Ileana in Bikini: బాత్రూంలో బికినీలో ఇలియానా సెల్ఫీ.. ఇంటర్నెట్ను బ్రేక్ చేస్తున్న హాట్ ఫొటో
19 February 2024, 12:44 IST
- Ileana in Bikini: జీరో సైజ్ బాడీతో ఒకప్పుడు టాలీవుడ్ ను ఏలిన నటి ఇలియానా బాత్రూంలో బికినీలో దిగిన సెల్ఫీ ఇప్పుడు వైరల్ అవుతోంది. తాను ప్రెగ్నెంట్ గా ఉన్న సమయంలో దిగిన ఫొటో కావడం విశేషం.
బాత్రూంలో బికినీలో ఇలియానా సెల్ఫీ
Ileana in Bikini: ఇలియానా హాట్ ఫొటో చూశారు కదా. ప్రస్తుతం ఆమె తన అమ్మతనాన్ని ఆస్వాదిస్తోంది. గతేడాది కొడుకు కోవాకు జన్మనిచ్చిన ఇలియానా.. తాజాగా తన ఇన్స్టాగ్రామ్ స్టోరీస్ లో ఈ బాత్రూం సెల్ఫీని పోస్ట్ చేసింది. తాను నాలుగు నెలల గర్భవతిగా ఉన్నప్పుడు దిగిన ఫొటో అంటూ ఇల్లీ బేబీ షేర్ చేసిన ఈ ఫొటో వైరల్ అవుతోంది.
ఇలియానా బికినీ ఫొటో
గోవా బ్యూటీ ఇలియానా గతంలో ఎన్నోసార్లు బికినీలో కనిపించడం చూసే ఉంటారు. కానీ తాజాగా ఆమె షేర్ చేసిన ఫొటోకు మాత్రం ఓ ప్రత్యేకత ఉంది. తన ఇన్స్టాగ్రామ్ స్టోరీస్ లో ఆమె పోస్ట్ చేసిన ఈ ఫొటో సరిగ్గా ఏడాది కిందట తీసినది. అంటే అప్పట్లో ఆమె ప్రెగ్నెంట్. తాను నాలుగు నెలల ప్రెగ్నెన్సీలో ఉన్నప్పటి ఫొటో ఇది అంటూ ఇలియానా ఈ బికినీ సెల్ఫీ షేర్ చేసింది.
ఈ ఫొటోలో ఆమె ప్రెగ్నెంట్ అన్న విషయం స్పష్టంగా కనిపిస్తోంది. గతేడాది ఫిబ్రవరిలో ఈ ఫొటో దిగగా.. ఏడాది అయిందంటూ ఆమె ఈ ఫొటో పోస్ట్ చేసింది. తన ప్రెగ్నెన్సీ రోజులను బాగానే ఆస్వాదించిన ఆమె.. ఇప్పుడా రోజులను మిస్ అవుతున్నాను అన్నట్లుగా ఆ జ్ఞాపకాలను నెమరేసుకుంటోంది. ప్రస్తుతం ఇలియానా అమెరికాలో తన పార్ట్నర్ తో కలిసి ఉంటోంది.
ఈ మిర్రర్ సెల్ఫీ బ్లాక్ అండ్ వైట్ లో ఉండటం విశేషం. బ్లాక్ బికినీలో ఓ చేత్తో తన బేబీ బంప్ ను చూపిస్తూ సెల్ఫీ దిగింది. "ఏడాది కిందట. నాలుగు నెలల ప్రెగ్నెంట్ గా ఉన్న సమయంలో ఇలా" అనే క్యాప్షన్ తో ఇలియానా ఈ ఫొటో షేర్ చేసింది. ఆమె ఈ మధ్యే తన పార్ట్నర్ మైఖేల్ డోలాన్ తో కలిసి వాలెంటైన్స్ డే సెలబ్రేట్ చేసుకుంది.
ఈ సెలబ్రేషన్స్ లో ఇద్దరూ బ్లాక్ డ్రెస్సుల్లో కనిపించారు. ఇలియానా బ్లాక్ గౌన్ లో స్టన్నింగా కనిపించింది. నా తొలి రియల్ వాలెంటైన్ కు హ్యాపీ వాలెంటైన్స్ డే అంటూ ఆ ఫొటోను ఈ అందాల నటి షేర్ చేసింది. ఇక ఆమె సినిమాల విషయానికి వస్తే ఇలియానా.. దో ఔర్ దో ప్యార్ మూవీలో నటిస్తోంది. ఇందులో విద్యా బాలన్, ప్రతీక్ గాంధీలాంటి వాళ్లు కూడా ఉన్నారు. ఈ సినిమా మార్చి 29న రిలీజ్ కానుంది.
ఇలియానా పెళ్లి
ఇలియానా గతేడాది ఆగస్ట్ లో మగబిడ్డకు జన్మనిచ్చినా.. అంతకుముందు మే నెలలోనే బాయ్‌ఫ్రెండ్ మైఖేల్ డోలాన్ ను పెళ్లి చేసుకున్నట్లు వార్తలు వచ్చాయి. వీటిపై ఆ మధ్య ఓ ఇంటర్వ్యూలో ఆమె స్పందించింది. "దీనిపై చాలా పుకార్లు వచ్చాయి. దీనిని వాటికే వదిలేద్దాం. కాస్త మిస్టరీ ఉండటం కూడా బాగుంటుంది కదా. నా జీవితంలోని ఈ భాగం గురించి నేను పెద్దగా మాట్లాడదలచుకోలేదు.
నా రిలేషన్షిప్ గురించి గతంలో చెప్పాను. దాని గురించి చాలా మంది చాలా రకాలుగా మాట్లాడుకున్నారు. నా గురించి ఏది మాట్లాడినా నేను పట్టించుకోను. కానీ నా పార్ట్నర్ గురించి లేదా ఫ్యామిలీ గురించి మాట్లాడితే మాత్రం నాకు బాగా అనిపించదు" అని ఇలియానా స్పష్టం చేసింది.
టాపిక్