Guppedantha Manasu April 15th Episode: దేవయాని కొత్త ప్లాన్ రివర్స్ - వసుధారకు సపోర్ట్ చేసిన రిషి
15 April 2023, 8:43 IST
Guppedantha Manasu April 15th Episode: రిషి, వసుధారలను విడగొట్డడానికి కొత్త ప్లాన్‌ను తెరపైకి తెస్తుంది దేవయాని. కానీ ఆమె ప్లాన్‌ను రిషి తిప్పికొడతాడు. వసుధారకు సపోర్ట్‌గా నిలుస్తాడు. ఇంకా ఈ రోజు గుప్పెడంత మనసు సీరియల్‌లో ఏం జరిగిందంటే...
గుప్పెడంత మనసు
Guppedantha Manasu April 15th Episode: కిడ్నాప్ ఘటనను గురించి తలచుకుంటూ వసుధార భయపడుతోండటంతో ఆమెకు ధైర్యం చెబుతాడు రిషి. ఈ మ్యాటర్ ఎలా డీల్ చేయాలో, వాళ్ల ఆటలు ఎలా కట్టిపడేయాలో తనకు తెలుసు అంటాడు. నువ్వు టెన్షన్ పడాల్సిన పనిలేదు... నేను చూసుకుంటా అంటూ ఆమెకు ధైర్యం చెబుతాడు. ఆ తర్వాత ఆమెకు యాపిల్స్ తినమని ఇస్తాడు.
ప్రేమ మైకంలో రిషి, వసు
ముందు నువ్వే తినాలని వసు అతడితో పోటీపడుతుంది. ఆమె మాటలకు ప్రేమ నీకు మాత్రమేనా నాకు ఉంది అని సమాధానం ఇస్తాడు రిషి. చివరకు ఇద్దరు ఒకేసారి తినాలని నిర్ణయించుకుంటారు. ఒక విషయం గుర్తుపెట్టుకో నీది నాది ఎప్పటికీ ఒకే మాట. ఒకే ఆలోచన అని వసుతో అంటాడు రిషి. అందుకే మనం రిషిధార గా కలిసిపోయామని బదులిస్తాడు. ఇద్దరు ఒకరికొకరు యాపిల్స్ తినిపించుకుంటూ ప్రేమమైకంలో మునిగిపోతారు. అనుకోకుండా ఆ దృశ్యం చూసిన దేవయానికి రగిలిపోతుంది. వీరిద్దరిని ఎలాగైన విడదీయాలి. అందుకోసం ఏదో ఒక ప్లాన్ చేయాలని మనసులోనే బలంగా అనుకుంటుంది.
ఆ రోజు రావాలని కోరుకున్న రిషి
ఆ తర్వాత కాలిగాయం కారణంగా వసుధార తూలిపడిపోనుండంతో రిషి ఆమెను సేవ్ చేస్తాడు.ఆ తర్వాత వసుధార రూమ్ నుంచి వెళ్లపోతూ ఆమెకు గుడ్‌నైట్ చెబుతాడు రిషి. గుమ్మం అవతల నువ్వు ఇవతల నేను ఉండి గుడ్‌నైట్ చెప్పుకోవడం బాగాలేదని, ఇలా కాకుండా ఒకరికొకరం పక్కపక్కనే ఉండి గుడ్‌నైట్ చెప్పుకునే రోజు రావాలని కోరుకుందాం అని అంటాడు.
అక్కడి నుంచి వెళ్లిపోవాలని అనుకుంటాడు.కానీ తన మనసు మాత్రం వసుధార మీదే ఉండటంతో కదలకుండా ఉంటాడు. వసుధార కూడా రిషిని చూస్తూ అలాగే ఉండిపోతుంది. తనకు నిద్ర రావడం లేదని వసుధార అనగా మన ప్రేమను తలచుకుంటూ పడుకో అప్పుడు నిద్రలో కలలు వస్తాయి..ఆ కలలో నేను కూడా వస్తాను అంటూ వసుపై ప్రేమను కురిపిస్తాడు రిషి
దేవయాని కొత్త ఎత్తు...
రిషి, వసుధారలను విడగొట్టేందుకు కొత్త ప్లాన్ అమలు చేయడానికి రెడీ అవుతుంది దేవయాని. రిషితో పాటు జగతి, మహేంద్రలను పిలుస్తుంది. రిషి, వసు పెళ్లి గురించి డిస్కస్ చేయడానికే పిలిచానని అంటుంది. ఎంత త్వరగా వీలయితే అంత త్వరగా వసు ఊరికి వెళ్లి ఆమె ఫ్యామిలీతో పెళ్లి గురించి మాట్లాడాలని అంటుంది.
ఆ బాధ్యతను జగతి, మహేంద్రలకు అప్పగిస్తుంది. దేవయానికి మాటలకు వసుధార కలవరపడుతుంది. ఆమె కలవరపాటును గ్రహించిన దేవయానికి ఏమైందని అడుగుతుంది. కానీ వసుధార మాత్రం సమాధానం చెప్పదు. ఊళ్లో పరిస్థితులు బాగలేవని నెమ్మదిగా జగతితో చెబుతుంది. వారి మాటలను గమనించిన దేవయానికి మీలో మీరు మాట్లాడుకుంటే ఎవరికి అర్థం అవుతాయి. మాకు చెప్పండి అంటుంది.
వసుకు రిషి సపోర్ట్...
వసు ఇంట్లో సమస్యలున్నాయని జగతి అంటే ఆ మాటలను తేలికగా తీసుకుంటుంది దేవయాని. సమస్యలున్నాయని పద్ధతులు మర్చిపోయి పెళ్లిచేస్తామా అంటూ కఠువుగా మాట్లాడుతుంది. దేవయాని మాటలను మధ్యలోనే అడ్డుకుంటాడు రిషి. వసుధార ఊరికి ఎవరూ వెళ్లాల్సిన అవసరం లేదని అంటాడు. అతడి మాటలకు షాక్ తిన్న దేవయాని మంచి చెడు మాట్లాడుకోవాలి అంటూ కన్వీన్స్ చేయడానికి ప్రయత్నిస్తుంది.
కానీ వసుధార గురించి, ఆమె ఫ్యామిలీ గురించి కొత్తగా తెలుసుకోవాల్సింది ఏమీ లేదని దేవయానితో చెబుతాడు రిషి. శూన్యమాసం వెళ్లిపోయిన తర్వాత మంచి రోజు చూసి డేట్ ఫిక్స్ చేయండి. రావాల్సిన టైమ్‌లో వాళ్ల అమ్మనాన్న ఇక్కడకు వచ్చి మాట్లాడుతారు. మనం వాళ్ల ఊరు వెళ్లాల్సిన పనిలేదు అంటూ చెబుతాడు.
అయినా పట్టువీడని దేవయానికి రిషితో వాదనకు దిగుతుంది. మహేంద్రతో పాటు ఎవరు చెప్పిన తన పట్టు మాత్రం విడవదు. కానీ ఆమ మాటలను రిషి పట్టించుకోడు. వసుధార నేను ఇష్టపడ్డాం. ఇంతకుముందే పెళ్లి చేసుకోవాలని అనుకున్నాం. కానీ మా మధ్యచిన్న చిన్న అవాంతరాలు ఏర్పడ్డాయి. ఇప్పుడవన్నీ తొలగిపోయాయి. ఇక మా మధ్య మిగిలింది ప్రేమ మాత్రమే. అది చాలు మేమిద్ధరం పెళ్లిచేసుకోవడానికి అంటూ దేవయానితో చెబుతాడు.
ఎమోషనల్ అయిన వసు
ఆ తర్వాత రిషి కోసం కాఫీ చేయడానికి కిచెన్‌లోకి వెళ్తుంది వసుధార. అక్కడే ఉన్న ధరణి ఎంటి వసుధార కొంచెం చొరవ ఎక్కువ తీసుకుంటున్నావు. ముందు ముందు ఇంటి విషయాలు, వంట విషయాల్లో నాతో పోటీపడతావేమో అంటుంది. ఆమె మాటలకు వసు కన్నీళ్లు పెట్టుకుంటుంది. ఏమైందని ధరణిఅడగ్గా ఈ క్షణమే మిమ్మల్ని అక్కయ్య అని పిలవాలని అనిపిస్తుంది అంటుంది. అయితే అలాగే పిలవమని ధరణి అంటుంది. కానీ ఆ హక్కు నాకు ఇంకా రాలేదని, క్యాలెండర్‌లో అంకెలు అడ్డం వచ్చాయని ధరణితో చెబుతుంది వసుధార. తేదీల గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు. నన్ను అక్కయ్య అని పిలువు అని అంటోంది ధరణి. నీ సహనమే రిషి మనసులో, ఈ ఇంట్లోనే స్థానం కల్పించేలా చేసిందని ధరణి చెబుతుంది.
భయంలో దేవయాని
ఆ తర్వాత తన ప్లాన్ ఫెయిలవ్వడంతో దేవయాని ఆలోచనలో పడుతుంది. చివరకు తానే రిషి, వసుకు పెళ్లి దగ్గరుండి పెళ్లి చేయాల్సివస్తుందని భయపడుతుండటంతో ఈ రోజు గుప్పెడంత మనసు (Guppedantha Manasu) ఎపిసోడ్ ముగిసింది.