OTT Horror Thriller: అత్యంత భయపెట్టే హారర్ మూవీ చూడాలనుకుంటున్నారా? ఓటీటీలో ఈ సినిమా ట్రై చేయండి.. తెలుగులో స్ట్రీమింగ్
22 December 2024, 12:52 IST
- OTT Horror Thriller: హారర్ సినిమాలు చూడడం చాలా మందికి ఇష్టం. అలాంటి వారికి ‘హెరడెటరీ’ చిత్రం కచ్చితంగా నచ్చుతుంది. ఈ హాలీవుడ్ మూవీ తప్పక భయపెడుతుంది. ఈ చిత్రం ఓటీటీలో ఎక్కడ చూడొచ్చంటే..
OTT Horror Thriller: అత్యంత భయపెట్టే హారర్ మూవీ చూడాలనుకుంటున్నారా? ఓటీటీలో ఈ సినిమా ట్రై చేయండి.. తెలుగులో స్ట్రీమింగ్
ఎంత భయమేసినా హారర్ సినిమాలు చూడడం చాలా మందికి ఇష్టం. దీన్ని ఓ థ్రిల్‍లా ఫీల్ అవుతారు. అందుకే ఈ జానర్ చిత్రాలకు మంచి క్రేజ్ ఉంటుంది. అందుకే గతంలో వచ్చిన హారర్ సినిమాలను కూడా కొందరు చూసేందుకు ఇష్టపడతారు. వణికించేలా ఏ చిత్రాలు ఉన్నాయా అని చూస్తుంటారు. అలాంటి చిత్రమే హెరడెటరీ (Hereditary). హాలీవుడ్ నుంచి వచ్చిన అత్యంత భయానక సినిమాల్లో ఇది ఒకటి. ఈ చిత్రం బాగా పాపులర్ అయింది. హారర్ సినిమాలు చూడాలనుకునే వారికి తెగనచ్చేస్తుంది.
హెరడెటరీ చిత్రం పక్కా హారర్ మూవీలా ఉంటుంది. భయపట్టే సీన్లు పుష్కలంగా ఉంటాయి. ఫుల్ హారర్ అనుభూతిని ఇస్తుంది. సీడ్ ఎడ్జ్‌లో కూర్చునేలా.. అక్కడక్కడా కళ్లు మూసుకునేంత థ్రిల్లింగ్‍గా సాగుతుంది. ఈ సినిమా ఓటీటీలో అందుబాటులో ఉంది. తెలుగులోనూ స్ట్రీమింగ్ అవుతోంది.
స్ట్రీమింగ్ ఎక్కడ?
హెరడెటరీ సినిమా అమెజాన్ ప్రైమ్ వీడియో ఓటీటీలో స్ట్రీమింగ్‍కు అందుబాటులో ఉంది. ఈ చిత్రం ఇంగ్లిష్‍తో పాటు తెలుగులోనూ చూడొచ్చు.
హెరడెటరీ చిత్రం 2018 జూన్‍లో థియేటర్లలో రిలీజైంది. సూపర్ టాక్ తెచ్చుకొని బ్లాక్‍బస్టర్ అయింది. సుమారు 10 మిలియన్ డాలర్లతో రూపొందిన ఈ హారర్ మూవీ 87.8 మిలియన్ డాలర్లను దక్కించుకుంది. ఈ మూవీకి ఎక్కువ శాతం పాజిటివ్ రివ్యూలే వచ్చాయి. ఈ చిత్రాన్ని ఇప్పుడు ప్రైమ్ వీడియో ఓటీటీలో వీక్షించొచ్చు.
హెరడెటరీ మూవీలో టోనీ కొలెట్, అలెక్స్ వుల్ఫ్, గాబ్రియెల్ బ్రైన్, మిల్లీ షార్పిరో, క్రిస్టీ సమ్మర్‌హైస్ ప్రధాన పాత్రలు పోషించారు. ఈ మూవీకి ఆరీ యాస్టర్ దర్శకత్వం వహించారు. ఏ24, పామ్‍స్టార్ మీడియా, ఫించ్ ఎంటర్‌టైన్‍మెంట్, విండీ హిల్ పిక్చర్స్ ప్రొడ్యూజ్ చేసిన ఈ మూవీకి.. కాలిన్ స్టెట్‍సన్ సంగీతం అందించారు.
హెరడెటరీ స్టోరీ లైన్
యానీ గ్రాహం (టోనీ కొలెట్) అనే మహిళ తన భర్త, ఓ కొడుకు, మతిస్థిమితం సరిగా లేని కూతురుతో జీవనం సాగిస్తుంటుంది. అయితే, తన తల్లి ఎలెన్ చనిపోయిందని తెలుసుకొని అంత్యక్రియలకు వెళతారు. ఆ తర్వాత యానీ కుటుంబానికి అనూహ్యమైన పరిస్థితులు ఎదురవుతాయి. ఆత్మ వెంటాడుతున్నట్టు అనిపిస్తుంది. ఈ క్రమంలో భయానక విషయాలను ఎదుర్కొంటారు. ఓ దశలో యానీ కూతురు చార్లీ తల, మొండెం వేరు అవుతాయి. ఈ క్రమంలో తమ వంశం గురించి భయానక విషయాలు యానీ తెలుసుకుంటుంది. వారసత్వంగా వచ్చే శాపం నుంచి తప్పించుకునేందుకు ఆ ఫ్యామిలీ ప్రయత్నిస్తుంది. ఆ తర్వాత ఏం జరిగింది? వీటి నుంచి యానీ కుటుంబం బయటపడిందా అనే విషయాల చుట్టూ ఈ మూవీ సాగుతుంది.