తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Janaka Aithe Ganaka Ott Release Date: నెల రోజుల్లోపే ఓటీటీలోకి సుహాస్ కోర్టు రూమ్ డ్రామా.. కండోమ్ కంపెనీపై కేసు వేస్తే..

Janaka Aithe Ganaka OTT Release Date: నెల రోజుల్లోపే ఓటీటీలోకి సుహాస్ కోర్టు రూమ్ డ్రామా.. కండోమ్ కంపెనీపై కేసు వేస్తే..

Hari Prasad S HT Telugu

30 October 2024, 11:37 IST

google News
    • Janaka Aithe Ganaka OTT Release Date: సుహాస్ లేటెస్ట్ కోర్టు రూమ్ డ్రామా నెల రోజుల్లోపే ఓటీటీలోకి స్ట్రీమింగ్ కు వస్తోంది. కండోమ్ కంపెనీపై కేసు వేసి కోర్టులో కొట్లాడే ప్రసాద్ అనే పాత్రలో సుహాస్ ఈ మూవీలో నటించాడు.
నెల రోజుల్లోపే ఓటీటీలోకి సుహాస్ కోర్టు రూమ్ డ్రామా.. కండోమ్ కంపెనీపై కేసు వేస్తే..
నెల రోజుల్లోపే ఓటీటీలోకి సుహాస్ కోర్టు రూమ్ డ్రామా.. కండోమ్ కంపెనీపై కేసు వేస్తే..

నెల రోజుల్లోపే ఓటీటీలోకి సుహాస్ కోర్టు రూమ్ డ్రామా.. కండోమ్ కంపెనీపై కేసు వేస్తే..

Janaka Aithe Ganaka OTT Release Date: ఓటీటీలోకి మరో లేటెస్ట్ తెలుగు హిట్ మూవీ వచ్చేస్తోంది. ఈ సినిమా పేరు జనక అయితే గనక. టాలీవుడ్ యంగ్ హీరో సుహాస్ నటించిన ఈ కోర్టు రూమ్ డ్రామా అక్టోబర్ 12న దసరా సందర్భంగా రిలీజైంది. కండోమ్ కంపెనీపై కేసు అనే ఓ భిన్నమైన కాన్సెప్ట్ తో వచ్చిన సినిమా ఇది. అయితే నెల రోజుల్లోపే ఇప్పుడు ఆహా వీడియో ఓటీటీలోకి వస్తోంది. స్ట్రీమింగ్ తేదీని బుధవారం (అక్టోబర్ 30) ఆ ఓటీటీ వెల్లడించింది.

జనక అయితే గనక ఓటీటీ రిలీజ్ డేట్

యంగ్ హీరో సుహాస్ వరుస సినిమాలతో దూసుకెళ్తున్నాడు. ఈ ఏడాది అతడు నటించిన మరో మూవీ జనక అయితే గనక. ఇప్పుడీ సినిమా నవంబర్ 8 నుంచి ఆహా వీడియో ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది. ఈ విషయాన్ని తన ఎక్స్ అకౌంట్ ద్వారా తెలిపింది.

"రోలర్ కోస్టర్ ఎమోషన్స్, నాన్ స్టాప్ ఎంటర్టైన్మెంట్ కోసం సిద్ధంగా ఉండండి. జనక అయితే గనక నవంబర్ 8 నుంచి కేవలం ఆహాలో స్ట్రీమింగ్ కానుంది" అనే క్యాప్షన్ తో ట్వీట్ చేసింది. ఈ కోర్ట్ రూమ్ డ్రామా ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. ఐఎండీబీలో జకన అయితే గనక మూవీకి 9.5 రేటింగ్ నమోదు కావడం విశేషం.

జనక అయితే గనక మూవీ స్టోరీ ఏంటంటే?

సుహాస్ నటించిన జనక అయితే గనక మూవీ అక్టోబర్ 12న థియేటర్లలో రిలీజైంది. నిజానికి సెప్టెంబర్ 7నే ప్రేక్షకుల ముందుకు రావాల్సి ఉన్నా.. ఏపీ, తెలంగాణల్లో వరదల కారణంగా వాయిదా వేశారు. ఓ డిఫరెంట్ కాన్సెప్ట్ తో వచ్చిన సినిమా ఇది.

జీవితంలో బాగా సెటిలయ్యే వరకు అసలు పిల్లలే వద్దనుకునే ప్రసాద్ (సుహాస్).. పెళ్లి తర్వాత కూడా ఫ్యామిలీ ప్లానింగ్ పాటిస్తూ జాగ్రత్తగా ఉంటాడు. అయితే ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా.. అనుకోకుండా అతని భార్య గర్భం దాలుస్తుంది. దీనికి కారణం కండోమ్ కంపెనీయే అంటూ దానిపై ప్రసాద్ కోర్టుకెక్కుతాడు. ఈ కామెడీతో కూడిన ట్విస్టుతో మూవీలో కోర్టు రూమ్ డ్రామా మొదలవుతుంది. సందీప్ రెడ్డి బండ్ల డైరెక్ట్ చేసిన ఈ సినిమా ఈ కాలం యువత ఫ్యామిలీ ప్లానింగ్ కష్టాలను చూపించే ప్రయత్నం చేసింది.

కెరీర్ మొదటి నుంచీ కాస్త ఆఫ్‌బీట్ స్టోరీలను ఎంచుకుంటూ వినూత్నంగా ముందుకు సాగుతున్న సుహాస్.. ఈ జనక అయితే గనక మూవీతోనే అదే చేశాడు. ఈ సినిమాలో సంగీర్తన విపిన్, రాజేంద్ర ప్రసాద్ లాంటి వాళ్లు నటించారు. భిన్నమైన కాన్సెప్టే అయినా దానిని స్క్రీన్ పై ప్రజెంట్ చేయడంలో కాస్త తడబడటంతో ఈ మూవీకి అనుకున్న సక్సెస్ రాలేదు. కాస్త బోల్డ్ సబ్జెక్ట్ తో వచ్చిన ఈ జనక అయితే గనక మూవీ నవంబర్ 8 నుంచి ఆహా ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది. మరి ఓటీటీలో ఈ సినిమాకు ఎంతమేర రెస్పాన్స్ వస్తుందో చూడాలి.

హిందుస్తాన్ టైమ్స్ తెలుగు నుంచి ఎంటర్‌టైన్మెంట్, అలాగే ఓటీటీ తాజా అప్‌డేట్స్ పొందండి.
తదుపరి వ్యాసం