తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Guntur Kaaram Trp: గుంటూరు కారం మూవీకి టీవీలో అదిరిపోయే టీఆర్పీ.. తొలి టెలికాస్ట్‌లోనే..

Guntur Kaaram TRP: గుంటూరు కారం మూవీకి టీవీలో అదిరిపోయే టీఆర్పీ.. తొలి టెలికాస్ట్‌లోనే..

Hari Prasad S HT Telugu

18 April 2024, 14:55 IST

    • Guntur Kaaram TRP: మహేష్ బాబు సంక్రాంతి సినిమా గుంటూరు కారం టీవీలో తొలి టెలికాస్ట్ లోనే మంచి టీఆర్పీ సొంతం చేసుకుంది. గతేడాది బాక్సాఫీస్ దగ్గర సూపర్ హిట్ అయిన సినిమాల కంటే ఈ మూవీ టీఆర్పీ చాలా బాగుంది.
 గుంటూరు కారం మూవీకి టీవీలో అదిరిపోయే టీఆర్పీ.. తొలి టెలికాస్ట్‌లోనే..
గుంటూరు కారం మూవీకి టీవీలో అదిరిపోయే టీఆర్పీ.. తొలి టెలికాస్ట్‌లోనే..

గుంటూరు కారం మూవీకి టీవీలో అదిరిపోయే టీఆర్పీ.. తొలి టెలికాస్ట్‌లోనే..

Guntur Kaaram TRP: మహేష్ బాబు, త్రివిక్రమ్ కాంబినేషన్ లో వచ్చిన సంక్రాంతి సినిమా గుంటూరు కారం. భారీ అంచనాల మధ్య రిలీజైనా మిక్స్‌డ్ రివ్యూలతో తర్వాత బాక్సాఫీస్ దగ్గర ఊహించిన స్థాయిలో వసూళ్లు రాబట్టలేకపోయింది. అయినా ప్రపంచవ్యాప్తంగా సుమారు రూ.200 కోట్ల గ్రాస్ వసూలు చేసింది. ఇక ఇప్పుడు టీవీలో ప్రీమియర్ తోనే మంచి టీఆర్పీ సొంతం చేసుకుంది.

ట్రెండింగ్ వార్తలు

Bollywood: వాటి గురించి సుశాంత్ సింగ్ చాలా బాధపడేవారు: మనోజ్ బాజ్‍పేయ్

Pavithra Jayaram: టీవీ సీరియల్ నటి మృతి.. తిరిగి రావా అంటూ భర్త చేసిన ఎమోషనల్ పోస్ట్ వైరల్

Kannappa Teaser Date: కన్నప్ప సినిమా టీజర్ రిలీజ్‍కు డేట్ ఖరారు.. ప్రతిష్టాత్మక వేదికపై..

Aha ott top trending: సుడిగాలి సుధీర్ షోనే టాప్.. ఆహా ఓటీటీలో టాప్ 10 ట్రెండింగ్ సినిమాలు, షోలు ఇవే

గుంటూరు కారం టీఆర్పీ

సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన గుంటూరు కారం మూవీ ఈ ఏడాది జనవరి 12న సంక్రాంతి సందర్భంగా రిలీజైన విషయం తెలిసిందే. ఈ మూవీ తర్వాత నెట్‌ఫ్లిక్స్ ఓటీటీలోకి వచ్చింది. ఇక ఈ మధ్యే జెమిని టీవీలో వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ టెలికాస్ట్ అయింది. దీనికి 9.23 టీఆర్పీ రావడం విశేషం. ఈ మధ్య కాలంలో వచ్చిన సినిమాలను బట్టి చూస్తే ఇది చాలా మంది రేటింగ్ అనే చెప్పాలి.

గతేడాది రిలీజై బాక్సాఫీస్ దగ్గర సక్సెసైన వాల్తేర్ వీరయ్య, దసరా, జైలర్ లాంటి సినిమాలతో పోలిస్తే గుంటూరు కారం టీఆర్పీ చాలా మెరుగ్గానే ఉంది. ఇక ఈ మధ్యే వచ్చిన హాయ్ నాన్న మూవీ టీఆర్పీ కంటే చాలా ఎక్కువే. ఓటీటీలు వచ్చిన తర్వాత టీవీల్లో సినిమాలకు వచ్చే టీఆర్పీలు క్రమంగా పడిపోతున్నాయి. ఎంత పెద్ద హీరో సినిమా అయినా రెండంకెల టీఆర్సీ అందుకోవడం అసాధ్యంగా మారింది.

ఈ పరిస్థితుల్లో గుంటూరు కారం సుమారు 10కి చేరువగా రేటింగ్ సాధించడం నిజంగా విశేషమే. ఈ యాక్షన్ డ్రామా మూవీకి థియేటర్లలో మిక్స్‌డ్ రివ్యూలు వచ్చాయి. సినిమా చాలా దారుణంగా ఉందని కొందరు రివ్యూలు ఇచ్చారు. ఆ ప్రభావం బాక్సాఫీస్ కలెక్షన్లపై పడింది. అయితే తర్వాత నెట్‌ఫ్లిక్స్ లోనూ ఈ సినిమాకు మంచి ఆదరణే లభించింది.

చాలా రోజుల పాటు టాప్ ట్రెండింగ్ మూవీస్ జాబితాలో ఉంది. ఇక ఇప్పుడు టీవీలోనూ మంచి రెస్పాన్సే వచ్చింది. ఈ సినిమాలో శ్రీలీల, మీనాక్షి చౌదరి కూడా నటించిన విషయం తెలిసిందే. రమ్యకృష్ణ, జయరాం, ప్రకాశ్ రాజ్, రాహుల్ రవీంద్రన్, వెన్నెల కిశోర్ లాంటి వాళ్లు ముఖ్యమైన పాత్రలు పోషించారు.

తెలుగులో టాప్ టీఆర్పీ సినిమాలు

నిజానికి తెలుగులో భారీ టీఆర్పీ సాధించిన సినిమాలు చాలానే ఉన్నాయి. అందులో అత్యధికంగా అల్లు అర్జున్ నటించిన అల వైకుంఠపురంలో మూవీకి రావడం విశేషం. ఈ సినిమాకు ఏకంగా 29కిపైగా టీఆర్పీ వచ్చింది. ఇప్పటి వరకూ తెలుగు సినిమాల్లో ఇదే అత్యధికం.

ఇక మహేష్ బాబు నటించిన సరిలేరు నీకెవ్వరు మూవీకి కూడా గతంలో 23.5 టీఆర్పీ వచ్చింది. అతని మరో మూవీ శ్రీమంతుడు కూడా 22.5 టీఆర్పీ సాధించింది. వాటితో పోలిస్తే గుంటూరు కారం మూవీకి తక్కువే అయినా.. ఈ మధ్యకాలంలో వచ్చిన సినిమాలతో పోలిస్తే మాత్రం చాలా మెరుగనే చెప్పాలి.

తెలుగులో అత్యధిక టీఆర్పీ సాధించిన సినిమాల్లో అల వైకుంఠపురంలో, సరిలేరు నీకెవ్వరు, శ్రీమంతుడుతోపాటు బాహుబలి 2, పుష్ప ది రైజ్ సినిమాలు టాప్ 5లో ఉన్నాయి.

హిందుస్తాన్ టైమ్స్ తెలుగు నుంచి ఎంటర్‌టైన్మెంట్, అలాగే ఓటీటీ తాజా అప్‌డేట్స్ పొందండి.
తదుపరి వ్యాసం