Guntur Kaaram Day 9 Collection: వీకెండ్‌లో కూడా గుంటూరు కారంకు తగ్గిన కలెక్షన్స్.. మహేశ్‌కు హిట్ కష్టమే?
Guntur Kaaram Box Office Collection Day 9: సూపర్ స్టార్ మహేశ్ బాబు లేటెస్ట్ మూవీ గుంటూరు కారం సినిమా 9వ రోజు అయిన శనివారం కూడా కాస్తా తగ్గినట్లుగా తెలుస్తోంది. మొత్తంగా గుంటూరు కారం 9 రోజుల్లో ఎన్ని కోట్లు కలెక్ట్ చేసిందనే లెక్కల్లోకి వెళితే..
Guntur Kaaram 9 Days Collection: మహేశ్ బాబు-తివిక్రమ్ కాంబినేషన్‌లో వచ్చిన గుంటూరు కారం సినిమాకు 9వ రోజు వీకెండ్ అయిన శనివారం నాడు తెలుగు రాష్ట్రాల్లో రూ. 1.69 కోట్ల షేర్, రూ. 3.10 కోట్ల గ్రాస్ వసూళ్లు వచ్చాయి అందులో నైజాం ఏరియా నుంచి రూ. 48 లక్షలు, సీడెడ్‌లో 14 లక్షలు, ఉత్తారంధ్రలో రూ. 37 లక్షలు, ఈస్ట్ గోదావరిలో రూ. 31 లక్షలు, వెస్ట్ గోదావరిలో రూ. 11 లక్షలు, గుంటూరులో రూ. 10 లక్షలు, కృష్ణాలో రూ. 9 లక్షలు, నెల్లూరులో రూ. 7 లక్షలు కలెక్షన్స్ వచ్చాయి. అంటే 8వ రోజు కంటే 9వ రోజు కలెక్షన్స్ తగ్గాయి.
తెలుగు రాష్ట్రాల్లో
గుంటూరు కారం మూవీకి 9 రోజుల్లో తెలుగు రాష్ట్రాల్లో రూ. 84.77 కోట్ల షేర్ కలెక్షన్స్ రాగా రూ. 129.90 కోట్ల గ్రాస్ కలెక్ట్ అయింది. వీటిలో నైజాం నుంచి రూ. 32.25 కోట్లు, సీడెడ్‌లో రూ. 9.19 కోట్లు, ఉత్తారంధ్రలో రూ. 11.43 కోట్లు, ఈస్ట్ గోదావరిలో రూ. 8.88 కోట్లు, వెస్ట్ గోదావరిలో రూ. 5.59 కోట్లు, గుంటూరులో రూ. 7.90 కోట్లు, కృష్ణాలో రూ. 6.09 కోట్లు, నెల్లూరులో రూ. 3.44 కోట్ల కలెక్షన్స్ సాధించింది. ఇక కర్ణాటక రెస్టాఫ్ ఇండియాలో రూ. 6.25 కోట్లు రాగా ఓవర్సీస్ నుంచి రూ. 14.45 కోట్ల వసూళ్లు గుంటూరు కారం మూవీకి వచ్చాయి.
ప్రపంచవ్యాప్తంగా
గుంటూరు కారం చిత్రానికి మొత్తంగా వరల్డ్ వైడ్‌గా తొమ్మిది రోజుల్లో రూ. 1.15 కోట్ల షేర్ కలెక్షన్స్, రూ. 172.40 కోట్లు గ్రాస్ వసూలు అయింది. అంటే ఇప్పటివరకు గుంటూరు కారం సినిమాకు 79 శాతం రికవరీ అయినట్లు సమాచారం. అయితే, సినిమాకు రూ. 225 కోట్ల గ్రాస్ వచ్చినట్లు మరికొన్ని వర్గాలు లెక్కలు చూపిస్తున్నాయి. ఇదిలా ఉంటే, ఈ గుంటూరు కారం మూవీకి రూ. 132 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ కాగా రూ. 133 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ నమోదు అయింది. అయితే 9 రోజుల కలెక్షన్స్ లెక్కలోకి తీసుకుంటే ఇంకా గుంటూరు కారం మూవీకి రూ. 26 కోట్లకుపైగా కలెక్షన్స్ రావాలి.
ప్లాప్‌గా మిగలాల్సిందేనా?
అయితే, గుంటూరు కారం సినిమాకు మిక్స్‌డ్ టాక్ ఉన్నప్పటికీ మహేశ్ మేనియాతో థియేటర్లలో మూవీ రన్ అవుతోంది. ఇప్పటికే గుంటూరు కారం కలెక్షన్స్‌ను హనుమాన్ మూవీ చీల్చుతుంది. దీంతో పాటు రిపబ్లిక్ డేకు మరిన్ని సినిమాలు విడుదల కానున్నాయి. ఈ నేపథ్యంలో గుంటూరు కారం సినిమాకు రూ. 26 కోట్లు ఎప్పుడు వస్తాయో అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఒకవేళ లాంగ్ రన్‌లో అన్ని కోట్లు రాకుంటే గుంటూరు కారం బాక్సాఫీస్ వద్ద ప్లాప్‌గా మిగిలిపోవాల్సి వస్తుంది.
భారీ స్థాయిలో
ఇదిలా ఉంటే గుంటూరు కారం చిత్రాన్ని హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్‌పై ఎస్. రాధాకృష్ణ (చినబాబు) ప్రతిష్టాత్మకంగా నిర్మించారు. గుంటూరు కారం సినిమాలో శ్రీలీల, మీనాక్షి చౌదరి హీరోయిన్లుగా నటించిన విషయం తెలిసిందే. ఈ చిత్రానికి ఎస్. థమన్ సంగీతం అందించగా.. భారీ అంచనాల నడుమ సంక్రాంతి కానుకగా జనవరి 12న గుంటూరు కారం మూవీ ప్రపంచవ్యాప్తంగా భారీస్థాయిలో విడుదల అయింది.