Gunde Ninda Gudi Gantalu: మీనాను ఇంట్లో నుంచి వెళ్లగొట్టిన ప్రభావతి - తల్లికి బాలు సపోర్ట్ - సత్యం కన్నీళ్లు
18 October 2024, 11:14 IST
Gunde Ninda Gudi Gantalu: గుండె నిండా గుడి గంటలు అక్టోబర్ 18 ఎపిసోడ్లో పోలీస్ స్టేషన్ నుంచి ఇంటికొచ్చిన సత్యం తనకు జరిగిన అవమానం గుర్తొచ్చి ఎమోషనల్ అవుతాడు. ఇంట్లో అడుగుపెట్టిన మీనాను ప్రభావతి బయటకు గెంటేస్తుంది. మీనాను ఇంట్లోకి ఎవరు రానిచ్చారని బాలు కూడా భార్యపై ఫైర్ అవుతాడు.
గుండె నిండా గుడి గంటలు అక్టోబర్ 18 ఎపిసోడ్
Gunde Ninda Gudi Gantalu: తనపై పడిన నిందను తొలగించుకునేందుకు రవి, శృతిలను పోలీస్ స్టేషన్‌కు తీసుకొస్తుంది మీనా. రవిని చూడగానే ఆవేశం పట్టలేకపోతాడు బాలు. పోలీస్ స్టేషన్లోనే తమ్ముడిని చితకబాదుతాడు. శృతిని తమతో పాటు తీసుకెళ్లాలని ఆమె తల్లిదండ్రులు సురేంద్ర, శోభన అనుకుంటారు. కానీ వారిని రవి అడ్డుకుంటాడు. తన భార్యను తీసుకెళ్లేహక్కుమీకు లేదని అంటాడు.
మరోవైపు శృతి కూడా తండ్రికి ఎదురుతిరుగుతుంది. తనను ఎవరూ కిడ్నాప్ చేయలేదని, తాను ఇష్టపూర్వకంగానే రవిని పెళ్లిచేసుకున్నట్లు ఎస్ఐకి చెబుతుంది. తాము మేజర్స్మని, తల్లిదండ్రుల నుంచి తనకు రక్షణ కావాలని అంటుంది. కావాలనే తన తండ్రి రవితో పాటు సత్యంపై కేసు పెట్టాడని అంటుంది.
రవికి అవమానం...
రవి కట్టిన తాళిని తీసేసి తమతో పాటు వచ్చేయమని శృతితో అంటుంది ఆమె తల్లి. సంజును పెళ్లిచేసుకుంటే నీ భవిష్యత్తు బాగుంటుందని ఎమోషనల్‌గా శృతిని కన్వీన్స్చేసే ప్రయత్నం చేస్తుంది. నీకే గతిలేదు...దానికి ఏం పెట్టి పోషిస్తావని, నీతో వస్తే నా కూతురు భవిష్యత్తు సర్వనాశనం అవుతుందని రవిని అవమానిస్తుంది శోభన. శృతికి ఏ కష్టం రాకుండా తాను చూసుకుంటానని సురేంద్ర, శోభనలతో రవి ఛాలెంజ్ చేస్తాడు.
శృతి మాటలతో సురేంద్ర కిడ్నాప్ కేసు అబద్ధమని పోలీస్ ఆఫీసర్‌కు తెలిసిపోతుంది. కూతురు ప్రేమ సంగతి తననకు చెప్పనందుకు సురేంద్రపైనే ఎస్ఐ ఫైర్ అవుతాడు. సత్యాన్ని పోలీసులు రిలీజ్ చేశారు.
కొడుకును నెట్టేసిన సత్యం...
నిన్ను కని పెంచిన మాకే ద్రోహం చేస్తావా...వీడిని నమ్మి మమ్మల్నే కాదనుకున్నావు కదా...పేదరికం భరించలేక నువ్వే తిరిగొస్తావని కూతురితో కోపంగా చెప్పి సురేంద్ర, శోభన పోలీస్ స్టేషన్ నుంచి వెళ్లిపోతారు. తండ్రి దగ్గరకు వచ్చి జరిగింది చెప్పాలని అనుకుంటాడు రవి.
కానీ సత్యం కొడుకును దూరంగా నెట్టివేస్తాడు. ఇందులో మీనా తప్పేం లేదని, తానే అబద్ధం చెప్పి గుడికి తీసుకెళ్లానని బాలుతో అంటాడు రవి. బాలు కూడా రవి మాటల్ని వినడు. ప్రాణాలతో ఉండాలంటే నా కళ్ల ముందు ఉండకు అని వార్నింగ్ ఇస్తాడు.
మీనాను వదిలేసిన బాలు...
తండ్రిని కారు ఎక్కించబోతాడు బాలు. మీనాను కూడా పిలవమని సత్యం అంటాడు. కానీ మీనాను పోలీస్ స్టేషన్లోనే వదిలిపెట్టి ఇంటికి వెళ్లిపోతాడు బాలు. ఇంటికొచ్చిన సత్యం...పోలీస్ స్టేషన్లో తనకు జరిగిన అవమానం గుర్తొచ్చి ఎమోషనల్ అవుతాడు. పక్కనే బకెట్లో ఉన్న నీళ్లు తీసి తనపై గుమ్మరించుకుంటాడు. పోలీస్ స్టేషన్లో జరిగిన అవమానానికి ఇంతకంటే ఏం చేయలో తెలియడం లేదని అంటాడు.
భర్తకు హారతి...
భర్తకు హారతి ఇచ్చి లోపల అడుగుపెట్టమని ప్రభావతి అంటుంది. నేనేమైనా స్వతంత్య్ర పోరాటం చేసి జైలుకు వెళ్లానా ప్రపంచ పతకం సాధించానా అని భార్యతో అంటాడు సత్యం. ఈ గడప బయటే ఆ అవమానాన్ని వదిలేసి రమ్మని చెప్పడానికే హారతి ఇస్తున్నానని ప్రభావతి అంటుంది.
నేను నా ముగ్గురు కొడుకులను బాగా పెంచానని సురేంద్రతో ఛాలెంజ్ చేశానని సత్యం అంటాడు. కానీ పోలీస్ స్టేషన్లో సురేంద్ర గెలిచాడు. సత్యం ఓడిపోయాడని కన్నీళ్లు పెట్టుకుంటాడు. ఎవరిని ఎప్పుడు నమ్మొద్దని చెప్పి సత్యం తన గదిలోకి వెళ్లి గడియపెట్టుకుంటాడు.
బాలు ఆవేశం...
రవి వల్లే ఈ తప్పు జరిగిపోయిందని బాలు ఆవేశానికి లోనవుతాడు. మీనాకు ఈ తప్పులో భాగం ఉందని ప్రభావతి అంటుంది. సత్యం అరెస్ట్ కావడానికి మీనానే కారణమని నిందలు వేస్తుంది. సత్యంపై ప్రభావతికి ఉన్న ప్రేమ, అభిమానం చూసి అందరూ కదిలిపోతారు.
మీనా జ్ఞాపకాల్లో బాలు...
మీనా జ్ఞాపకాలు బాలును వెంటాడుతూనే ఉంటాయి. కానీ ఆమె చేసిన తప్పు గుర్తొచ్చి జీవితంలో మళ్లీ భార్య ముఖం చూడకూడదని అనుకుంటాడు. రవిని వెతకడానికి ఆవేశంగా బయటకు వెళతాడు.
బాలు వెళ్లిపోయిన తర్వాత మీనా ఇంట్లోకి వస్తుంది. ఆమెను చూసి ప్రభావతి ఆవేశం పట్టలేకపోతుంది. ఎవరు నువ్వు...నేరుగా ఇంట్లోకి ఎందుకు వస్తున్నావని కోప్పడుతుంది. నాకు ఇంత ద్రోహం చేసిన తర్వాత నిన్ను ఇంట్లోకి రానిస్తానని ఎలా అనుకున్నావని కోడలిపై ఫైర్ అవుతుంది. నా కొడుకుకు దొంగ పెళ్లిచేసి, నా భర్తను జైలుకు పంపించిన ఇంట్లో ఉండనిచ్చేది లేదని ప్రభావతి అంటుంది. బయటకు నడవమని వార్నింగ్ ఇస్తుంది.
ప్రభావతి నిందలు...
ఇందులో తన తప్పేం లేదని కన్వీన్స్ చేయబోతుంది మీనా. కానీ ప్రభావతి ఆమె మాటల్ని వినదు. నాపై పగతోనే ఇదంతా చేశావని నిందలు వేస్తుంది. ఇంట్లోనుంచి వెళ్లిపోమని హెచ్చరిస్తుంది. నువ్వు చేసిన తప్పు వల్ల సత్యానికి శిక్ష పడిందని ప్రభావతి ఫైర్ రచ్చ చేస్తుంది. సత్యం ఒక్కరైనా తన మాట వింటారని, ఆయనకు జరిగింది చెప్పాలని మీనా అనుకుంటుంది. సత్యాన్ని మీనా కలవడానికి ప్రభావతి ఒప్పుకోదు. మీనాను ఇంట్లో నుంచి బలవంతంగా బయటకు వెళ్లగొడుతుంది.
ఎవరు లోపలికి రానిచ్చారు..
తనను వెళ్లమని చెప్పే అధికారం మీకు లేదు...నా భర్త ఆ మాట చెబితే వెళ్లిపోతానని మీనా అంటుంది. వెంటనే బాలుకు ఫోన్ చేస్తాడు మనోజ్. అసలు మీనాను ఇంట్లోకి ఎవరు రానిచ్చారని బాలు అంటాడు.అందరు కలిసి మీనాను బయటకు తోసేయమని చెబుతాడు. భర్త మాటలతో మీనా షాకవుతుంది. అక్కడితో నేటి గుండె నిండా గుడి గంటలు సీరియల్ ముగిసింది.
టాపిక్