Boys Hostel OTT Release Date: బాయ్స్ హాస్టల్ ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్ - కానీ ఓ ట్విస్ట్!
29 August 2023, 13:58 IST
Boys Hostel OTT Release Date: కన్నడ బ్లాక్‌బస్టర్ మూవీ హాస్టల్ హుదుగురు బెకగిద్దారే ఓటీటీలోకి రాబోతోంది. సెప్టెంబర్ 1 నుంచి జీ5 ఓటీటీలో ఈ మూవీ స్ట్రీమింగ్ కానుంది.
బాయ్స్ హాస్టల్
Boys Hostel OTT Release Date: కన్నడంలో ఈ ఏడాది చిన్న సినిమాల్లో ట్రెండ్ సెట్టర్‌గా నిలిచింది హాస్టల్ హుదుగురు బెకగిద్దారే మూవీ. ఔట్ అండ్ ఔట్ కామెడీ ఎంటర్‌టైనర్‌గా రూపొందిన ఈ మూవీ తెలుగులో బాయ్స్ హాస్టల్ పేరుతో అనువాదమై మంచి వసూళ్లను రాబట్టింది. నితిన్ కృష్ణమూర్తి దర్శకత్వం వహించిన ఈ సినిమాలో ప్రజ్వల్, మంజునాథ్ కీలక పాత్రలు పోషించారు.
కాగా హాస్టల్ హుదుగురు బెకగిద్దారే మూవీ ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్సయింది. సెప్టెంబర్ 1 నుంచి జీ5 ఓటీటీలో ఈ మూవీ స్ట్రీమింగ్ కానుంది. కేవలం కన్నడ వెర్షన్‌ను మాత్రమే రిలీజ్ చేయబోతున్నట్లు సమాచారం. తెలుగు వెర్షన్ థియేటర్స్‌లో ఆడుతుండటంతో ఓ వారం ఆలస్యంగా స్ట్రీమింగ్ అయ్యే అవకాశం ఉన్నట్లు సమాచారం.
కన్నడ వెర్షన్‌ను స్టార్ హీరో రక్షిత్ శెట్టి రిలీజ్ చేయగా తెలుగులో ఛాయ్ బిస్కెట్ తో కలిసి అన్నపూర్ణ స్టూడియోస్ డబ్ చేసింది. కన్నడ వెర్షన్‌లో రిషబ్ శెట్టి, రమ్య అతిథి పాత్రల్లో నటించగా తెలుగులో ఈ క్యారెక్టర్స్‌ను తరుణ్ భాస్కర్, రష్మి చేశారు.
బాయ్స్ హాస్టల్ కథేమిటంటే...
అజిత్ అనే యువకుడు తాను చేయబోయే ఓ షార్ట్ ఫిల్మ్ కథను హాస్టల్‌లోని రూమ్‌మేట్స్‌కు చెబుతుంటాడు. ఆ షార్ట్ ఫిల్మ్ కథలో మాదిరిగానే నిజంగానే వారి హాస్టల్ వార్డెన్ చనిపోతాడు. వార్డెన్ రూమ్‌లో దొరికిన సూసైడ్ లెటెర్‌లో అజిత్‌తో పాటు అతడి స్నేహితుల పేర్లు రాసి ఉంటాయి.
వార్డెన్ డెడ్‌బాడీని అజిత్ అండ్ ఫ్రెండ్స్ ఎలా దాచిపెట్టారు? ఈ క్రమంలో వారికి ఎదురైన అనుభవాలు ఏమిటన్నదే వినోదాత్మక పంథాలో దర్శకుడు నితిన్ కృష్ణమూర్తి ఈ సినిమాలో చూపించారు.
టాపిక్