తెలుగు న్యూస్  /  Entertainment  /  Kamaal R Khan Compares Rrr With Pushpa 2 Tweet Viral

RRR vs Pushpa 2: ఆర్ఆర్ఆర్ కంటే పుష్ప -2 గొప్ప సినిమా - బాలీవుడ్ న‌టుడి ట్వీట్ వైరల్

02 March 2023, 14:04 IST

  • RRR vs Pushpa 2: ఆర్ఆర్ఆర్ మూవీని పుష్ప‌-2తో కంపేర్ చేస్తూ బాలీవుడ్ న‌టుడు క‌మ‌ల్ ఆర్ ఖాన్ చేసిన ట్వీట్ సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారింది. ఈ ట్వీట్‌లో అత‌డు ఏమ‌న్నాడంటే

అల్లు అర్జున్
అల్లు అర్జున్

అల్లు అర్జున్

RRR vs Pushpa 2 : గోల్డెన్ గ్లోబ్ స‌హా ప‌లు అంత‌ర్జాతీయ అవార్డుల‌ను కైవ‌సం చేసుకొని ఆర్ఆర్ఆర్ చ‌రిత్ర‌ను సృష్టించింది. బెస్ట్ ఒరిజిన‌ల్ సాంగ్ విభాగంలోనూ ఈ సినిమా ఆస్కార్‌కు నామినేట్ అయ్యింది. ఈ విభాగంలో ఆర్ఆర్ఆర్‌కు అవార్డ్ ద‌క్కే అవ‌కాశం ఉన్న‌ట్లు వార్త‌లు వినిపిస్తున్నాయి. గ‌త ఏడాది మార్చిలో రిలీజైన ఈ సినిమా 1200 కోట్ల‌కుపైగా క‌లెక్ష‌న్స్ రాబ‌ట్టి ఇండియాలో అత్య‌ధిక వ‌సూళ్ల‌ను రాబ‌ట్టిన సినిమాల్లో ఒక‌టిగా నిలిచింది.

ట్రెండింగ్ వార్తలు

OTT Top Releases in May: మే నెలలో ఓటీటీల్లో 5 ముఖ్యమైన రిలీజ్‍లు ఇవే.. సూపర్ హిట్ సినిమాలు.. ఓ భారీ వెబ్ సిరీస్

Vishwak Sen: ఇండియాలోనే గొప్ప నటుడు జూనియర్ ఎన్టీఆర్: విశ్వక్‍సేన్.. ఇంటెన్స్ యాక్షన్‍తో గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి టీజర్

Kalki 2898 AD Release Date: ఉత్కంఠకు తెర.. కల్కి 2898 ఏడీ రిలీజ్ డేట్ ఖరారు.. అధికారికంగా ప్రకటించిన మూవీ టీమ్

Prasanth Varma: బాలీవుడ్ స్టార్‌ హీరోతో ప్రశాంత్ వర్మ సినిమా అందులో భాగమే.. జై హనుమాన్ కంటే ముందే!

ఆర్ఆర్ఆర్ సినిమాను అల్లు అర్జున్ అప్‌క‌మింగ్ సీక్వెల్ పుష్ప‌-2తో కంపేర్ చేస్తూ బాలీవుడ్ న‌టుడు క‌మ‌ల్ ఆర్ ఖాన్ చేసిన ట్వీట్ సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారింది. పుష్ప -2 అన్ని రైట్స్‌కు క‌లిపి అల్లు అర్జున్ 1050 కోట్లు డిమాండ్ చేస్తున్నాడు. ఆర్ఆర్ఆర్ రైట్స్ మాత్రం 750 కోట్ల‌కే అమ్ముడుపోయాయి. ఆర్ఆర్ఆర్ కంటే పుష్ప -2నే గొప్ప సినిమా అని అల్లు అర్జున్ భావిస్తోన్నాడు అంటూ క‌మ‌ల్ ఆర్ ఖాన్ సెటైరిక‌ల్‌ ట్వీట్ చేశాడు.

అత‌డి ట్వీట్‌పై నెటిజ‌న్లు భిన్నంగా స్పందిస్తోన్నారు. కొంద‌రు ఆర్ఆర్ఆర్ కంటే పుష్ప బెట‌ర్ సినిమా అంటూ కామెంట్స్ చేస్తోన్నారు. పుష్ప -2 బాలీవుడ్‌లో హిట్ కావ‌డంలో రాజ‌మౌళిపాత్ర ఉంద‌ని మ‌రో నెటిజ‌న్ కామెంట్ చేశాడు. పుష్ప బ్రాండ్ అయితే ఆర్ఆర్ఆర్ బోరింగ్ మూవీ మ‌రో నెటిజ‌న్ పేర్కొన్నారు. మ‌రికొంద‌రు మాత్రం క‌మ‌ల్ ఆర్ ఖాన్‌పై సెటైర్స్ వేశారు.

హిందుస్తాన్ టైమ్స్ తెలుగు నుంచి ఎంటర్‌టైన్మెంట్, అలాగే ఓటీటీ తాజా అప్‌డేట్స్ పొందండి.