తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Guppedantha Manasu January 30th Episode: సాక్ష్యాలు మిస్ - మ‌ళ్లీ త‌ప్పించుకున్న శైలేంద్ర - వ‌సుధార‌పై ఫ‌ణీంద్ర ఫైర్‌

Guppedantha Manasu January 30th Episode: సాక్ష్యాలు మిస్ - మ‌ళ్లీ త‌ప్పించుకున్న శైలేంద్ర - వ‌సుధార‌పై ఫ‌ణీంద్ర ఫైర్‌

30 January 2024, 7:15 IST

google News
  • Guppedantha Manasu January 30th Episode: శైలేంద్ర చేసిన దుర్మార్గులు, కుట్ర‌ల‌ను ఆధారాల‌తో ఫ‌ణీంద్ర ముందు బ‌య‌ట‌పెట్టాల‌ని అనుకుంటుంది వ‌సుధార‌. కానీ ఆమెఫోన్‌లోని సాక్ష్యాలు మిస్స‌వుతాయి. ఆ త‌ర్వాత నేటి గుప్పెడంత మ‌న‌సు సీరియ‌ల్‌లో ఏం జ‌రిగిందంటే?

గుప్పెడంత మ‌న‌సు సీరియ‌ల్‌
గుప్పెడంత మ‌న‌సు సీరియ‌ల్‌

గుప్పెడంత మ‌న‌సు సీరియ‌ల్‌

Guppedantha Manasu January 30th Episode: కాలేజీ ఫెస్ట్‌కు రావాల్సిన రిషి క‌నిపించ‌కుండా పోవ‌డంతో వ‌సుధార ఆవేశం క‌ట్ట‌లు తెంచుకుంటుంది. శైలేంద్రనే ఈ ప‌ని చేసి ఉంటాడ‌ని అనుకొని అత‌డి చెంపలు వాయిస్తుంది. ఫ‌ణీంద్ర ఆమెను ఆపుతాడు. శైలేంద్ర‌పై విరుచుకుప‌డితే రిషి తిరిగివ‌స్తాడా? అని వ‌సుధారను ప్ర‌శ్నిస్తాడు.

శైలేంద్ర దుర్మార్గుడ‌ని, ప‌ర‌మ‌నీచుడు అని, వీడే రిషిని ఏదో చేశాడ‌ని వ‌సుధార ఆవేశంగా అన్ని నిజాల‌ను బ‌య‌ట‌పెట్టేస్తుంది. ఇలాంటి రాక్ష‌సుడు మీ క‌డుపున పుట్టినందుకు మీరు బాధ‌ప‌డ‌తార‌ని ఇన్నాళ్లు తాను, మ‌హేంద్ర శైలేంద్ర చేసిన కుట్ర‌ల‌ను దాచిపెట్టామ‌ని ఫ‌ణీంద్ర‌తో అంటుంది వ‌సుధార‌.

జ‌గ‌తిని చంపింది శైలేంద్ర‌నే...

జ‌గ‌తిని భ‌య‌పెట్టి రిషి ఇళ్లు వ‌దిలిపెట్టి వెళ్లిపోయేలా చేసింది శైలేంద్ర‌నే...చివ‌ర‌కు ఎండీ సీట్‌కు అడ్డుగా ఉంద‌ని జ‌గ‌తిని చంపింది కూడా ఈ దుర్మార్గుడే అని శైలేంద్ర చేసిన కుట్ర‌ల‌ను మొత్తం బ‌య‌ట‌పెట్టేస్తుంది. జ‌గ‌తి చ‌నిపోయిన త‌ర్వాత కూడా ఎండీ ప‌ద‌వి త‌మ‌కు ద‌క్క‌క‌పోవ‌డంతో త‌న‌ను, రిషిని ప‌గ ప‌ట్టి శైలేంద్ర వెంటాడుతున్నాడ‌ని వ‌సుధార ఫైర్ అవుతుంది. త‌న కొడుకు అలాంటి వాడు కాదంటూ శైలేంద్ర‌కు స‌పోర్ట్ చేస్తుంది ధ‌ర‌ణి. కానీ ఫ‌ణీంద్ర ఆమెను ఆపుతాడు. వ‌సుధారను మాట్లాడ‌నివ్వు అంటూ ఫైర్ అవుతాడు.

ధ‌ర‌ణినే సాక్ష్యం...

శైలేంద్ర‌కు ఎంతో రౌడీల‌తో ప‌రిచ‌యం ఉంద‌ని, వాళ్ల‌కు డ‌బ్బులు ఇచ్చి ఎన్నో దారుణాలు దుర్మార్గాలు చేశాడ‌ని అంటుంది. వాట‌న్నింటికి ధ‌ర‌ణినే సాక్ష్యం అని వ‌సుధార అంటుంది. నిజం చెప్ప‌కుండానే క‌ళ్ల‌తోనే ధ‌ర‌ణిని భ‌య‌పెడ‌తాడు శైలేంద్ర‌. కానీ అత‌డి బెదిరింపుల‌కు భ‌య‌కుండా వ‌సుధార చెప్పింది నిజ‌మేన‌ని ధ‌ర‌ణి అంటుంది. దాంతో శైలేంద్ర మ‌ళ్లీ కొత్త గేమ్ మొద‌లుపెడ‌తాడు.

తాను డ‌బ్బులు ఇచ్చిన వాళ్లు రౌడీలు కాద‌ని ప్లేట్ ఫిరాయిస్తాడు. వాళ్ల పేరు ఊరు తెలుసా... డెలివ‌రిబాయ్‌, ఫ్లంబ‌ర్‌ల‌ను చూసి మీరు రౌడీలు అంటూ పొర‌ప‌డితే ఎలా ధ‌ర‌ణిపై కోప్ప‌డుతాడు. నువ్వు మాట‌లు మార్చ‌డం, మ‌నుషుల్ని మ్యానేజ్ చేయ‌డంలో దిట్ట అని నాకు తెలుసు అని వ‌సుధార ఫైర్ అవుతుంది.

ఆధారాలు కావాలి...

నువ్వు రిషిని కిడ్నాప్ చేస్తే క‌ష్ట‌ప‌డి కాపాడి ఇంటికి తీసుకొచ్చాన‌ని, కానీ ఇప్పుడు రిషి మ‌ళ్లీ క‌నిపించ‌కుండాపోయాడ‌ని వ‌సుధార ఫైర్ అవుతుంది. ఏంటి రిషిని కాపాడుకున్నావా...రిషి మీకు దొరికిడా అంటూ వ‌సుధార‌లోని త‌ప్పుల్ని వెతికే ప్ర‌య‌త్నం చేస్తాడు శైలేంద్ర‌. రిషి ఎక్క‌డున్నాడో తెలిసి మా ద‌గ్గ‌ర ఇన్నాళ్లు ఎందుకు దాచిపెట్టార‌ని వ‌సుధార‌ను నిల‌దీస్తాడు శైలేంద్ర‌.

వాళ్లే రిషిని ఏదో చేసి త‌ప్పును నా మీద నెడుతున్నార‌ని తండ్రి ఫ‌ణీంద్ర ద‌గ్గ‌ర మంచివాడిగా న‌టించే ప్ర‌య‌త్నం చేస్తాడు శైలేంద్ర‌. ఊరికే మ‌నుషుల మీద నింద‌లు వేయ‌డం కాదు. ఆధారాలు కావాల‌ని శైలేంద్ర అంటాడు. నా కొడుకు త‌ప్పు చేశాడ‌ని నిరూపిస్తే ఇక్క‌డే ఉరి వేసుకొని చ‌నిపోతా అంటూ వ‌సుధారతో ఛాలెంజ్ చేస్తుంది దేవ‌యాని. నీ ద‌గ్గ‌ర సాక్ష్యాలు ఉన్నాయా...నిరూపిస్తావా అని అడుగుతుంది. రిషిని నీ కొడుకే కిడ్నాప్ చేశాడ‌ని నా ద‌గ్గ‌ర ఆధారాలు ఉన్నాయ‌ని దేవ‌యానితో అంటుంది వ‌సుధార‌.

వీడియో సాక్ష్యం మిస్‌...

రిషి త‌న ద‌గ్గ‌రే ఉన్నాడ‌ని వ‌సుధార‌ను శైలేంద్ర బెదిరించిన ఓ వీడియోను దేవ‌యానితో పాటు మిగిలిన వాళ్ల‌కు చూపించాల‌ని అనుకుంటుంది వ‌సుధార‌.కానీ ఫోన్‌లో ఆ వీడియో క‌నిపించ‌దు.వ‌సుధార కంగారు ప‌డుతుంది. వీడియో క‌నిపించ‌డం లేదా...ఇదో కొత్త నాట‌క‌మా అంటూ వ‌సుధార‌పై సెటైర్ వేస్తాడు శైలేంద్ర‌.

త‌న ఫోన్‌లోని వీడియోను శైలేంద్ర‌నే ఏదో చేసి ఉంటాడ‌ని వ‌సుధార అంటుంది. నీ ఫోన్ నీ ద‌గ్గ‌రే ఉంటే నా కొడుకు వీడియోను ఎలా డిలీట్ చేస్తాడు. వాడికి ఏమైనా మాయ‌లు, మంత్రాలు వ‌చ్చా అంటూ వ‌సుధార‌పై కోప్ప‌డుతుంది దేవ‌యాని.

ముకుల్ ఎంట్రీ...

అప్పుడే ముకుల్ ఇంట్లోకి అడుగుపెడ‌తాడు. శైలేంద్ర‌నే క‌దా రిషిని కిడ్నాప్ చేసింది మీరైనా వ‌చ్చి నిజం చెప్ప‌మ‌ని ముకుల్‌ను రిక్వెస్ట్ చేస్తుంది వ‌సుధార‌. అలాంటి ఆధారాలేవి మ‌న ద‌గ్గ‌ర లేవ‌ని వ‌సుధార‌తో అంటాడు ముకుల్‌. ఈ రోజు రిషి మిస్స‌వ‌డంతో శైలేంద్ర ఇన్‌వాల్వ్‌మెంట్ ఏం లేద‌ని తేలింద‌ని వ‌సుధార‌కు చెబుతాడు.

ముకుల్ స‌మాధానంతో దేవ‌యాని, శైలేంద్ర రెచ్చిపోతారు. అస‌లైన నేర‌స్తుడు దొర‌క్క‌పోవ‌డంతో మీకు అనుమానం ఉన్న‌వారిపై నింద‌లు మోపుతారా అంటూ ఫైర్ అవుతారు. ఎందుకు నాపై నీకు క‌క్ష‌, నేనేమైనా నీ ఎండీ ప‌ద‌వికి అడ్డొస్తున్నానా, ఎండీ సీట్ మీద ఇంట్రెస్ట్ లేద‌ని నాన్న‌కు లెట‌ర్ రాసి నీకు ఇచ్చాను అని చెబుతాడు.

సాక్ష్యాలు ఉంటే కానీ న‌మ్మ‌ని స్థాయికి...

ఫ‌ణీంద్ర కూడా త‌న కొడుకునే స‌పోర్ట్ చేస్తాడు. నువ్వే సాక్ష్యం ఉంది అన్నావు. ఇప్పుడు ఆ వీడియో క‌నిపించ‌డం లేద‌ని అంటున్నావు. నీ మాట‌లు న‌మ్మే స్థాయి నుంచి, సాక్ష్యాలు ఉంటే కానీ న‌మ్మ‌ని స్థాయికి తీసుకొచ్చావు. శైలేంద్ర‌ను మీరు ఎందుకు నిందిస్తున్నారో నాకు అర్థం కావ‌డం లేద‌ని వ‌సుధార‌తో అంటాడు ఫ‌ణీంద్ర‌. వాడు త‌ప్పు చేశాడు అని తెలిస్తే కొడుకు అని చూడ‌కుండా కొట్టి అవ‌తల పారేస్తాను.

కానీ నిజానిజాలు తెలియ‌కుండా ఊరికే ఇలాంటి గొడ‌వ‌లు వ‌ద్దు అని అంటాడు. దాంతో అన్న‌య్య‌కు సారీ చెప్పి వ‌సుధార‌ను తీసుకొని ఇంట్లో నుంచి వెళ్లిపోవ‌డానికి మ‌హేంద్ర సిద్ధ‌మ‌వుతాడు. వెళుతూ మ‌రోసారి శైలేంద్ర‌కు వార్నింగ్ ఇస్తుంది వ‌సుధార‌. సాక్ష్యం లేదు కాబ‌ట్టి ఈ రోజు త‌ల‌దించుకొని వెళుతున్నాను. అదే సాక్ష్యం ఉంటే ఈ రోజు నీ చేతికి సంకెళ్లు వేసి తీసుకెళ్లేవాడిని. రిషికి ఏదైనా అయితే నిన్ను బ‌త‌క‌నివ్వ‌ను అంటూ వార్నింగ్ ఇస్తుంది. ఈ మాట‌లు గుర్తుపెట్టుకోమ‌ని శైలేంద్ర‌ను హెచ్చ‌రిస్తుంది వ‌సుధార‌.

శైలేంద్ర కాకుండా ఇంకొక‌రు...

ఫ‌ణీంద్ర ఇంటి నుంచి మ‌హేంద్ర, వ‌సుధార‌తో పాటు అనుప‌మ, ముకుల్ వ‌స్తారు. రిషి క‌నిపించపోవ‌డానికి శైలేంద్ర కార‌ణం కాక‌పోయి ఉండొచ్చున‌ని అనుప‌మ అనుమాన‌ప‌డుతుంది. కానీ శైలేంద్ర‌నే రిషిని కిడ్నాప్ చేసి ఉంటాడ‌ని అనుప‌మ‌తో బ‌లంగా వాదిస్తాడు మ‌హేంద్ర‌. ముకుల్ కూడా అనుప‌మ మాట‌ల‌ను స‌మ‌ర్థిస్తాడు. ఈ రోజు రిషి క‌నిపించ‌కుండా పోవ‌డం వెనుక శైలేంద్ర ఇన్‌వాల్వ్‌మెంట్ లేద‌ని మాకు బ‌ల‌మైన ఇన్ఫ‌ర్మేష‌న్ దొరికింద‌ని అంటాడు.

రిషి క‌నిపించ‌కుండాపోవ‌డం వెనుక శైలేంద్ర‌తో పాటు మ‌రో ప‌ర్స‌న్ ఎవ‌రో ఉన్నార‌ని ముకుల్ అనుమాన‌ప‌డ‌తాడు. శైలేంద్ర మీ ఇంటికి వ‌చ్చి ఫోన్ డిలేట్ చేయ‌లేదంటే మీకు తెలిసిన ఎవ‌రో ఈ ప‌ని చేశార‌ని ముకుల్ అనుమానం వ్య‌క్తంచేస్తాడు. అత‌డు ఎవ‌రో తెలిస్తేనే అన్ని నిజాలు తెలుస్తాయ‌ని ముకుల్ అంటాడు.

భ‌ద్ర‌పై శైలేంద్ర పొగ‌డ్త‌లు...

వ‌సుధార‌కు తెలియ‌కుండా ఆమె ఫోన్‌లో ఉన్న వీడియోను భ‌ద్ర డిలీట్ చేస్తాడు. త‌న‌ నిజ‌స్వ‌రూపం బ‌య‌ట‌ప‌డ‌కుండా చేసిన భ‌ద్ర‌పై ప్ర‌శంస‌లు కురిపిస్తాడు శైలేంద్ర‌. నువ్వు సూప‌ర్ అని పొగుడుతాడు. నీకు ప‌ని అప్ప‌గించినందుకు ఇప్పుడు రిలీఫ్‌గా ఫీల‌వుతున్న‌ట్లు భ‌ద్ర‌తో అంటాడు శైలేంద్ర‌. వ‌సుధార‌, మ‌హేంద్ర‌, అనుప‌మ చాలా ముదుర్లు అని, వాళ్ల క‌ళ్లు గ‌ప్పి ఈ ప‌నులు చేయ‌డానికి ఎంతో ప్లానింగ్ చేయాల్సివ‌స్తుంద‌ని శైలేంద్ర‌తో అంటాడు భ‌ద్ర‌. రిషి భ‌ద్ర ద‌గ్గ‌ర లేడంటే ఖ‌చ్చితంగా రాజీవ్ ద‌గ్గ‌రే ఉండి ఉంటాడ‌ని శైలేంద్ర అనుకుంటాడు. అక్క‌డితో నేటి గుప్పెడంత మ‌న‌సు సీరియ‌ల్ ముగిసింది.

తదుపరి వ్యాసం