తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Godfather Pre Release Event: అనంతపురంలో గాడ్‌ఫాదర్‌ ప్రీరిలీజ్‌ ఈవెంట్‌

Godfather Pre Release Event: అనంతపురంలో గాడ్‌ఫాదర్‌ ప్రీరిలీజ్‌ ఈవెంట్‌

HT Telugu Desk HT Telugu

24 September 2022, 19:39 IST

    • Godfather Pre Release Event: అనంతపురంలో గాడ్‌ఫాదర్‌ ప్రీరిలీజ్‌ ఈవెంట్‌ నిర్వహించాలని మేకర్స్‌ నిర్ణయించారు. దసరా సందర్భంగా అక్టోబర్‌ 5న ఈ సినిమా రిలీజ్‌ కానున్న విషయం తెలిసిందే.
గాడ్‌ఫాదర్‌లో చిరంజీవి, సల్మాన్ ఖాన్
గాడ్‌ఫాదర్‌లో చిరంజీవి, సల్మాన్ ఖాన్ (Twitter)

గాడ్‌ఫాదర్‌లో చిరంజీవి, సల్మాన్ ఖాన్

Godfather Pre Release Event: మెగాస్టార్‌ చిరంజీవి నటించిన మూవీ గాడ్‌ఫాదర్‌. ఈ సినిమాపై మెగాభిమానుల్లో భారీ అంచనాలే ఉన్నాయి. ముఖ్యంగా ఆచార్య డిజాస్టర్‌ తర్వాత మెగాస్టార్‌కు ఓ మెగా హిట్‌ రావాల్సిన అవసరం ఉంది. ఈ నేపథ్యంలో మలయాళ మూవీ లూసిఫర్‌కు రీమేక్‌గా వస్తున్న గాడ్‌ఫాదర్‌నే చిరు నమ్ముకున్నాడు.

ట్రెండింగ్ వార్తలు

OTT Telugu Movies This week: ఈవారంలో ఓటీటీల్లోకి వచ్చిన 3 తెలుగు సినిమాలు ఇవే.. రెండు డబ్బింగ్ చిత్రాలు కూడా..

Tollywood: బాలయ్య - అమితాబ్ కాంబో కాస్తలో మిస్.. పట్టాలెక్కని సినిమా.. వివరాలివే

Nagababu Twitter: ట్విట్టర్‌లోకి నాగబాబు రీఎంట్రీ .. ఆ వివాదాస్పద ట్వీట్ డిలీట్

PM Narendra Modi Biopic: ప్రధాని నరేంద్ర మోదీ పాత్రలో కట్టప్ప!: వివరాలివే

అందుకే మూవీ రిలీజ్‌ కంటే ముందే ప్రీరిలీజ్‌ ఈవెంట్‌ను భారీ స్థాయిలో నిర్వహించాలని నిర్ణయించారు. సెప్టెంబర్‌ 28న జరగనున్న ఈ ఈవెంట్‌ను అనంతపురంలోని జీఎన్టీయూ గ్రౌండ్‌లో నిర్వహించనున్నారు. ఈ ఈవెంట్‌కు భారీ సంఖ్యలో అభిమానులు రానున్నట్లు మేకర్స్‌ చెప్పారు. దీంతో ఇలాంటి ఈవెంట్‌ను ఓ ఆడిటోరియంలో నిర్వహించడం కష్టమని భావించి, జేఎన్టీయూ గ్రౌండ్‌ను ఎంపిక చేశామని తెలిపారు.

నిజానికి ఈ ఈవెంట్‌ను ఎక్కడ నిర్వహించాలన్నదానిపై కొన్ని రోజులుగా మూవీ యూనిట్‌ తర్జనభర్జనలు పడింది. పలు వేదికలను పరిశీలించింది. చివరికి జేఎన్టీయూ గ్రౌండ్‌ను ఫైనల్‌ చేసింది. ఇందులో భారీ సంఖ్యలో తరలివచ్చే అభిమానులందరికీ సులువుగా ఎంట్రీ లభించనుంది. మోహన్‌రాజా డైరెక్షన్‌లో వస్తున్న గాడ్‌ఫాదర్‌ మూవీ నుంచి ఇప్పటికే వచ్చిన ఫస్ట్‌ లుక్‌, ఫస్ట్‌ సింగిల్‌ వంటివి అదుర్స్‌ అనిపించేలా ఉన్నాయి.

సాల్ట్‌ పెప్పర్‌ లుక్‌లో చిరు తొలిసారి కనిపిస్తున్న మూవీ ఇది. ఈ మధ్యే మూవీ నుంచి వచ్చిన తార్‌ మార్‌ తక్కర్‌మార్‌ ఫస్ట్‌ సింగిల్ ఫ్యాన్స్‌కు పండగలాగా అనిపించింది. తమన్‌ అందించిన బీట్స్‌ ఫ్యాన్స్‌తో స్టెప్పులేయించేలా ఉన్నాయి.

హిందుస్తాన్ టైమ్స్ తెలుగు నుంచి ఎంటర్‌టైన్మెంట్, అలాగే ఓటీటీ తాజా అప్‌డేట్స్ పొందండి.
తదుపరి వ్యాసం