Guppedantha Manasu Rishi: హీరోగా ఎంట్రీ ఇస్తున్న గుప్పెడంత మనసు ‘రిషి’.. మూవీ ఫస్ట్ లుక్ లాంచ్
10 November 2023, 18:38 IST
- Guppedantha Manasu Rishi: గుప్పెడంత మనసు సీరియల్‍లో రిషిగా ప్రధాన పాత్ర పోషిస్తున్న ముకేశ్ గౌడ.. హీరోగా సినిమాల్లోకి ఎంట్రీ ఇస్తున్నారు. ‘గీతా శంకరం’ చిత్రంలో హీరోగా ఆయన నటిస్తున్నారు. వివరాలివే..
Guppedantha Manasu Rishi: హీరోగా ఎంట్రీ ఇస్తున్న గుప్పెడంత మనసు ‘రిషి’.. మూవీ ఫస్ట్ లుక్ లాంచ్
Guppedantha Manasu Rishi: గుప్పెండంత మనసు సీరియల్‍లో రిషి (రిశేంద్ర భూషణ్) పాత్ర ద్వారా ముకేశ్ గౌడ చాలా ఫేమస్ అయ్యారు. ఆ సిరీయల్‍లో మెయిన్ క్యారెక్టర్ చేస్తున్న ముకేశ్.. ఇప్పుడు సినిమాల్లోకి ఎంట్రీ ఇస్తున్నారు. ఆయన హీరోగా ‘గీతా శంకరం’ మూవీ రూపొందుతోంది. ఈ చిత్రంలో ముకేశ్ సరసన హీరోయిన్‍గా ప్రియాంక శర్మ నటిస్తున్నారు. తాజాగా ఈ గీతా శంకరం సినిమా ఫస్ట్ లుక్‍ను మూవీ టీమ్ ఆవిష్కరించింది.
దీపావళి సందర్భంగా గీతా శంకరం చిత్రం ఫస్ట్ లుక్‍ను మూవీ యూనిట్ లాంచ్ చేసింది. ఎస్‍ఎస్ఎంజీ ప్రొడక్షన్స్ కార్యాలయంలో ఈ ఫస్ట్ లుక్ ఆవిష్కణ కార్యక్రమం నేడు జరిగింది. హీరో ముకేశ్, హీరోయిన్ ప్రియాంక, నటుడు మురళీధర్ సహా కొందరు ఈ మూవీ యూనిట్ సభ్యులు ఈ ఫస్ట్ లుక్ లాంచ్ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ చిత్రంతోనే దర్శకుడిగా పరిచయం అవుతున్నారు రుద్ర. ఎస్ఎస్‍ఎంజీ పతాకంపై గీతా శంకరం సినిమాను నిర్మిస్తున్నారు దేవానంద్.
గీతా శంకరం సినిమా ఫస్ట్ లుక్‍లో హీరోహీరోయిన్లు ఇద్దరూ బుల్లెట్ బైక్‍పై వెళుతున్న ఫొటో ఉంది. బ్యాక్‍గ్రౌండ్ చూస్తుంటే ఈ సినిమా గ్రామీణ నేపథ్యంలో తెరకెక్కుతున్నట్టు అర్థమవుతోంది.
గీతా శంకరం సినిమా ప్రస్తుతం షూటింగ్ దశలో ఉంది. నవంబర్ 14వ తేదీ నుంచి మరో షెడ్యూల్ ప్రారంభం అవుతుందని నిర్మాత దేవానంద్ తెలిపారు. అందరినీ ఆకట్టుకునే కథాంశంతో ఈ సినిమా వస్తుంది తెలిపారు.
సీరియళ్ల ద్వారా ఎంత మంచి పేరు తెచ్చుకున్నానో.. సినిమాల్లోనూ అంతే విజయవంతం అవుతానని ముకేశ్ గౌడ చెప్పారు. గీతా శంకరం సినిమా యూత్‍ను బాగా అలరిస్తుందని చెప్పారు. లవ్, ఎఫెక్షన్‍తో కూడుతున్న చిత్రమిదని తెలిపారు.
గీతా శంకరం మూవీకి రుద్ర దర్శకత్వం వహిస్తుండగా.. 'అబు' సంగీతం అందిస్తున్నారు. ఉదయ్ ఆకుల సినిమాటోగ్రాఫర్‌గా వ్యవహిస్తున్న ఈ చిత్రానికి.. మారుతీరావు ఎడిటర్‌గా ఉన్నారు.