తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Acharya | ఆచార్య ఓటీటీ డేట్ ఫిక్స్..! అనుకున్న సమయం కంటే ముందుగానే?

Acharya | ఆచార్య ఓటీటీ డేట్ ఫిక్స్..! అనుకున్న సమయం కంటే ముందుగానే?

04 May 2022, 10:14 IST

    • చిరంజీవి, రామ్ చరణ్ కలిసి నటించిన తాజా చిత్రం ఆచార్య. ఈ సినిమా విడుదలైన రోజు నుంచి మిక్స్‌డ్ టాక్ తెచ్చుకుంది. అయితే ఈ సినిమా ఓటీటీ విడుదల తేదీ ఫిక్స్ అయినట్లు తెలుస్తోంది. అనుకున్నదానికంటే ముందుగానే రానున్నట్లు సమాచారం.
ఆచార్య
ఆచార్య (Twitter)

ఆచార్య

మెగాస్టార్ చిరంజీవి నటించిన తాజా చిత్రం ఆచార్య. ఈ సినిమా ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చి మిక్స్‌డ్ టాక్ తెచ్చుకుంది. రామ్ చరణ్ కీలక పాత్ర పోషించిన ఈ సినిమాపై అభిమానులు కూడా మిశ్రమ స్పందనలు తెలియజేస్తున్నారు. కొరటాల శివ దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రం ఓటీటీలో అనుకున్న సమమయం కంటే ముందుగానే రానున్నట్లు ఫిల్మ్ వర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. థియేట్రికల్ రిలీజ్‌కు ముందు ఓ నెల తర్వాత అంటే జూన్ మొదటి వారంలో ఓటీటీలో విడుదల చేయాలని చిత్రబృందం భావించిందట. అయితే సినిమా ఫలితం కారణంగా అనుకున్న సమయం కంటే ముందుగానే రానున్నట్లు తెలుస్తోంది.

ట్రెండింగ్ వార్తలు

Srikanth on Rave Party: మొన్న నా భార్యతో విడాకులు ఇప్పించేశారు.. ఇప్పుడిలా.. వాడెవడో నాలాగే ఉన్నాడు కానీ..: శ్రీకాంత్

Deepika Padukone Baby Bump: దీపికా బేబీ బంప్.. భర్తతో కలిసి ఓటేయడానికి వస్తూ చూపించిన బ్యూటీ

Laapataa Ladies: అందరినీ ఆలోచింపజేసేలా మంజూ మాయ్ చెప్పిన పవర్‌ఫుల్ హార్డ్ హిట్టింగ్ డైలాగ్స్ ఇవి.. మిస్ అవకండి

Devara Fear Song Lyrics: దేవర మూవీ ఫియర్ సాంగ్ లిరిక్స్ ఇవే.. అదరగొడుతున్న అనిరుధ్ రవిచందర్ మ్యూజిక్

ఆచార్య సినిమా అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ చేయనున్నట్లు సమాచారం. మే20 నుంచి ప్రసారం కానున్నట్లు తెలుస్తోంది. ఇదే నిజమైతే జూన్ మొదటి వారంలో విడుదల కావాల్సిన ఈ చిత్రం 15 రోజుల ముందుగానే ఓటీటీలో ప్రేక్షకులను పలకరించనుంది. ఇప్పటికే ఇందుకు సంబంధించిన పనులు శరవేగంగా జరుగుతున్నాయట.

తండ్రి, కుమారులు కలిసి నటించడంతో సినిమా విడుదలకు ముందుకు ప్రేక్షకుల్లో భారీగా అంచనాలు ఏర్పడ్డాయి. కానీ కథలో బలం లేకపోవడం, దర్శకుడు కొరటాల శివ మార్కు కనిపించకపోవడం లాంటి తదితర కారణాల వల్ల ఈ చిత్రంపై మిశ్రమ స్పందనలు వచ్చాయి. దీంతో ఓటీటీలో ముందుగానే రానుంది. మరి ఓటీటీలోనైనా ప్రేక్షకుల మన్ననలు పొందుతుందో లేదో వేచి చూడాలి.

కొరటాల శివ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో రామ్ చరణ్ కీలక పాత్ర పోషించారు. తండ్రి, తనయులు కలిసి చేసిన సినిమా కావడంతో చిత్రంపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. అయితే విడుదలైన తర్వాత ఈ సినిమా మిక్స్‌డ్ టాక్ తెచ్చుకోవడంతో వసూళ్లపై ఆ ప్రభావం పడింది. చరణ్ సరసన పూజాహెగ్డే నటించింది. మణిశర్మ ఈ చిత్రానికి సంగీతాన్ని సమకూర్చారు. కొణిదెల ప్రొడక్షన్స్, మ్యాట్నీ ఎంటర్‌టైన్మెంట్స్ పతాకంపై నిరంజన్ రెడ్డి, అన్వేష్ రెడ్డి నిర్మించారు. ఏప్రిల్ 29న ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు వచ్చిందీ చిత్రం.

టాపిక్

హిందుస్తాన్ టైమ్స్ తెలుగు నుంచి ఎంటర్‌టైన్మెంట్, అలాగే ఓటీటీ తాజా అప్‌డేట్స్ పొందండి.
తదుపరి వ్యాసం