Guppedantha Manasu November 10th Episode: వసుధారకు రిషి స్పెషల్ గిఫ్ట్ - జీవితాంతం తోడుగా ఉంటానని ప్రామిస్
10 November 2023, 10:10 IST
Guppedantha Manasu November 10th Episode: నీ ప్రేమ కోసం వసుధార ఎన్నో అవమానాలను భరించిందని రిషితో అంటాడు మహేంద్ర. వసుధార ప్రాణం నువ్వేనని, ఎన్ని కష్టాలు వచ్చినా ఆమె చేయిని వదలొద్దని కొడుకుకు సలహా ఇస్తాడు మహేంద్ర. ఆ తర్వాత నేటి గుప్పెడంత మనసు సీరియల్‌లో ఏం జరిగిందంటే?
గుప్పెడంత మనసు సీరియల్
Guppedantha Manasu November 10th Episode: రిషి, వసుధార తనకు చెప్పకుండా పెళ్లి చేసుకోవడంతో ఏంజెల్ బాధపడుతుంది. తమ గతంతో పాటు ప్రేమకథ గురించి రిషి నిజాలు చెప్పిన కూడా ఏంజెల్ అతడి మాటలను నమ్మదు. కట్టు కథ అని తేల్చేస్తుంది. వసుధార కూడా తనను మోసం చేసిందని ఫైర్ అవుతుంది. విశ్వనాథం ఆమెకు సర్ధిచెబుతాడు.
రిషి షాక్...
జగతి చనిపోయిన విషయాన్ని ఏంజెల్ దగ్గర దాచిపెడతాడు రిషి. ఆ ఒక్క విషయం రిషి ఎందుకు దాచిపెట్టాడా అని వసుధార ఆలోచిస్తుంటుంది. అది రిషి కనిపెడతాడు. అమ్మ తన ప్రాణాలను అడ్డుపెట్టి నన్ను కాపాడిందనే విషయాన్ని ఏంజెల్ కట్టుకథ అని అంటే...ఆ మాట విని తన గుండె ముక్కలయ్యేదని రిషి బాధపడతాడు.
అమ్మ చనిపోయిన విషయం ఎవరికి చెప్పడం తనకు ఇష్టం లేదని రిషి అంటాడు. నా ప్రాణం ఉన్నంత వరకు అమ్మ నాతోనే నా గుండెల్లోనే ఉంటుందని అంటాడు. వసుధారతో మాట్లాడుతూ రిషి కార్ డ్రైవ్ చేస్తోండగా వారికి కారుకు హెల్మెట్ ధరించిన ఓ వ్యక్తి తన బైక్‌తో అడ్డుగా వస్తాడు. అతడిని చూసి షాకైన రిషి ఒక్కసారిగా కారు ఆపేస్తాడు.
జగతి లెటర్స్...
శైలేంద్ర కుట్రలను వివరిస్తూ జగతి బతికున్న టైమ్‌లో రాసిన లెటర్స్‌ను విష్ కాలేజీలోనే ఉండిపోతాయి. ఆ లెటర్స్‌ను రిషికి అందజేయమని పాండ్యన్‌కు చెబుతాడు కాలేజీ ప్రిన్సిపాల్. ఆ లెటర్స్‌ను ఇవ్వడానికే పాండ్యన్ రిషి కారుకు అడ్డంగా నిలబడతాడు. పాండ్యన్ ఇచ్చిన లెటర్స్ చూసి రిషి షాకవుతాడు. వాటిని ఎవరు తనకు రాశారా అని ఆలోచిస్తుంటాడు. జర్నీ బిజీలో ఉండటంలో ఆ లెటర్స్ కారులోనే పెట్టేస్తాడు.
జగతి ప్రేమలో...
రిషి ఇంటికి రాగానే మహేంద్ర సోఫోలోనే నిద్రపోయి కనిపిస్తాడు. తండ్రి తాగాడు అనుకొని రిషి కంగారు పడతాడు. తాగనని నీకు మాటిచ్చానని, ఆ మాటకే కట్టుబడి ఉన్నానని కొడుకుతో అంటాడు మహేంద్ర. జగతిని తాను ఎంతగా ప్రేమించింది రిషితో చెబుతాడు మహేంద్ర. ఎన్నో అడ్డంకులను దాటుకొని జగతిని తాను పెళ్లి చేసుకున్నానని, కానీ విధి ఆడిన నాటకంలో తన ఆనందం కనుమరుగైపోయిందని బాధపడతాడు.
ఎలాంటి అపార్థాలు లేకుండానే జగతిని ఇరవై ఏళ్లు దూరమయ్యానని, ఆ టైమ్‌లో కన్నీళ్లను దిగమింగుకుంటూ బతికానని మహేంద్ర ఎమోషనల్ అవుతాడు. భార్యను దూరం పెట్టి నరకం అనుభవించానని రిషితో చెబుతాడు మహేంద్ర.
రిషిధారల బంధం...
నీ జీవితం నా లైఫ్‌లా కష్టాల మయం కాకూడదని కొడుకుకు సలహా ఇస్తాడు మహేంద్ర. రిషిధారల బంధం మీ మధ్య ఏర్పడిన రోజే నిన్నే భర్తగా వసుధార ఫిక్సయిపోయిందని మహేంద్ర చెబుతాడు. నువ్వే తాళి కట్టినట్లు ఊహించుకొని తన మెడలో తాళి వేసుకుందని అంటాడు.
నీ ప్రేమ కోసం వసుధార తండ్రిని కూడా ఎదురించిందని రిషికి వివరిస్తాడు మహేంద్ర. వసుధారను తాను ఎంత బాధపెట్టినా భరించింది తప్ప తన కష్టం ఏమిటన్నది ఈ రోజు చెప్పుకోలేదని వసుధార గురించి రిషి అంటాడు. నీ ప్రాణం కాపాడటం కోసమే తన మనసును చంపుకొని వసుధార అబద్ధపు సాక్ష్యం చెప్పిందని రిషితో అంటాడు మహేంద్ర.
అందరికి దూరంగా వెళ్లిపోయినా నువ్వు మీ ప్రేమ గొప్పతదనం, వసుధార మంచితనం వల్ల మళ్లీ ఆమెకు కనిపించావని మహేంద్ర అంటాడు. నువ్వు ఎంతలా అవమానించినా, తిట్టినా వసుధార నీకు మాత్రం దూరంగా వెళ్లలేదని వసుధార మంచితనం గురించి రిషికి వివరిస్తాడు మహేంద్ర.
వసుధార దొరకడం అదృష్టం...
వసుధార ప్రాణం నువ్వే అని చెబుతాడు. అని చెబుతాడు. నాకు జగతి దొరకడం ఎంత అదృష్టమో నీకు వసుధార దొరకడం అంతకంటే ఎక్కువ అదృష్టం అని రిషికి చెబుతాడు మహేంద్ర. ఎన్ని కష్టాలు ఎదురైన వసుధార చేయి వదలొద్దని తనకు మాటివ్వమని కొడుకును అడుగుతాడు. .
వసుధార మనసును ఇకపై నొప్పించవద్దని చెబుతాడు. వసుధార విషయంలో పొరపాటుగా ఆలోచించవద్దని సలహా ఇస్తాడు. ఇకపై అలా జరగదని, వసుధార సంతోషంగా చూసుకుంటానని తండ్రికి మాటిస్తాడు రిషి.
వసు ఎమోషనల్...
రిషి, మహేంద్ర మాటలను చాటు నుంచి వసుధార వింటుంది. మహేంద్ర మంచితనం చూసి ఎమోషనల్ అవుతుంది. కన్నీళ్లు పెట్టుకుంటుంది. అక్కడ ఉండలేక కిచెన్‌లోకి వస్తుంది. రిషి వెనుకనుంచి వచ్చి వసుధార కళ్లు మూస్తాడు. కానీ చేతులకు తడి తగలడంతో షాక్ అవుతాడు. కన్నీళ్లకు కారణం ఏమిటని అడుగుతాడు. కళ్లలో ఏదో పడిందని అబద్ధమాడుతుంది వసుధార.
రిషి గిఫ్ట్...
వసుధార కోసం జుమ్కాలు గిఫ్ట్‌గా తీసుకొస్తాడు రిషి. భర్త ఇచ్చిన బహుమతి చూసి వసుధార సంతోషంగా ఫీలవుతుంది. చాలా బాగున్నాయంటూ ఆనందపడుతుంది. రిషి కూడా హ్యాపీగా కనిపిస్తాడు. మీరు ఎప్పుడూ ఇలాగే చిరునవ్వుతో ఉండాలని వసుధార అంటుంది. డాడ్ మామూలు మనిషి కావాలి. మనల్ని నరకం లోకి నెట్టేసిన శత్రువు ఎవరో తెలిసిన తర్వాతే తనకు మనశ్శాంతి లభిస్తుందని రిషి అంటాడు.
రిషి నాటకం…
ఆ తర్వాత తాను కొన్న జుమ్కాలను వసుధార చెవులకుపెట్టాలని ప్రయత్నిస్తాడు రిషి. కానీ జుమ్కాలు పెట్టడం రాక ఓ జుమ్కా కిందపడిపోతుంది. ఆ జుమ్కా రిషికి దొరుకుతుంది. కానీ దొరకలేదని చెప్పి వసుధారను ఆటపట్టించాలని ఫిక్స్ అవుతాడు. ఎంతో ప్రేమగా నీకోసం కొన్న జుమ్కా కనపడటం లేదని బాధపడుతోన్నట్లుగా నాటకం ఆడుతాడు. రిషి బాధ చూసి వసుధార కంగారు పడుతుంది.