HanuMan Runtime: హనుమాన్ సినిమా రన్ టైమ్ ఇదే! సెన్సార్ పూర్తి
HanuMan Runtime - Censor: హనుమాన్ సినిమా సెన్సార్ పనులు పూర్తయ్యాయి. దీంతో ఈ సూపర్ హీరో మూవీ రన్ టైమ్ వివరాలు కూడా బయటికి వచ్చాయి.
HanuMan Runtime - Censor: హనుమాన్ (హను-మాన్) చిత్రం కోసం సినీ ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. తెలుగులో ఫస్ట్ సూపర్ హీరో సినిమాగా వస్తున్న ఈ చిత్రంలో తేజ సజ్జా హీరోగా నటిస్తున్నారు. టీజర్, పాటలు, ట్రైలర్.. ఇలా అన్నీ ఈ మూవీపై అంచనాలను భారీ స్థాయికి తీసుకెళ్లాయి. బడ్జెట్ పరంగా చిన్న చిత్రమే అయినా.. పెద్ద సినిమాలా క్రేజ్ ఉంది. టాలెంటెడ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ దర్శకత్వం వహించిన హనుమాన్ సినిమా 2024 జనవరి 12న రిలీజ్ కానుంది. తాజాగా ఈ మూవీ సెన్సార్ పనులు పూర్తయ్యాయి.
హనుమాన్ సినిమాకు యూ/ఏ సర్టిఫికేట్ ఇచ్చింది సెన్సార్ బోర్డు. సెన్సార్ రేటింగ్‍కు సంబంధించిన విషయాన్ని ప్రైమ్‍షో ఎంటర్‌టైన్‍మెంట్ బ్యానర్ అధికారికంగా వెల్లడించింది. యూ/ఏ రేటింగ్‍తో కొత్త పోస్ట్ కూడా రిలీజ్ చేసింది. చిరుత బారి నుంచి జింకను కాపాడి ఎత్తుకొని తేజ సజ్జా పరుగెత్తుతున్నట్టు ఈ పోస్టర్ ఉంది.
రన్ టైమ్ ఇదే!
హనుమాన్ సినిమా సెన్సార్ పూర్తవటంతో రన్‍టైమ్ (నిడివి) వివరాలు కూడా బయటికి వచ్చాయి. ఈ మూవీ 2 గంటల 38 నిమిషాల రన్‍టైమ్‍తో ఉంటుందని సమాచారం వెల్లడైంది.
హనుమాన్ చిత్రంలో తేజ సజ్జా సరసన అమృత అయ్యర్ హీరోయిన్‍గా చేయగా.. వరలక్ష్మి శరత్ కుమార్, వినయ్ రాయ్, రాజ్ దీపక్ శెట్టి, సముద్రఖని, వెన్నెల కిశోర్ కీలకపాత్రలు పోషించారు. ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్ (PVCU)లో తొలి మూవీగా హనుమాన్ వస్తోంది. ఈ PVCUలో మొత్తంగా 12 సినిమాలు ఉంటాయని తాజాగా ఓ ఇంటర్వ్యూలో దర్శకుడు ప్రశాంత్ వర్మ వెల్లడించారు.
హనుమంతుడి వల్ల అతీత శక్తులు పొందే యువకుడి పాత్రను హనుమాన్ చిత్రంలో పోషించారు తేజ సజ్జా. సంక్రాంతి సందర్భంగా 2024 జనవరి 12వ తేదీన ఈ మూవీ రిలీజ్ కానుంది. తెలుగుతో పాటు హిందీ, తమిళం, కన్నడ, మలయాళం, మరాఠీ, ఇంగ్లిష్, స్పానిష్, కొరియన్, జపనీస్, చైనీస్‍లోనూ ఈ మూవీ రిలీజ్ కానుంది. హనుమాన్ సినిమా పాన్ వరల్డ్ రేంజ్‍లో విడుదల అవుతోంది.
ప్రైమ్‍షో ఎంటర్‌టైన్‍మెంట్ పతాకంపై కే నిరంజన్ రెడ్డి.. హనుమాన్ మూవీని నిర్మించారు. అనుదీప్ దేవ్, హరి గౌడ, కృష్ణ సౌరభ్ సంగీతం అందించారు.