తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Hanuman: వెనక్కి తగ్గని హనుమాన్.. మహా అప్‍డేట్‍కు టైమ్ ఫిక్స్

HanuMan: వెనక్కి తగ్గని హనుమాన్.. మహా అప్‍డేట్‍కు టైమ్ ఫిక్స్

26 December 2023, 17:03 IST

google News
    • HanuMan Movie: హనుమాన్ సినిమా సంక్రాంతి రేసు నుంచి తప్పుకోవడం లేదని మూవీ యూనిట్ దాదాపు ఫిక్స్ చేసేసింది. ఓ కొత్త పోస్టర్‌తో సహా మహా మాస్ అప్‍డేట్ అంటూ టైమ్ కూడా ప్రకటించింది.
హనుమాన్ పోస్టర్
హనుమాన్ పోస్టర్

హనుమాన్ పోస్టర్

HanuMan Movie: ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో తేజ సజ్జా హీరోగా నటించిన హనుమాన్ (హను-మాన్) సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి. పాన్ వరల్డ్ రేంజ్‍లో ఈ చిత్రం రిలీజ్ కానుంది. సంక్రాంతి సందర్భంగా 2024 జనవరి 12వ తేదీన హనుమాన్‍ను రిలీజ్ చేయనున్నట్టు చాలా కాలం నుంచి మూవీ యూనిట్ చెబుతోంది. అయితే, పండగకు చాలా సినిమాలు పోటీలో ఉండటంతో హనుమాన్‍ను వాయిదా వేయాలని ఒత్తిడి వచ్చినట్టు తెలిసింది. అయితే, హనుమాన్‍ను అనుకున్న విధంగా జనవరి 12వ తేదీనే తీసుకురావాలని మూవీ యూనిట్ నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది.

సంక్రాంతి రేసు నుంచి తప్పుకోవాలనుకునే సినిమా నిర్మాతలు రెండు రోజుల్లోగా తమకు తెలుపాలని ప్రముఖ నిర్మాత, ఫిల్మ్స్ ఛాంబర్ అధ్యక్షుడు దిల్‍రాజు చెప్పారు. హనుమాన్ దర్శకుడు ప్రశాంత్ వర్మతోనూ మాట్లాడినట్టు తెలిపారు. అయితే, అనుకున్న సమయానికే హనుమాన్‍ను రిలీజ్ చేయాలని మూవీ నిర్ణయించుకుంది. జనవరి 12నే హనుమాన్ రిలీజ్ అంటూ నేడు (డిసెంబర్ 26) నేడు ఓ పోస్టర్ రిలీజ్ చేసింది. మరో భారీ అప్‍డేట్ తీసుకురానున్నట్టు వెల్లడించింది.

రేపు (డిసెంబర్ 27) ఉదయం 11 గంటల 7 నిమిషాలకు మహా మాస్ అప్‍డేట్ తీసుకురానున్నట్టు హనుమాన్ మేకర్స్ వెల్లడించారు. అయితే, ఈ భారీ అప్‍డేట్ ఏంటనేది వెల్లడించలేదు. ఈ నయా అప్‍డేట్ టైమ్‍ను దర్శకుడు ప్రశాంత్ వర్మ ట్వీట్ చేశారు. ఈ చిత్రంలో నటించిన ఓ ముఖ్యమైన యాక్టర్ లుక్‍ను రివీల్ చేయనున్నట్టు తెలుస్తోంది. ఎవరో ఊహించాలని కూడా ప్రశాంత్ ప్రశ్నించారు.

హనుమాన్ సినిమా తెలుగు, హిందీ, తమిళం, కన్నడ, మలయాళం, మరాఠీతో పాటు విదేశీ భాషలు ఇంగ్లిష్, స్పానిష్, కొరియన్, చైనీస్, జపనీస్‍లోనూ రిలీజ్ కానుంది. హిందీ సహా వివిధ భాషలకు సంబంధించి అగ్రిమెంట్లను కూడా మూవీ యూనిట్ చేసేసుకుంది. ఓటీటీ హక్కుల డీల్ కూడా జరిగినట్టు తెలుస్తోంది. అందుకే హనుమాన్ సినిమా రిలీజ్ వాయిదా కష్టమేనని దిల్‍రాజుకు కూడా మేకర్స్ చెప్పేసినట్టు సమాచారం.

హనుమాన్ చిత్రం తెలుగులో తొలి సూపర్ హీరోగా మూవీగా ఉంది. ఈ మూవీ టీజర్, ట్రైలర్ అత్యున్నత ప్రమాణాలతో అందరినీ అలరించింది. ట్రైలర్‌కు సూపర్ రెస్పాన్స్ వచ్చింది. బడ్జెట్ పరంగా చిన్నదే అయినా.. హనుమాన్‍పై అంచనాలు మాత్రం అత్యంత భారీగా ఉన్నాయి. హీరో తేజ సజ్జా.. దర్శకుడు ప్రశాంత్ వర్మ సహా యూనిట్ అంతా ఈ చిత్రంపై చాలా నమ్మకంతో ఉంది. అందుకే గుంటూరు కారం, ఈగల్, సైంధవ్, నా సామిరంగా సినిమాలు పోటీలో ఉన్నా.. సంక్రాంతికే తమ మూవీని రిలీజ్ చేసేందుకు హనుమాన్ మేకర్స్ కట్టుబడి ఉన్నారు.

హనుమాన్ చిత్రాన్ని ప్రైమ్ షో ఎంటర్‌టైన్‍మెంట్ పతాకంపై నిరంజన్ రెడ్డి నిర్మించారు. ఈ మూవీలో తేజ సరసన అమృత అయ్యర్ హీరోయిన్‍గా నటించారు. వరలక్ష్మి శరత్ కుమార్, వినయ్ రాయ్, రాజ్ దీపక్ శెట్టి, వెన్నెల కిశోర్, గెటప్ శీను కీలకపాత్రలు పోషించారు. హనుమంతుడి వల్ల అతీత శక్తులు పొందిన యువకుడి పాత్రను ఈ మూవీలో పోషించారు హీరో తేజ సజ్జా. అంజనాద్రి అనే ప్రాంతంలో ఈ సినిమా కథ జరుగుతుంది. ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్ (PVCU)లో తొలి చిత్రంగా హనుమాన్ వస్తోంది.

హిందుస్తాన్ టైమ్స్ తెలుగు నుంచి ఎంటర్‌టైన్మెంట్, అలాగే ఓటీటీ తాజా అప్‌డేట్స్ పొందండి.
తదుపరి వ్యాసం