తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Ott Crime Thriller: ఒకే ఓటీటీలోకి వచ్చిన రెండు కన్నడ థ్రిల్లర్ సినిమాలు.. ఎక్కడ చూడొచ్చంటే..

OTT Crime Thriller: ఒకే ఓటీటీలోకి వచ్చిన రెండు కన్నడ థ్రిల్లర్ సినిమాలు.. ఎక్కడ చూడొచ్చంటే..

05 October 2024, 19:26 IST

google News
    • OTT Kannada Movies: ఒకే రోజు రెండు కన్నడ సినిమాలు ఓటీటీలోకి వచ్చేశాయి. ఒకే ప్లాట్‍ఫామ్‍లో స్ట్రీమింగ్‍‍కు అడుగుపెట్టాయి. ఈ రెండూ క్రైమ్ థ్రిల్లర్ చిత్రాలుగా డిఫరెంట్ స్టోరీలతో ఉన్నాయి. స్ట్రీమింగ్ వివరాలివే..
OTT Crime Thriller Movies: ఒకే ఓటీటీలోకి వచ్చిన రెండు కన్నడ  థ్రిల్లర్ సినిమాలు
OTT Crime Thriller Movies: ఒకే ఓటీటీలోకి వచ్చిన రెండు కన్నడ థ్రిల్లర్ సినిమాలు

OTT Crime Thriller Movies: ఒకే ఓటీటీలోకి వచ్చిన రెండు కన్నడ థ్రిల్లర్ సినిమాలు

నాట్‍ఔట్, జూలియట్ 2 సినిమాలు ఓటీటీలో స్ట్రీమింగ్‍కు వచ్చేశాయి. ఒకే ఓటీటీలో ఎంట్రీ ఇచ్చాయి. క్రైమ్ థ్రిల్లర్ మూవీ నాటౌట్‍లో రవిశంకర్ లీడ్ రోల్ చేశారు. ఈ మూవీకి అంబరీష దర్శకత్వం వహించారు. క్రైమ్ థ్రిల్లర్ మూవీ జూలియట్ 2 లేడీ ఓరియెంటెడ్ చిత్రంగా రూపొందింది. ఈ చిత్రం బృంద ఆచార్య ప్రధాన పాత్ర పోషించారు. ఈ రెండు సినిమాలు ఓ ట్విస్టుతో స్ట్రీమింగ్‍కు అడుగుపెట్టాయి.

నాట్‍ఔట్

నాట్‍ఔట్ చిత్రం అమెజాన్ ప్రైమ్ వీడియో ఓటీటీలో తాజాగా స్ట్రీమింగ్‍కు అడుగుపెట్టింది. అయితే, ఈ క్రైమ్ థ్రిల్లర్ చిత్రం రెంటల్ విధానంలో అందుబాటులోకి వచ్చి ట్విస్ట్ ఇచ్చింది. కొన్ని రోజుల తర్వాత రెంట్ తొలగిపోయే ఛాన్స్ ఉంది. నాట్‍ఔట్ మూవీ ఈ ఏడాది జూలై 19వ తేదీన థియేటర్లలో రిలీజై మిక్స్డ్ టాక్ తెచ్చుకుంది. ఈ చిత్రంలో రవిశంకర్‌తో పాటు అజయ్ పృథ్వి, రచన ఇందర్, గోపాల్ కృష్ణ దేశ్‍పాండే, సుధి, సాల్మన్, గోవింద గౌడ కీలకపాత్రలు పోషించారు.

నాట్‍ఔట్ మూవీని థ్రిల్లర్ మూవీగా డైరెక్టర్ అంబరీశ రూపొందించారు. ఒంకికొప్పాల్ దేవరాజ్ (రవి శంకర్) అనే రౌడీ చుట్టూ ఈ స్టోరీ తిరుగుతుంది. అంబులెన్స్ కొనేందుకు దేవరాజ్ దగ్గర అజయ్ (అజయ్ పృథ్వి), శ్రీదేవి (రచన) అప్పు తీసుకొని ఉంటారు. అయితే, వారు కువైట్ వెళ్లేందుకు పాస్‍పోర్టులు తిరిగి ఇచ్చేందుకు దేవరాజ్ అంగీకరించడు. సతాయిస్తుంటాడు. అంబులెన్స్ దొంగతనానికి గురి కావడంతో అజయ్, శ్రీదేవి చిక్కుల్లో పడతారు. శ్రీధర్ (గోపాల్ కృష్ణ దేశ్‍పాండే) స్థలాన్ని దేవరాజ్ ఆక్రమించి ఉంటాడు. ఈ క్రమంలో దేవరాజ్‍ను చంపాలని అజయ్‍ను శ్రీధర్ సంప్రదిస్తారు. ఆ తర్వాత ఏం జరిగిందనేదే ఈ మూవీలో ప్రధాన అంశంగా ఉంటుంది. కరోనా వైరస్ కాలం బ్యాక్‍డ్రాప్‍లో ఈ చిత్రం సాగుతుంది.

జూలియట్ 2

జూలియట్ 2 చిత్రంలో బృంద ఆచార్య లీడ్ రోల్ చేశారు. ఈ చిత్రం కూడా అమెజాన్ ప్రైమ్ వీడియో ఓటీటీలో స్ట్రీమింగ్‍కు వచ్చింది. రెంటల్ పద్ధతిలో అడుగుపెట్టింది. ఈ చిత్రానికి విరాట్ బీ గౌడ దర్శకత్వం వహించారు. ఈ సినిమా గతేడాది ఫిబ్రవరిలో థియేటర్లలో రిలీజ్ అయింది. ఇప్పుడు ప్రైమ్ వీడియో ఓటీటీలో స్ట్రీమింగ్‍కు ఎంట్రీ ఇచ్చింది. ఏడాదిన్నర తర్వాత వచ్చినా రెంటల్ విధానంలో ఈ మూవీ స్ట్రీమింగ్‍కు వచ్చింది.

గొప్ప బాక్సర్ కావాలనే కలలు కనే జూలియట్ (బృందా ఆచార్య) చుట్టూ ఈ జూలియట్ 2 స్టోరీ తిరుగుతుంది. ఓ రోజు జూలియట్‍పై దాడి జరుగుతుంది. దానివల్ల చిన్నతనంలో తనపై జరిగిన లైంగిక దాడి విషయం ఆమెకు గుర్తుకు వస్తుంది. దీంతో రివేంజ్ తీర్చుకోవాలని నిర్ణయించుకుంటుంది.

జూలియట్ 2 చిత్రంలో బృందతో పాటు విరాట్ బీ గౌడ, అనూప్ సాగర్, ఖుష్ ఆచార్య, శ్రీకాంత్ శ్రీకి, రాయ్ బడిగర్ కీరోల్స్ చేశారు. విరాట్ బీ గౌడ దర్శకత్వం వహించిన ఈ మూవీని లిఖిత్ ఆర్ కొటియన్ ప్రొడ్యూజ్ చేశారు. రజత్ రావ్ మ్యూజిక్ అందించారు.

తదుపరి వ్యాసం