Guppedantha Manasu Today Episode: రిషి, వసుధారల సంతోషాన్ని చెడగొట్టడానికి దేవయాని కొత్త ప్లాన్?
21 March 2023, 14:05 IST
Guppedantha Manasu Today Episode: రిషి, వసుధారలను విడగొట్టడానికి దేవయాని కొత్త ప్లాన్ వేస్తుంది. సంతోషంగా డిన్నర్ చేసిన వారిని మాటలతో ఇబ్బంది పెడుతుంది. గుప్పెడంత మనసు సీరియల్‌లో నేటి ఎపిసోడ్‌లో ఏం జరిగిందంటే...
గుప్పెడంత మనసు
Guppedantha Manasu Today Episode: రిషి, వసుధారలను విడగొట్టేందుకు కొత్త ప్లాన్‌తో దేవయాని సిద్ధమైంది. పెళ్లి తర్వాత జరిగే ఆచారాలు, సంప్రదాయాలు అంటూ రిషికి ఇష్టంలేని టాపిక్ తీసుకొచ్చి అర్ధాకలితోనే అతడు భోజనం ముందు నుంచి లేచేలా చేసింది. తన మాటలతో రిషితో పాటు జగతీ, మహేంద్రలను నొప్పించిన దేవయాని తృప్తిగా ఫీలయ్యింది.
జగతీ, మహేంద్రలతో పాటు రిషి, వసుధార, దేవయాని, ఫణీంద్ర భోజనం చేస్తోండగా వారికి ధరణి వడ్డిస్తూ నేటి ఎపిసోడ్ లో కనిపించింది. దేవయానీ పట్ల ఉన్న భయంతో కంగారుగానే అందరికి భోజనం వడ్డిస్తుంటుంది ధరణి.
ఆమె భయాన్ని గమనించిన దేవయానీ....వసుధార ఎంతో పద్దతితో ఉంటే నువ్వు మాత్రం కొత్త కోడలిగా సిగ్గుపడుతోన్నావు అంటూ పనిలో పనిగా ధరణితో పాటు వసుధారపై సెటైర్ వేస్తుంది దేవయాని. స్టూడెంట్‌గా వచ్చి తమ కుటుంబంలో ఓ మెంబర్‌గా అయిపోయాడు అంటూ లోపల కోపం ఉన్నా పైకి మాత్రం నవ్వుతూనే వసుధారపై తనకున్న అక్కసును వెళ్లగక్కుతుంది దేవయాని.
పెళ్లి తర్వాత జరిగే తంతు గురించి దేవయాని టాపిక్ తీసుకురావడంతో రిషి అసహనంగా ఫీలయ్యాడు. అవన్నీ ఎప్పుడు ఎందుకని రిషి చెప్పినా కూడా జగతి, మహేంద్ర పట్టించుకోరు.నేను చూసుకోవాలి అంటూ అతడి మాటలకు అడ్డుచెబుతుంది. మీ అమ్మనాన్నలకు రమ్మని చెప్పు అంటూ వసుధారతో దేవయాని అనడంతో జగతి ఇబ్బందిపడింది.
వసుధార, జగతి వద్దని వారిస్తున్నా దేవయానీ ఈ టాపిక్ కంటిన్యూ చేయడంతో రిషి అర్ధాకలితోనే భోజనం పూర్తయిందని లేచి వెళ్లిపోయాడు. రిషి హర్ట్ కావడంతో డిన్నర్ పూర్తికాకుండానే వసుధార కూడా డైనింగ్ టేబుల్ దగ్గర నుంచి వెళ్లిపోతుంది.
మిడ్‌నైట్‌లో వసుధారతో మాట్లడటానికి వసుధార రూమ్ దగ్గరకు వస్తాడు రిషి. నిద్రలో ఉన్న వసుధార ఒక్కసారిగా మేల్కొంటుంది. రుషి డోర్ కొట్టడానికే ముందే తెలుపు తెరుస్తుంది. తమ మనసులో ఉన్న సంఘర్షణను గురించి ఒకరితో మకొరు పంచుకోవడం నేటి ఎపిసోడ్‌లో హైలైట్‌గా నిలిచింది.