తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Acharya |ఆచార్య న‌ష్టాల‌పై ప‌రిహారం కోరుతూ చిరంజీవికి ఎగ్జిబిటర్ లేఖ‌...

Acharya |ఆచార్య న‌ష్టాల‌పై ప‌రిహారం కోరుతూ చిరంజీవికి ఎగ్జిబిటర్ లేఖ‌...

HT Telugu Desk HT Telugu

07 May 2022, 14:05 IST

  • ఆచార్య సినిమా నష్టాలపై పరిహారం కోరుతూ కన్నడ ఎగ్జిబిటర్ చిరంజీవికి రాసిన ఓ లేఖ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. సినిమాపై పెట్టిన పెట్టుబడిలో 25 శాతం మాత్రమే రికవరీ అయినట్లు ఎగ్జిబిటర్ ఈ లేఖలో పేర్కొన్నాడు. 

రామ్‌చ‌ర‌ణ్, చిరంజీవి
రామ్‌చ‌ర‌ణ్, చిరంజీవి (twitter)

రామ్‌చ‌ర‌ణ్, చిరంజీవి

చిరంజీవి, రామ్‌చ‌ర‌ణ్ హీరోలుగా న‌టించిన ఆచార్య చిత్రం ఏప్రిల్ 29న ప్రేక్ష‌కుల ముందుకొచ్చింది. తండ్రీకొడుకులు తొలిసారి కలిసి నటించడం.   ఆర్ఆర్ఆర్ స‌క్సెస్ త‌ర్వాత చ‌ర‌ణ్ నుంచి వ‌స్తోన్న సినిమా కావ‌డంతో అంచ‌నాలు భారీగా ఏర్ప‌డ్డాయి. కానీ క‌థ‌లోని లోపాల కార‌ణంగా ఆ అంచ‌నాల్ని అందుకోలేక సినిమా బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టింది. నిర్మాత‌లు, డిస్ట్రిబ్యూట‌ర్ల‌కు భారీగా న‌ష్టాల‌ను మిగిల్చింది. సినిమాపై పెట్టిన పెట్టుబ‌డిలో స‌గానికిపైగా న‌ష్ట‌పోయిన‌ట్లు స‌మాచారం. 

ట్రెండింగ్ వార్తలు

Chandrababu Biopic: ఓటీటీలో కాదు నేరుగా యూట్యూబ్‌లో విడుదలైన చంద్రబాబు బయోపిక్ తెలుగోడు.. మంచి రెస్పాన్స్

Friday Theatre Releases: ఐదు తెలుగు సినిమాలతో పోటీ పడనున్న హాలీవుడ్ మూవీ.. ఎవరిదో పైచేయి?

Upcoming Telugu Movies: ఒకే రోజు ఆరు సినిమాల రిలీజ్.. ఇన్నాళ్ల కరువంతా తీరిపోయేలా..

Chiranjeevi Padma Vibhushan: పద్మ విభూషణ్ అవార్డు అందుకున్న మెగా స్టార్ చిరంజీవి.. వీడియో

తాజాగా ఈ సినిమా మిగిల్చిన నష్టాలపై ప‌రిహారం కోరుతూ చిరంజీవికి క‌న్న‌డ ఎగ్జిబిట‌ర్ రాజ్‌గోపాల్ బ‌జాజ్ రాసిన లేఖ సోష‌ల్ మీడియాలో చ‌క్క‌ర్లు కొడుతుంది. రాయ్‌చూర్‌లోని క‌ళ్యాణ్ క‌ర్ణాట‌క రీజియ‌న్‌లో చాలా కాలంగా తాను ఎగ్జిబిట‌ర్ గా పనిచేస్తున్నట్లు అతడు ఈ లేఖలో పేర్కొన్నాడు. వరంగల్ శ్రీను కు పెద్ద మొత్తంలో డబ్బులు చెల్లించి ఏడాది ముందే ఆచార్య సినిమా హక్కులు పొందినట్లు పేర్కొన్నాడు. రిలీజ్ కు ముందే డబ్బు మొత్తం చెల్లించినట్లు చెప్పాడు. అప్పులు తెచ్చి సినిమాపై పెట్టుబడి పెట్టానని, కానీ ఆశించిన మేర స్పందన లేకపోవడంతో తాను చాలా నష్టపోయినట్లు ఈ లేఖలో రాశాడు. 

సినిమా హక్కుల కోసం తాను పెట్టిన పెట్టుబడి 25 శాతం మాత్రమే రికవరీ అయ్యిందని చెప్పాడు. పెద్ద మనసుతో స్పందించి తమకు పరిహారం అందిస్తే బాగుంటుందని ఎగ్జిబిటర్ చిరంజీవిని కోరాడు. ప్రస్తుతం ఈ లేఖ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. దాదాపు 140 కోట్ల బడ్జెట్ తో ఆచార్య సినిమాను నిరంజన్ రెడ్డి, అన్వేష్ రెడ్డి తెరకెక్కించారు. ఎనభై కోట్ల మేరకు నిర్మాతలకు నష్టాలను మిగిల్చినట్లు సమాచారం. 

టాపిక్

హిందుస్తాన్ టైమ్స్ తెలుగు నుంచి ఎంటర్‌టైన్మెంట్, అలాగే ఓటీటీ తాజా అప్‌డేట్స్ పొందండి.