Jailer Twitter Review: జైలర్ ట్విట్టర్ రివ్యూ - బాషా సినిమాతో జైలర్‌కు లింకేంటి?
10 August 2023, 10:06 IST
Jailer Twitter Review:రజనీకాంత్ జైలర్ మూవీ ఈ గురువారం (ఆగస్ట్ 10న) రిలీజైంది. యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రూపొందిన ఈ సినిమాకు నెల్సన్ దర్శకత్వం వహించాడు. ఈ సినిమా ఓవర్‌సీస్ ప్రీమియర్ టాక్ ఎలా ఉందంటే...
రజనీకాంత్ జైలర్ మూవీ
Jailer Twitter Review: మాస్ ఆడియెన్స్‌లో తిరుగులేని ఫాలోయింగ్ కలిగిన హీరోల్లో రజనీకాంత్ ఒకరు. రజనీకాంత్ (Rajinikanth) సినిమా అంటే తమిళం, తెలుగు అనే భేదాలు లేకుండా అన్ని భాషల ఆడియెన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తుంటారు. రజనీకాంత్ హీరోగా నటించిన తాజా చిత్రం జైలర్. యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రూపొందిన ఈ సినిమాకు బీస్ట్ ఫేమ్ నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వం వహించాడు.
మోహన్‌లాల్, శివరాజ్‌కుమార్, రమ్యకృష్ణ, జాకీష్రాఫ్, తమన్నా కీలక పాత్రలను పోషించారు. పాన్ ఇండియన్ లెవెల్‌లో భారీ అంచనాలతో గురువారం (ఆగస్ట్ 10న) ఈ మూవీ ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఈ సినిమాకు ఓవర్‌సీస్ ఆడియెన్స్ నుంచి పాజిటివ్ టాక్ లభిస్తోంది. యూఎస్ ప్రీమియర్స్ టాక్ ఎలా ఉందంటే...
గతం మర్చిపోయిన జైలర్...
ఈ సినిమాలో ముత్తువేల్ పాండియన్ అనే రిటైర్డ్ జైలర్‌గా రజనీకాంత్ క్యారెక్టర్ డిఫరెంట్‌గా ఉందని ఆడియెన్స్ చెబుతున్నారు. ముత్తువేల్ పాండియన్ గతం ఏమిటి? అతడిపై కొందరు గ్యాంగ్‌స్టర్స్ ఎందుకు పగపట్టారు? జ్ఞాపకశక్తిని కోల్పోయిన ముత్తువేల్ పాండియన్ వారిపై ఎలా రివేంజ్ తీర్చుకున్నాడన్నది మాస్, యాక్షన్‌తో పాటు ఎంటర్‌టైన్‌మెంట్‌ను సమపాళ్లలో జోడించి దర్శకుడు నెల్సన్ జైలర్ సినిమాను తెరకెక్కించాడని ఓవర్‌సీస్ ఆడియెన్స్ చెబుతున్నారు.
ఫస్ట్ హాఫ్‌లో రజనీకాంత్ క్యారెక్టర్‌కు సంబంధించి చాలా ట్విస్ట్‌లు ఇస్తూ సెకండాఫ్‌లో వాటిని రివీల్ చేసుకుంటూ వెళ్లడం బాగుందని పేర్కొంటున్నారు. రజనీకాంత్ కామెడీ టైమింగ్ కొత్త కోణంలో ఆవిష్కరించడం బాగుందనే కామెంట్స్ వినిపిస్తున్నాయి.
బాషా మ్యాజిక్...
రజనీకాంత్ కల్ట్ క్లాసిక్ మూవీ బాషాను గుర్తుచేస్తే వచ్చే ఇంటర్వెల్ ఎపిసోడ్ ఈ సినిమాకు హైలైట్‌గా నిలుస్తుందని ట్వీట్స్ చేస్తున్నారు. ఫస్ట్ హాప్‌లో కథ కంటే కామెడీ, యాక్షన్ అంశాలకే దర్శకుడు ఇంపార్టెన్స్ ఇచ్చారని, సీరియల్ రోల్‌లో రజనీకాంత్ వేసే పంచ్‌లు, ప్రాసలతో ఆకట్టుకుంటాయని అంటున్నారు. సెకండాఫ్‌లోనే అసలైన కథలోకి దర్శకుడు ఎంటర్ అయ్యాడని చెబుతున్నారు.
తనకు పట్టున్న డార్క్ కామెడీ జోనర్‌లో రొటీన్ కాన్సెప్ట్‌తోనే జైలర్ కథను నెల్సన్ రాసుకున్నాడని, ట్రీట్‌మెంట్ మాత్రం వైవిధ్యంగా ఉందని పేర్కొంటున్నారు. స్క్రీన్‌ప్లే స్లోఫేజ్‌లో సాగడం, రజనీ ఇమేజ్‌కు తగ్గట్లుగా క్లైమాక్స్ లేకపోవడం నిరాశను కలిగిస్తుందని అంటున్నారు. యాక్షన్ అంశాల్లో హింస కాస్త ఇబ్బంది పెడుతుందని అంటున్నారు. తమన్నా, సునీల్ ఎపిసోడ్స్ జైలర్ కు పెద్ద డ్రా బ్యాక్ గా చెబుతున్నారు.
శివరాజ్ కుమార్, మోహన్ లాల్ గెస్ట్ రోల్స్ తో పాటుఅనిరుధ్ బీజీఎమ్, యోగిబాబు కామెడీ ఈ సినిమాకు ప్లస్సయ్యాయని ట్వీట్స్ చేస్తున్నారు. రజనీకాంత్ వన్ మెన్ షోగా సినిమా ఉంటుందని, ఆయన అభిమానులను మాత్రం పండుగలా ఉంటుందని కామెంట్స్ వినిపిస్తున్నాయి. రజినీ ఈజ్ బ్యాక్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు.