంగా ఉంది.. అంటూ వెటకారంగా మాట్లాడుతాడు. దీంతో ఈరోజు ఎపిసోడ్ ముగిసిపోతుంది.

తదుపరి వ్యాసం