తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Karan Johar On Animal: యానిమల్ మూవీ చూసి ఏడ్చేశాను.. 2023లో బెస్ట్ మూవీ అది: బాలీవుడ్ డైరెక్టర్

Karan Johar on Animal: యానిమల్ మూవీ చూసి ఏడ్చేశాను.. 2023లో బెస్ట్ మూవీ అది: బాలీవుడ్ డైరెక్టర్

Hari Prasad S HT Telugu

02 January 2024, 9:59 IST

google News
    • Karan Johar on Animal: బ్లాక్‌బస్టర్ మూవీ యానిమల్ పై ప్రశంసల వర్షం కురిపించాడు బాలీవుడ్ డైరెక్టర్ కరణ్ జోహార్. 2023లో బెస్ట్ మూవీ ఇదే అని, తాను రెండుసార్లు చూసినట్లు చెప్పడం విశేషం.
యానిమల్ మూవీలో రణ్‌బీర్ కపూర్
యానిమల్ మూవీలో రణ్‌బీర్ కపూర్

యానిమల్ మూవీలో రణ్‌బీర్ కపూర్

Karan Johar on Animal: రణ్‌బీర్ కపూర్, సందీప్ రెడ్డి వంగా కాంబినేషన్ లో వచ్చిన యానిమల్ మూవీ గతేడాది రిలీజై సంచలన విజయం సాధించిన సంగతి తెలుసు కదా. ఈ మూవీపై ఇప్పటికీ ఇంకా ప్రశంసల వర్షం కురుస్తూనే ఉంది. తాజాగా బాలీవుడ్ డైరెక్టర్ కరణ్ జోహార్ కూడా యానిమల్ గతేడాది వచ్చిన బెస్ట్ మూవీ అని అనడం విశేషం.

యానిమల్ మూవీని తాను రెండుసార్లు చూశానని అతడు చెప్పాడు. డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగాతోపాటు రాణీ ముఖర్జీ, తాప్సీ పన్నులాంటి వాళ్లు పాల్గొన్న గలాటా ప్లస్ రౌండ్ టేబుల్లో కరణ్ ఈ సినిమాపై స్పందించాడు.

"నేను యానిమల్ మూవీ గురించి మాట్లాడినప్పుడు చాలా మంది నాతో మీరు రాకీ ఔర్ రాణీకి ప్రేమ్ కహానీ తీశారు.. అది యానిమల్ లాంటి సినిమాకు వాక్సినేషన్ లాంటిది అన్నారు. కానీ దానికి నేను అంగీకరించలేదు. ఎందుకంటే నా వరకూ యానిమల్ బెస్ట్ మూవీ ఆఫ్ ద ఇయర్. ఈ విషయం చెప్పడానికి చాలా ధైర్యం కావాలి" అని కరణ్ అన్నాడు.

యానిమల్ చూసి తాను కంటతడి పెట్టినట్లు తెలిపాడు. "చివర్లో ఇద్దరు ఫైట్ చేసుకుంటూ ఉంటారు.వెనుక ఆ సాంగ్ వస్తుంటుంది. ఆ సమయంలో నా కళ్లలో నీళ్లు తిరిగాయి. అక్కడంతా రక్తమే కనిపించింది. నాలో ఏదైనా లోపం ఉండాలి లేదంటే అతనిలో అయినా ఉండాలి.

కానీ ఇది మామూలు ఆలోచన కాదు. సందీప్ సినిమా చూసి నా దిమ్మదిరిగిపోయింది. ఈ మూవీని నేను రెండుసార్లు చూశాను. ఒకసారి ప్రేక్షకుడిగా.. రెండోసారి దానిని అధ్యయనం చేయడానికి చూశాను. మూవీ సక్సెస్ గేమ్ ఛేంజింగ్ అని చెప్పాలి" అని కరణ్ అన్నాడు.

మెయిన్‌స్ట్రీమ్ సినిమా అంటే ఇలాగే ఉండాలన్న బంధనాలను, సాంప్రాదాయలను పక్కన పెట్టి తీసిన సినిమా ఇది అని, అందుకే తనకు బాగా నచ్చిందని అతడు తెలిపాడు. రణ్‌బీర్, రష్మిక నటించిన యానిమల్ మూవీపై ఎన్ని ప్రశంసలు వచ్చాయో అన్ని విమర్శలు కూడా వచ్చాయి. అయితే బాక్సాఫీస్ దగ్గర మాత్రం పెద్ద సక్సెస్ అయింది. ఇండియాలోనే రూ.546 కోట్లు వసూలు చేసింది.

హిందుస్తాన్ టైమ్స్ తెలుగు నుంచి ఎంటర్‌టైన్మెంట్, అలాగే ఓటీటీ తాజా అప్‌డేట్స్ పొందండి.
తదుపరి వ్యాసం