Hebah Patel: డైరెక్ట్ ఓటీటీలోకి వచ్చేస్తున్న హెభాపటేల్ ఓదెల రైల్వే స్టేషన్
23 August 2022, 6:43 IST
Hebah Patel:హేభాపటేల్ హీరోయిన్‌గా నటించిన ఓదేల రైల్వే స్టేషన్ సినిమా (Odela Railway Station) డైరెక్ట్‌గా ఓటీటీలో రిలీజ్ కాబోతున్నది. ఈ సినిమా ఎప్పుడు, ఏ ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లో రిలీజ్ కానుందంటే...
ఓదెల రైల్వే స్టేషన్
Odela Railway Station Release Date: కుమారి 21 ఎఫ్ లో బోల్డ్ క్యారెక్టర్‌తో యూత్ ను మెప్పించింది హేభాపటేల్. సుకుమార్ దర్శకత్వ పర్యవేక్షణలో రూపొందిన ఈ సినిమా కమర్షియల్‌గా పెద్ద సక్సెస్‌ను సాధించింది. కుమారి 21 ఎఫ్ తో పాటు అలా ఎలా,ఈడోరకం,ఆడోరకం సినిమాలు తెలుగులో హేభాపటేల్‌కు విజయాల్ని తెచ్చిపెట్టిన ఆ జోరును కంటిన్యూ చేయలేకపోయింది.
గ్లామర్ తళుకులతో ఇండస్ట్రీలో నిలదొక్కుకునేందుకు ఆమె చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. రామ్ హీరోగా నటించిన రెడ్‌లో ఐటెమ్‌సాంగ్ చేసింది. ఈ సినిమాతో ఆమెకు పెద్దగా లక్ కలిసిరాలేదు. త్వరలోనే ఆహా ఓటీటీ ద్వారా హేభాపటేల్ తెలుగు ప్రేక్షకుల్ని పలకరించబోతున్నది.
ఆమె హీరోయిన్‌గా నటించిన ఓదెల రైల్వే స్టేషన్ ఆగస్ట్ 26న ఆహా ఓటీటీలో రిలీజ్ కానుంది. రియలిస్టిక్ లవ్ స్టోరీగా రూపొందుతున్న ఈ సినిమాకు దర్శకుడు సంపత్‌నంది (Sampath nandi) కథ,స్క్రీన్‌ప్లేను సమకూర్చారు. కేజీఎఫ్ ఫేమ్ వశిష్ట సింహా,హేభాపటేల్ నాయకానాయికలుగా నటించారు. చాలా రోజుల క్రితమే ఈ సినిమా షూటింగ్‌ను పూర్తిచేసుకున్నది.
థియేటర్లలో కాకుండా నేరుగా ఆహా ఓటీటీలో ఈ సినిమాను రిలీజ్ కానుంది. ఈ విషయాన్ని ఆహా సంస్థ సోమవారం ప్రకటించింది. వాస్తవ సంఘటనల ఆధారంగా తెరకెక్కిన ఈ చిత్రానికి అశోక్ తేజ దర్శకత్వం వహించారు.