తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Hanuman Vs Guntur Kaaram Collection: హనుమాన్ దూకుడు.. డల్లయిన గుంటూరు కారం

Hanuman vs Guntur Kaaram Collection: హనుమాన్ దూకుడు.. డల్లయిన గుంటూరు కారం

Hari Prasad S HT Telugu

23 January 2024, 10:30 IST

google News
    • Hanuman vs Guntur Kaaram Collection: సంక్రాంతి సినిమాలైన హనుమాన్, గుంటూరు కారం మధ్య వార్ 11వ రోజుకు వచ్చేసరికి వన్ సైడ్ అయింది. హనుమాన్ దూకుడు కొనసాగించగా.. గుంటూరు కారం ఘాటు పూర్తిగా తగ్గిపోయింది.
హనుమాన్, గుంటూరు కారం 11వ రోజు బాక్సాఫీస్ కలెక్షన్
హనుమాన్, గుంటూరు కారం 11వ రోజు బాక్సాఫీస్ కలెక్షన్

హనుమాన్, గుంటూరు కారం 11వ రోజు బాక్సాఫీస్ కలెక్షన్

Hanuman vs Guntur Kaaram Collection: సంక్రాంతి సినిమాల్లో హనుమాన్ స్పష్టమైన ఆధిపత్యం దిశగా దూసుకెళ్తోంది. గుంటూరు కారం మూవీతో పోలిస్తే 11వ రోజు అయిన సోమవారం (జనవరి 22) హనుమాన్ బాక్సాఫీస్ కలెక్షన్లు చాలా ఎక్కువగా ఉన్నాయి. 10 రోజుల్లోనే రూ.200 కోట్ల మార్క్ ను ఈ మూవీ అందుకోగా.. మహేష్ మూవీ మాత్రం ఇంకా ఆ ఫిగర్ ను చేరుకోలేకపోయింది.

ఫస్ట్ వీకెండ్ కంటే సెకండ్ వీకెండ్ ఎక్కువ కలెక్షన్లు రాబట్టిన హనుమాన్ మూవీ.. రెండో సోమవారం కూడా దూకుడు కొనసాగించింది. అయోధ్యలో రామ మందిర ప్రాణ ప్రతిష్ట వేళ థియేటర్లలో హనుమాన్ మ్యాజిక్ చేశాడు.

హనుమాన్ 11వ రోజు కలెక్షన్లు ఇలా..

తేజ సజ్జ నటించిన హనుమాన్ మూవీ 11వ రోజు దేశవ్యాప్తంగా రూ.7.5 కోట్లు వసూలు చేయడం విశేషం. కేవలం తెలుగులోనే రూ.5.25 కోట్లు వచ్చాయి. ఇక హిందీలో మరో రూ.2.25 కోట్లు రాబట్టింది. నిజానికి మూవీ రిలీజైన తర్వాత ఒక రోజు అతి తక్కువ వసూళ్లు ఇవే అయినా.. గుంటూరు కారంతో పోలిస్తే మాత్రం హనుమాన్ చాలా మంచి పొజిషన్ లో ఉందని చెప్పాలి.

గుంటూరు కారం మూవీకి 11వ రోజైన సోమవారం కేవలం రూ.1.35 కోట్లు మాత్రమే వచ్చాయి. హనుమాన్ పాన్ ఇండియా వసూళ్లు కాకపోయినా కేవలం తెలుగులో చూసుకున్నా కూడా గుంటూరు కారం కంటే మూడున్నర రెట్లు ఎక్కువ వసూళ్లు సాధించింది. ఇక దేశవ్యాప్తంగా చూసుకుంటే ఈ వసూళ్లు ఐదున్నర రెట్లు ఎక్కువగా ఉండటం విశేషం.

హనుమాన్ మూవీ 10వ రోజే ప్రపంచవ్యాప్తంగా రూ.200 కోట్ల మార్క్ అందుకున్నట్లు అధికారికంగా మేకర్స్ అనౌన్స్ చేసిన విషయం తెలిసిందే. మరోవైపు గుంటూరు కారం కలెక్షన్లు మాత్రం ట్రేడ్ అనలిస్ట్ మనోబాల విజయబాలన్ ప్రకారం.. 10 రోజుల్లో ఈ మూవీ రూ.194.98 కోట్లు వసూలు చేసింది. 11వ రోజు ఈ మూవీ కలెక్షన్లు మరీ దారుణంగా పడిపోయాయి.

11వ రోజు కలెక్షన్లను కూడా కలుపుకొని ఇప్పటి వరకూ దేశవ్యాప్తంగా గుంటూరు కారం కలెక్షన్లు రూ.119.1 కోట్లకు చేరాయి. సోమవారం తెలుగు రాష్ట్రాల్లో ఈ మూవీ ఆక్యుపెన్సీ రేషియో కూడా 18.49 శాతానికి పరిమితమైంది. మరోవైపు హనుమాన్ ఆక్యుపెన్సీ మాత్రం రూ.40.09 గా ఉండటం విశేషం. ఇక హిందీలోనూ హనుమాన్ ఆక్యుపెన్సీ 15.13 శాతంగా ఉంది.

రెండో సోమవారం గుంటూరు కారం కలెక్షన్లు చూస్తుంటే.. ఇక ఈ మూవీ క్రమంగా థియేటర్ల నుంచి వెళ్లిపోయే పరిస్థితి కనిపిస్తోంది. నిజానికి ఫిబ్రవరి 9 వరకూ నేరుగా తెలుగులో రిలీజయ్యే పెద్ద సినిమాలు ఏవీ లేవు. జనవరి 25న కెప్టెన్ మిల్లర్ మాత్రం వస్తోంది. ఇప్పటికే తమిళంలో రిలీజై మంచి టాక్ సంపాదించిన ఈ సినిమా తెలుగులో ఎంత వరకూ సక్సెస్ అవుతుందో చూడాలి.

తొలి రోజే ప్రపంచవ్యాప్తంగా సుమారు రూ.94 కోట్ల కలెక్షన్లతో దుమ్ము రేపిన గుంటూరు కారం తర్వాత వచ్చిన నెగటివ్ టాక్ తో కుదేలైపోయింది. క్రమంగా కలెక్షన్లు తగ్గుతూ వస్తున్నాయి.

హిందుస్తాన్ టైమ్స్ తెలుగు నుంచి ఎంటర్‌టైన్మెంట్, అలాగే ఓటీటీ తాజా అప్‌డేట్స్ పొందండి.
తదుపరి వ్యాసం