తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Kantara Telugu Collection Day 2: రెండు రోజుల్లో 11 కోట్లు - తెలుగులో కాసుల వ‌ర్షం కురిపిస్తున్న కాంతారా

Kantara Telugu Collection Day 2: రెండు రోజుల్లో 11 కోట్లు - తెలుగులో కాసుల వ‌ర్షం కురిపిస్తున్న కాంతారా

17 October 2022, 14:29 IST

  • Kantara Telugu Collection Day 2: కాంతారా సినిమా తెలుగులో కాసుల వ‌ర్షాన్ని కురిపిస్తోంది. రెండు రోజుల్లోనే ఈ సినిమా 11.5 కోట్ల‌కుపైగా క‌లెక్ష‌న్స్‌ రాబ‌ట్టింది.

రిష‌బ్ శెట్టి
రిష‌బ్ శెట్టి

రిష‌బ్ శెట్టి

Kantara Telugu Collection Day 2: క‌న్న‌డ చిత్రం కాంతారా తెలుగులో భారీ క‌లెక్ష‌న్స్ సాధిస్తోంది. రెండు రోజుల్లోనే ఈ సినిమా ప‌ది కోట్ల వ‌ర‌కు వ‌సూళ్ల‌ను రాబ‌ట్టింది. తొలిరోజు ఐదు కోట్ల గ్రాస్‌ను రాబ‌ట్టి బ్రేక్ ఈవెన్‌ను సాధించింది. రెండో రోజు క‌లెక్ష‌న్స్ మ‌రింత పెరిగాయి. దాదాపు ఆరు కోట్ల వ‌ర‌కు గ్రాస్‌ను రాబ‌ట్టింది. రెండో రోజుల్లోనే ఈ సినిమా 11.5 కోట్ల క‌లెక్ష‌న్స్‌ను రాబ‌ట్టిన‌ట్లు చిత్ర యూనిట్ పేర్కొన్న‌ది.

ట్రెండింగ్ వార్తలు

Madgaon Express OTT: ఓటీటీలోకి వచ్చేసిన యానిమల్ యాక్టర్ సూపర్ హిట్ కామెడీ థ్రిల్లర్.. ఎక్కడ చూడాలంటే?

Yuvaraj OTT: ఓటీటీలోకి వ‌చ్చేసిన కాంతార‌ హీరోయిన్ యాక్ష‌న్ డ్రామా మూవీ - తెలుగు స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్ ఇదే!

Bollywood Actor: 200 సినిమాల్ని రిజెక్ట్ చేసిన బాలీవుడ్ న‌టుడు - సూప‌ర్‌స్టార్ కావాల్సినోడు .. సీరియ‌ల్స్ చేస్తోన్నాడు

Prabhas Marriage: ప్రభాస్ లైఫ్‌లోకి స్పెషల్ పర్సన్.. కాబోయే భార్య గురించేనా డార్లింగ్ పోస్ట్?

ఈ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ 2 కోట్ల వ‌ర‌కు కాగా రెండో రోజుల్లోనే ఐదింత‌ల లాభాల్ని ఈ సినిమా తెచ్చిపెట్టింది. ఆదివారం నాడు ఈ క‌లెక్ష‌న్స్ మ‌రింత పెరిగే అవ‌కాశం ఉన్న‌ట్లు ట్రేడ్ వ‌ర్గాలు చెబుతున్నాయి. కాంతారా సినిమాలో హీరోగా న‌టిస్తూనే రిష‌బ్ శెట్టి ఈ సినిమాకు ద‌ర్శ‌క‌త్వం వ‌హించాడు.

ఇందులో శివ అనే అట‌వీ ప్రాంతానికి చెందిన యువ‌కుడిగా అత‌డి న‌ట‌న‌కు విమ‌ర్శ‌కుల ప్ర‌శంస‌లు ల‌భిస్తున్నాయి. ముఖ్యంగా క్లైమాక్స్ స‌న్నివేశాల్లో రిష‌బ్‌ శెట్టి న‌ట‌న‌కు అభిమానులు ఫిదా అవుతున్నారు. ఈ సినిమాను తెలుగులో అల్లు అర‌వింద్ రిలీజ్ చేశారు.

క‌న్న‌డంలో ఈ సినిమా వంద కోట్ల‌కుపైగా వ‌సూళ్ల‌ను రాబ‌ట్టింది. క‌న్న‌డ సినీ చ‌రిత్ర‌లోనే అత్య‌ధిక క‌లెక్ష‌న్స్ ద‌క్కించుకున్న సినిమాల్లో ఒక‌టిగా నిలిచింది. ఈ సినిమాలో స‌ప్త‌గి గౌడ‌, అచ్యుత్ కుమార్ ప్ర‌ధాన పాత్ర‌ల్ని పోషించారు.

హిందుస్తాన్ టైమ్స్ తెలుగు నుంచి ఎంటర్‌టైన్మెంట్, అలాగే ఓటీటీ తాజా అప్‌డేట్స్ పొందండి.
తదుపరి వ్యాసం