Digital Condom : డిజిటల్ కండోమ్ లాంచ్.. బ్లూటూత్‌తోనే పని.. దీనిని ఎలా వాడాలి?
Digital Condom Launch : ప్రస్తుతం డిజిటల్ కండోమ్ యాప్ గురించి నెట్టింట చర్చ ఎక్కువగా నడుస్తోంది. ఇంతకీ ఈ డిజిటల్ కండోమ్‌ను ఎందుకు లాంచ్ చేశారు? దీనివల్ల ప్రయోజనం ఏంటి?
ప్రస్తుతం వార్తల్లో నిలిచే ఓ ప్రత్యేకమైన రకం కండోమ్ మార్కెట్లోకి వచ్చింది. అలా అని దాని గురించి తప్పుగా అనుకోవద్దు. మార్కెట్‌లోకి వచ్చిన ఈ కొత్తది ఏంటంటే.. డిజిటల్ కండోమ్. జర్మనీకి చెందిన వెల్నెస్ బ్రాండ్ బిల్లీ బాయ్ దీనిని లాంచ్ చేసింది. ప్రైవేట్ సమయాల్లో ప్రైవసీని కాపాడేందుకు రూపొందించిన డిజిటల్ కండోమ్ యాప్ ఇది. అంటే మీ అనుమతి లేకుండా ఎదుటివ్యక్తి కాల్ రికార్డ్ చేయలేరు. మీ వాయిస్ కూడా రికార్డ్ చేయలేరు. ఒక వేళ ట్రై చేస్తే.. మీకు అలర్ట్ వస్తుంది. చాలా మంది.. వీడియో కాల్‌లో ఉన్నప్పుడు ప్రైవేట్ వీడియోలు రికార్డు చేస్తుంటారు. తర్వాత ఇబ్బందులు పెడతారు. ఇక అలాంటివి ఈ యాప్ వాడే ఫోన్‌లో కుదరవు.
ఈ యాప్‌ను క్యామ్డోమ్ అని కూడా పిలుస్తారు. అనుమతి లేకుండా వీడియో లేదా ఆడియో కంటెంట్ రికార్డింగ్‌ను ఆపేందుకు బ్లూటూత్ టెక్నాలజీని ఉపయోగించి దీనిని వాడాలి. ఈ యాప్ స్మార్ట్ ఫోన్ కెమెరా, మైక్రోఫోన్‌ను నిలిపివేస్తుంది. ఇది మీ వ్యక్తిగత గోప్యతను కాపాడుతుంది. వీడియో, ఆడియో ఎదుటివ్యక్తి రికార్డు చేయలేరు.
బిల్లీ బాయ్ తాజా ఆవిష్కరణ ప్రజలను మోసపోకుండా రక్షించడానికి, వారి గోప్యతను రక్షించడానికి పనిచేస్తుంది. డిజిటల్ కండోమ్ లాంచ్ అయినప్పటి నుండి ఇది ఇంటర్నెట్‌ను ఊపేస్తోంది. కొంతమంది దీనిని ప్రశంసిస్తున్నారు, మరికొందరు దీనిని పనికిరాని ఆవిష్కరణగా చెబుతున్నారు.
ఈ యాప్ ఉపయోగించడం చాలా సులభమని, ఇది ప్రజల గోప్యత, భద్రతకు భరోసా ఇస్తుందని బిల్లీ బాయ్ చెప్పారు. దీన్ని ఉపయోగించడానికి యూజర్ యాప్‌ను ఆన్ చేసి వర్చువల్ బటన్‌ను స్వైప్ చేయాలి. ఇలా చేయడం వల్ల ఫోన్ కెమెరా, మైక్రోఫోన్ ఆఫ్ అవుతాయి.
ఈ యాప్ ద్వారా వీడియోను రికార్డ్ చేయడానికి ప్రయత్నిస్తే అవ్వదు. హెచ్చరికను పంపుతుంది. అలారం మోగిస్తుంది. డిజిటల్ కండోమ్ యాప్ ద్వారా ఏ యూజర్ అయినా ఒకేసారి పలు డివైస్‌లలో కెమెరా, మైక్రోఫోన్‌ను బ్లాక్ చేయవచ్చు. మొత్తం మీద ఈ యాప్ వ్యక్తిగత సమయాల్లో ప్రజల గోప్యతను డిజిటల్‌గా రక్షిస్తుంది. ప్రైవేట్ క్షణాల్లో ఆడియో-వీడియో రికార్డింగ్‌ను ఆపాల్సిన అవసరాన్ని కంపెనీ నొక్కి చెప్పింది
ప్రస్తుతం ఈ యాప్ 30కి పైగా దేశాల్లోని ఆండ్రాయిడ్ స్మార్ట్ ఫోన్ యూజర్లకు అందుబాటులో ఉందని, రాబోయే రోజుల్లో ఐఓఎస్ యూజర్లకు కూడా అందుబాటులోకి వస్తుందని బిల్లీ బాయ్ తెలిపారు. ఈ యాప్ డెవలపర్ ఫెలిప్ అల్మేడా మాట్లాడుతూ ఈ రోజుల్లో ఫోన్లు మన జీవితంలో ఒక ముఖ్యమైన భాగంగా మారాయని చెప్పారు. మన ప్రైవేట్ డేటా చాలా వరకు మన ఫోన్లోనే ఉంటుంది. అందువల్ల అనుమతి లేకుండా మీ వ్యక్తిగత విషయాలను రికార్డ్ చేయకుండా ఉండటానికి, బ్లూటూత్ ఉపయోగించి ఫోన్ కెమెరా, మైక్‌ను బ్లాక్ చేయగల మొదటి యాప్‌ను మేం సృష్టించామన్నారు.
ఈ యాప్ బ్లూటూత్ ఆధారంగా పని చేస్తుంది. యాప్‌ను స్వైప్ చేసి యాక్టివేట్ చేయాలి. ఈ కారణంగా కెమెరా, మైక్రోఫోన్ ఏ విషయాన్ని రికార్డు చేయకుండా యాప్ అడ్డుకుంటుంది. ఎవరైనా దొంగతనంగా రికార్డు చేయాలని ప్రయత్నిస్తే.. మీకు అలర్ట్ సందేశం వస్తుంది. ఈ యాప్ ద్వారా ఒకే సమయంలో పలు డివైజ్‌లను అడ్డుకోవచ్చు.