Salman Remuneration For Godfather: గాడ్‌ఫాదర్‌లో సల్మాన్ రెమ్యూనరేషన్ ఎంతో తెలుసా?-chiranjeevi reveals salman khan did the godfather without taking money ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Salman Remuneration For Godfather: గాడ్‌ఫాదర్‌లో సల్మాన్ రెమ్యూనరేషన్ ఎంతో తెలుసా?

Salman Remuneration For Godfather: గాడ్‌ఫాదర్‌లో సల్మాన్ రెమ్యూనరేషన్ ఎంతో తెలుసా?

Maragani Govardhan HT Telugu
Sep 23, 2022 04:19 PM IST

Chiranjeevi Praises Salman Khan: గాడ్ ఫాదర్(Godfather) సినిమా అక్టోబరు 5న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానున్న సంగతి తెలిసిందే. తాజాగా ఈ సినిమాకు సంబంధించి మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) ఆసక్తికర విషయాలను తెలియజేశారు. ఈ సినిమాలో సల్మాన్(Salman Khan) రెమ్యూనరేషన్ గురించి తెలిపారు.

గాడ్‌ఫాదర్‌లో చిరంజీవి, సల్మాన్ ఖాన్
గాడ్‌ఫాదర్‌లో చిరంజీవి, సల్మాన్ ఖాన్ (Twitter)

Salman Khan Remuneration For Godfather: ఈ ఏడాది ఆచార్యతో ప్రేక్షకుల ముందుకు వచ్చి అలరించారు మెగాస్టార్ చిరంజీవి. అయితే ఈ సినిమా ఆశించిన ఫలితం ఇవ్వకపోవడంతో తన తదుపరి చిత్రాలపై దృష్టించారు. ఇప్పటికే దసరా కానుకగా గాడ్‌ఫాదర్ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు ప్రణాళికలు సిద్ధం చేశారు. ఇప్పటికే విడుదలైన టీజర్, పాటలు సినిమాపై అంచనాలు పెంచేస్తున్నాయి. సల్మాన్ ఖాన్ కూడా ఈ చిత్రంలో కీలక పాత్ర పోషించిన విషయం తెలిసిందే. ఇప్పటికే ఈ చిత్రం ప్రచారకార్యక్రమాలను ప్రారంభించింది చిత్రబృందం. ఇందులో భాగంగా.. మెగాస్టార్ ఓ ఇంటర్వ్యూలో ఈ సినిమాకు సంబంధించిన ఆసక్తికర విషయాలను వెల్లడించారు.

"నాకు హీరోయిన్ లేదే, పాటలు లేవే అనే ఆలోచన కూడా రాలేదు. ఎందుకంటే గాడ్‌ఫాదర్ సబ్జెక్ట్ అలాంటిది. అంతేకాకుండా ఈ సినిమాలో పూరి జగన్నాథ్ ఓ కీలక పాత్ర పోషించారు. మొదట్లో అతడు ఈ సినిమా ఎట్టి పరిస్థితుల్లోనూ చేయలేనని చెప్పాడు. కానీ మీరు సినిమా చూసినప్పుడు అతడిలో కమాండింగ్ నటుడు ఉన్నాడని తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు." అని మెగాస్టార్ స్పష్టం చేశారు.

అంతేకాకుండా ఈ సినిమాలో కీలక పాత్ర పోషించిన సల్మాన్ ఖాన్ గురించి కూడా ఓ ఆసక్తికకర విషయాన్ని తెలియజేశారు చిరు. "సల్మాన్ ఈ సినిమాకు ఒక్క రూపాయి కూడా తీసుకోకుండా పని చేశారు. అతడు కేవలం సినిమాపై ప్రేమతో చేశాడు. సల్మాన్ భాయ్ నీకు హ్యాట్సాఫ్.. మేమంతా నిన్ను ప్రేమిస్తున్నాం." అంటూ బాలీవుడ్ భాయ్‌జాన్‌పై ప్రశంసల వర్షం కురిపించాడు.

గాడ్‌ఫాదర్ అక్టోబరు 5న ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది. నయనతార ఈ సినిమాలో కీలక పాత్ర పోషించింది సత్యదేవ్ కూడా ముఖ్యమైన క్యారెక్టర్ చేశారు. నిరవ్ షా సినిమాటోగ్రాఫర్‌గా పనిచేస్తోన్న ఈ సినిమాలో టాప్ క్లాస్ టెక్నికల్ టీమ్ పనిచేస్తోంది. తమన్ సంగీత సారథ్యం వహిస్తుండగా.. సురేశ్ సెల్వరాజన్ ఆర్ట్ డైరెక్టర్‌గా పనిచేస్తున్నారు. ఈ చిత్రాన్ని మెగా సూపర్ గుడ్ ఫిల్మ్స్ , కొణిదెల ప్రొడక్షన్స్ పతాకాలపై ఆర్బీ చైదురీ, ఎన్వీ ప్రసాద్, సురేఖ కొణిదెల నిర్మిస్తున్నారు.

IPL_Entry_Point

సంబంధిత కథనం