Teja Sajja: మహేశ్ బాబుతో పోటీ.. అదిరిపోయే రిప్లే ఇచ్చిన హనుమాన్ హీరో తేజ సజ్జా
02 January 2024, 14:19 IST
- Teja Sajja - HanuMan Movie: సూపర్ స్టార్ మహేశ్ బాబుకు హనుమాన్ సినిమాతో పోటీకి వస్తున్నారని వచ్చిన ఓ కామెంట్‍కు హనుమాన్ హీరో తేజ సజ్జా స్పందించారు. మహేశ్ ఫ్యాన్స్ మెచ్చేలా రిప్లే ఇచ్చారు.
Teja Sajja: మహేశ్ బాబుతో పోటీ.. అదిరిపోయే రిప్లే ఇచ్చిన హనుమాన్ హీరో తేజ సజ్జా
Teja Sajja - HanuMan Movie: ఈసారి సంక్రాంతికి ఐదు తెలుగు సినిమాలు పోటీలో ఉన్నాయి. అయితే, సూపర్ స్టార్ మహేశ్ బాబు హీరోగా నటించిన గుంటూరు కారం, యంగ్ స్టార్ తేజ సజ్జా చేసిన సూపర్ హీరో మూవీ ‘హనుమాన్’పై ప్రత్యేక దృష్టి ఉంది. ఈ రెండు చిత్రాలు జనవరి 12వ తేదీన థియేటర్లలో రిలీజ్ కానున్నాయి. అందులోనూ రెండు సినిమాలపై అంచనాలు భారీ స్థాయిలో ఉన్నాయి. బడ్జెట్ పరంగా హనుమాన్ చిన్న చిత్రమే అయినా ట్రైలర్, టీజర్ సహా ప్రమోషన్ల హడావుడితో ఫుల్ క్రేజ్ దక్కించుకుంది. దీంతో, సూపర్ స్టార్ మహేశ్ బాబుతో తేజ సజ్జా పోటీ గురించి సోషల్ మీడియాలోనూ చర్చ జరుగుతోంది.
బాలనటుడిగా ఒకప్పుడు చాలా చిత్రాలు చేశారు తేజ సజ్జా. 2000లో వచ్చిన యువరాజు చిత్రంలో మహేశ్ బాబుకు కొడుకు పాత్రలో అతడు నటించారు. అయితే, ఇప్పుడు 2024లో మహేశ్ నటించిన గుంటూరు కారం చిత్రానికే హనుమాన్‍తో తేజ పోటీగా వస్తున్నారని సోషల్ మీడియాలో కామెంట్లు వస్తున్నాయి. అయితే, ఇలాంటి ఓ కామెంట్‍కు తేజ సజ్జా స్పందించారు. మహేశ్‍తో పోటీ ఏంటని, ఆయనతో పాటుగా వస్తున్నామంటూ తేజ సజ్జా రిప్లే ఇచ్చారు.
“సూపర్ స్టార్.. పోటీ ఏంటి సర్. ఆయనతో పోటీగా కాదు.. ఆయనతో పాటు” అని తేజ సజ్జా రాసుకొచ్చారు. అంటే, మహేశ్‍తో పోటీ పడుతున్నామని తప్పుగా అనుకోవద్దనేలా తలకొట్టుకునే, నమస్కారం ఎమోజీలను తేజ ఉంచారు. దీంతో.. పోటీ మాట తీసుకురావద్దనేలా సూచించారు.
సూపర్ స్టార్‌తో పోటీ ఏంటంటూ మొత్తంగా మహేశ్ బాబు ఫ్యాన్స్ మనసులను తేజ సజ్జా గెలుచుకున్నారు. తేజను మెచ్చుకుంటూ కొందరు అభిమానులు కామెంట్లు చేస్తున్నారు. చాలా పరిణతితో తేజ ఉన్నారని ప్రశంసిస్తున్నారు.
ఇతర భాషల్లో ముందు చేసుకున్న ఒప్పందాల కారణంగానే ఎంత పోటీ ఉన్నా హనుమాన్ వాయిదా వేయలేకపోతున్నామని, జనవరి 12నే తప్పక రిలీజ్ చేస్తామని మేకర్స్ ఇప్పటికే క్లారిటీ ఇచ్చారు. ఎందుకు వాయిదా వేయలేకపోతున్నామో డైరెక్టర్ ప్రశాంత్ వర్మ కూడా ఇటీవల ఇంటర్వ్యూల్లో చెప్పుకొచ్చారు. తెలుగుతో పాటు హిందీ, తమిళం, కన్నడ, మలయాళం, మరాఠీ, ఇంగ్లిష్, స్పానిష్, కొరియన్, చైనీస్, జపనీస్ భాషల్లో పాన్ వరల్డ్ రేంజ్‍లో హనుమాన్‍ను రిలీజ్ చేసేందుకు మేకర్స్ నిర్ణయించుకున్నారు.
హనుమాన్ సినిమాపై దర్శకుడు ప్రశాంత్ వర్మ కూడా చాలా నమ్మకంతో ఉన్నారు. ముందుగా థియేటర్లు ఎక్కువగా దొరకకపోయినా తమ చిత్రం చాలా రోజులు ఆడుతుందని, లాంగ్ రన్ ఉంటుందని చెబుతున్నారు. ట్రైలర్ వచ్చిన తర్వాత ఈ చిత్రంపై అంచనాలు కూడా అదే రేంజ్‍లో పెరిగాయి.
సంక్రాంతి సందర్భంగా జనవరి 13న ఈగల్, సైంధవ్, 14వ తేదీన నా సామిరంగ చిత్రాలు కూడా రిలీజ్ కానున్నాయి.