తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Kajal Aggarwal Bigg Boss 7 Telugu: బిగ్‌బాస్ హౌజ్‌లో అడుగుపెడుతోన్న కాజ‌ల్ - నాగ్‌తో ఆట‌పాట‌

Kajal Aggarwal Bigg Boss 7 Telugu: బిగ్‌బాస్ హౌజ్‌లో అడుగుపెడుతోన్న కాజ‌ల్ - నాగ్‌తో ఆట‌పాట‌

09 November 2023, 12:15 IST

google News
  • Kajal Aggarwal Bigg Boss 7 Telugu: బిగ్‌బాస్ తెలుగు వీకెండ్ ఎపిసోడ్‌కు కాజ‌ల్ అగ‌ర్వాల్ గెస్ట్‌గా హాజ‌రుకాబోతున్న‌ట్లు స‌మాచారం. కాజ‌ల్ అగ‌ర్వాల్ లేటెస్ట్ మూవీ స‌త్య‌భామ టీజ‌ర్‌ను బిగ్‌బాస్ హౌజ్‌లోనే రిలీజ్ చేయ‌బోతున్న‌ట్లు తెలిసింది.

 కాజ‌ల్ అగ‌ర్వాల్
కాజ‌ల్ అగ‌ర్వాల్

కాజ‌ల్ అగ‌ర్వాల్

Kajal Aggarwal Bigg Boss 7 Telugu: బిగ్‌బాస్ తెలుగు వీకెండ్ ఎపిసోడ్‌కు గెస్ట్‌గా కాజ‌ల్ అగ‌ర్వాల్ రాబోతోన్న‌ట్లు స‌మాచారం. త‌న లేటెస్ట్ మూవీ స‌త్య‌భామ టీజ‌ర్‌ను బిగ్‌బాస్ హౌజ్‌లోనే కాజ‌ల్ అగ‌ర్వాల్ రిలీజ్ చేయ‌బోతున్న‌ట్లు తెలిసింది. నాగార్జున‌తో క‌లిసి హౌజ్‌లో సంద‌డి చేయ‌డ‌మే కాకుండా కంటెస్టెంట్స్‌తో కాజ‌ల్ కొన్ని గేమ్స్ ఆడించే అవ‌కాశం ఉన్న‌ట్లు వార్త‌లు వినిపిస్తోన్నాయి.

కాజ‌ల్ ఎపిసోడ్ అభిమానుల‌ను అల‌రించేలా స్పెష‌ల్‌గా డిజైన్ బిగ్‌బాస్ యాజ‌మాన్యం సిద్ధం చేసిన‌ట్లు స‌మాచారం. శుక్ర‌వార‌మే టీజ‌ర్‌ను రిలీజ్ చేసినా కాజ‌ల్ ఎపిసోడ్ మాత్రం శ‌నివారం టెలికాస్ట్ కానున్న‌ట్లు చెబుతోన్నారు.

కాజ‌ల్ అగ‌ర్వాల్‌తో పాటు సినిమా ప్ర‌జెంట‌ర్ శ‌శికిర‌ణ్ తిక్కా, డైరెక్ట‌ర్ సందీప్ కూడా ఈ షోకు హాజ‌రు కానున్న‌ట్లు తెలిసింది. తెలుగులో కాజ‌ల్ అగ‌ర్వాల్ ఎక్కువ‌గా క‌మ‌ర్షియ‌ల్ మూవీస్‌, గ్లామ‌ర్ రోల్స్ చేసింది.

గ‌త సినిమాల‌కు భిన్నంగా ఫ‌స్ట్‌టైమ్ లేడీ ఓరియెంటెడ్ జోన‌ర్‌లో స‌త్య‌భామ మూవీ చేస్తోంది. ఇటీవ‌లే భ‌గ‌వంత్ కేస‌రిలో బ్లాక్‌బ‌స్ట‌ర్ హిట్‌ను అందుకున్న‌ది కాజ‌ల్‌. ఈ సినిమా కోసం తొలిసారి బాల‌కృష్ణ‌తో రొమాన్స్ చేసింది. కాజ‌ల్ అగ‌ర్వాల్ పాత్ర‌కు పెద్ద‌గా ప్రాధాన్య‌త లేక‌పోవ‌డంతో స‌క్సెస్ క్రెడిట్ మాత్రం కాజ‌ల్‌కు ద‌క్క‌లేదు. స‌త్య‌భామ‌తో ఆ లోటు తీరుతుంద‌ని కాజ‌ల్ భావిస్తోంది

. క్రైమ్ థ్రిల్ల‌ర్ క‌థ‌తో తెర‌కెక్కుతోన్న తెర‌కెక్కుతోన్న ఈ సినిమాలో ప్ర‌కాష్‌రాజ్‌, న‌వీన్ చంద్ర కీల‌క పాత్ర‌లు పోషిస్తోన్నారు. మ‌రోవైపు ఈ ఏడాది త‌మిళంలో ఘోస్టీతో పాటు క‌రుంగాపీయ‌మ్ సినిమాలు చేసింది కాజ‌ల్ అగ‌ర్వాల్‌. ఈ రెండు సినిమాలు డిజాస్ట‌ర్స్‌గా మిగిలి కాజ‌ల్‌కు నిరాశ‌నే మిగిల్చాయి.

తదుపరి వ్యాసం