తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Kamal Haasan Health Update: కమల్‌ హాసన్‌ ఆరోగ్యం ఎలా ఉంది.. హాస్పిటల్‌ ఇచ్చిన అప్‌డేట్ ఇదీ

Kamal Haasan Health Update: కమల్‌ హాసన్‌ ఆరోగ్యం ఎలా ఉంది.. హాస్పిటల్‌ ఇచ్చిన అప్‌డేట్ ఇదీ

HT Telugu Desk HT Telugu

24 November 2022, 17:31 IST

google News
    • Kamal Haasan Health Update: కమల్‌ హాసన్‌ ఆరోగ్యం ఎలా ఉందో అన్న ఆందోళన అతని అభిమానుల్లో నెలకొంది. అయితే తాజాగా అతడు అడ్మిట్‌ అయిన హాస్పిటల్‌ కమల్‌ ఆరోగ్య పరిస్థితిపై అప్‌డేట్‌ ఇచ్చింది.
దర్శకుడు విశ్వనాథ్ ను కలిసిన సందర్భంగా కమల్ హాసన్
దర్శకుడు విశ్వనాథ్ ను కలిసిన సందర్భంగా కమల్ హాసన్ (twitter)

దర్శకుడు విశ్వనాథ్ ను కలిసిన సందర్భంగా కమల్ హాసన్

Kamal Haasan Health Update: తమిళ సూపర్‌ స్టార్‌ కమల్‌ హాసన్‌ అనారోగ్యంతో హాస్పిటల్‌లో అడ్మిట్‌ అయ్యాడన్న వార్త అభిమానుల్లో తీవ్ర ఆందోళన రేపిన విషయం తెలిసిందే. బుధవారం (నవంబర్‌ 23) అతన్ని చెన్నైలోని పోరూరు రామచంద్ర హాస్పిటల్‌లో చేర్చారు. అప్పటి నుంచి అతడు అక్కడే చికిత్స పొందుతున్నాడు.

అయితే తాజాగా హాస్పిటల్‌ అతని ఆరోగ్య పరిస్థితిపై ఒక ప్రకటన విడుదల చేసింది. అయితే అతని ఆరోగ్యం బాగానే ఉందని, ఒకటి రెండు రోజుల్లో డిశ్చార్జ్‌ చేస్తామని అందులో చెప్పింది. "కమల్‌ హాసన్‌ నవంబర్ 23న స్వల్ప జ్వరం, దగ్గు, జలుపుతో మా హాస్పిటల్‌లో అడ్మిట్‌ అయ్యారు. అతడు బాగానే కోలుకుంటున్నాడు. ఒకటి, రెండు రోజుల్లో డిశ్చార్జ్‌ చేస్తాము" అని ఆ ప్రకటనలో స్పష్టం చేసింది.

హాస్పిటల్‌ నుంచి వచ్చిన ఈ స్టేట్‌మెంట్‌తో అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు. శ్వాస సంబంధిత సమస్యలతో బాధపడిన కమల్‌ను కుటుంబ సభ్యులు హాస్పిటల్‌లో చేర్చారు. మరోవైపు బుధవారమే కమల్‌ హాసన్‌ హైదరాబాద్‌ వచ్చిన కళా తపస్వి విశ్వనాథ్‌ను కలిసి విషయం తెలిసిందే. ఆయనతో చాలాసేపు గడిపిన తర్వాత తిరిగి చెన్నై వెళ్లిన కమల్‌ అస్వస్థతకు గురయ్యాడు.

చాలా కాలం తర్వాత ఈ ఏడాది విక్రమ్‌ సినిమాతో కమల్‌ తన కెరీర్‌లోనే అతి పెద్ద విజయాన్ని అందుకున్నాడు. ఈ ఏడాది అత్యధిక కలెక్షన్లు సాధించిన సినిమాల్లో ఒకటిగా నిలిచింది. ప్రస్తుతం కమల్‌ హాసన్‌ శంకర్‌ డైరెక్షన్‌లో ఇండియన్‌ 2 సినిమాలో నటిస్తున్నాడు.

తదుపరి వ్యాసం