తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Indian 2 Box Office: మళ్లీ పడిపోయిన ఇండియన్ 2 కలెక్షన్స్.. 5 రోజుల వసూళ్లు ఎంతంటే?

Indian 2 Box Office: మళ్లీ పడిపోయిన ఇండియన్ 2 కలెక్షన్స్.. 5 రోజుల వసూళ్లు ఎంతంటే?

Sanjiv Kumar HT Telugu

17 July 2024, 10:57 IST

google News
  • Indian 2 Worldwide Box Office Collection Day 5: దాదాపు 28 ఏళ్ల తర్వాత కమల్ హాసన్, శంకర్ కలయికలో తెరకెక్కిన ఇండియన్ 2 సినిమా బాక్సాఫీస్ వద్ద నిలదొక్కుకునేందుకు ప్రయత్నిస్తోంది. ఐదో రోజు కూడా కలెక్షన్స్ తక్కువగానే వచ్చాయి. భారతీయుడు 2 టోటల్ 5 డేస్ కలెక్షన్స్ చూస్తే..

మళ్లీ పడిపోయిన ఇండియన్ 2 కలెక్షన్స్.. 5 రోజుల వసూళ్లు ఎంతంటే?
మళ్లీ పడిపోయిన ఇండియన్ 2 కలెక్షన్స్.. 5 రోజుల వసూళ్లు ఎంతంటే?

మళ్లీ పడిపోయిన ఇండియన్ 2 కలెక్షన్స్.. 5 రోజుల వసూళ్లు ఎంతంటే?

Indian 2 Box Office Collection: లోక నాయకుడు కమల్ హాసన్-సెన్సేషనల్ డైరెక్టర్ శంకర్ కాంబినేషన్‌లో వచ్చిన ఇండియన్ 2 సినిమా పరిస్థితి ఏమాత్రం బాగోలేదు. సుమారు 28 ఏళ్ల తర్వాత అత్యంత భారీ అంచనాల మధ్య రిలీజైన భారతీయుడు 2 సినిమా బాక్సాఫీస్ వద్ద కలెక్షన్స్ నిలదొక్కునే విషయంలో తంటాలు పడుతోంది.

జూలై 12న విడుదలైన ఇండియన్ 2 సినిమా మొదటి మూడు రోజుల్లో మంచి వసూళ్లు రాబట్టింది. కానీ ఆ తర్వాత సోమవారం నుంచి దారుణమైన ఫలితాలు చవిచూస్తోంది. వర్కింగ్ డే అయిన మండే రోజు రూ. 3.2 కోట్ల నెట్ కలెక్షన్స్ రాబట్టిన భారతీయుడు 2 చిత్రానికి ఐదో రోజున కలెక్షన్స్ మరింతగా పడిపోయాయి. మండే పాస్ కానీ ఈ సినిమా మంగళవారం కూడా ఫలితాల్లో పాజిటివ్‌గా ఎలాంటి మార్పు కనిపించలేదు.

ఇండియాలో భారతీయుడు 2 సినిమాకు 5వ రోజున రూ. 3 కోట్ల కలెక్షన్స్ వచ్చాయి. వీటిలో తమిళనాడు నుంచి రూ. 2 కోట్లు ఉండగా.. హిందీ నుంచి కేవలం నాలుగు లక్షలు, అలాగే తెలుగు నుంచి ఆరు లక్షలు మాత్రమే వచ్చినట్లు ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. ఇలా ఈ సినిమా 5 రోజుల్లో భారత్‌లో రూ. 65.15 కోట్ల నెట్ కలెక్షన్స్ రాబట్టింది.

ఈ 65.15 కోట్లల్లో తమిళనాట నుంచి రూ. 45.55 కోట్లు, హిందీ బెల్ట్ నుంచి రూ. 4.65 కోట్లు, తెలుగు వెర్షన్ నుంచి రూ. 14.95 కోట్లు వరకు ఉన్నాయి. ఈ లెక్క ప్రకారం చూస్తే.. కమల్ హాసన్ ఇండియన్ 2 సినిమాకు అధికంగా తమిళం నంచి కలెక్షన్స్ ఉంటే.. అతి తక్కువగా నార్త్ నుంచి ఉన్నాయి.

ఇండియాలో 5 రోజుల్లో రూ. 74.34 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ సాధించిన ఇండియన్ 2 సినిమా వరల్డ్ వైడ్‌గా రూ. 116.34 కోట్ల గ్రాస్ వసూళ్లు కొల్లగొట్టింది. ఇక ఇండియన్ 2 సినిమా తెలుగు రాష్ట్రాల్లో రూ. 25 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ సాధించాలి. కానీ, సినిమాకు రూ. 14.95 కోట్లు వచ్చాయి. కాబట్టి తెలుగు రాష్ట్రాల్లో భారతీయుడు 2 హిట్ కావాలంటే రూ. 10.5 కోట్లు సాధించాల్సి ఉంటుంది.

అలాగే ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమాకు రూ. 172 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్‌ ఫిక్స్ అయింది. వరల్డ్ వైడ్‌గా హిట్ సక్సెస్ అందుకోవాలంటే ఇండియన్ 2 సినిమాకు ఇంకా రూ. 110 కోట్ల వరకు రావాల్సి ఉంటుంది. ఇదిలా ఉంటే, ఈ సంవత్సరం అత్యంత ఆసక్తిగా ఎదురుచూసిన తమిళ చిత్రాలలో ఈ భారతీయుడు 2 ఒకటి. శంకర్ దర్శకత్వంలో 1996లో వచ్చిన కల్ట్ మూవీ 'ఇండియన్'కు సీక్వెల్‌గా 'ఇండియన్ 2' తెరకెక్కిన విషయం తెలిసిందే. లైకా ప్రొడక్షన్స్, రెడ్ జెయింట్ మూవీస్ సంయుక్తంగా ఈ సినిమాను నిర్మించాయి.

భారతీయుడు 2 చిత్రంలో సిద్ధార్థ్, ఎస్.జె.సూర్య, బాబీ సింహా, గుల్షన్ గ్రోవర్, రకుల్ ప్రీత్ సింగ్ తదితరులు ఇతర కీలక పాత్రలు పోషింయారు. భారతీయుడు సినిమాకు ఏఆర్ రెహమాన్ సంగీతం అందించగా.. ఈ సీక్వెల్‌కు అనిరుధ్ సంగీతం అందించారు.

హిందుస్తాన్ టైమ్స్ తెలుగు నుంచి ఎంటర్‌టైన్మెంట్, అలాగే ఓటీటీ తాజా అప్‌డేట్స్ పొందండి.
తదుపరి వ్యాసం