Telugu News  /  Entertainment  /  Acting In God Father Movie With Chiranjivi Says Salman Khan
సల్మాన్ కాన్
సల్మాన్ కాన్ (ani)

గాడ్ ఫాదర్: చిరంజీవితో కలిసి నటించడం అద్భుతమైన అనుభవం - సల్మాన్ ఖాన్

29 March 2022, 15:05 ISTHT Telugu Desk
29 March 2022, 15:05 IST

గాడ్‌ఫాదర్‌ చిత్రంలో చిరంజీవి పాత్ర ఉందని బాలీవుడ్ దబాంగ్ స్టార్ సల్మాన్ ఖాన్ అన్నారు. రాంచరణ్‌పై సల్మాన్ ఖాన్ ప్రశంసల జల్లు కురిపించారు.

ముంబై: గాడ్‌ఫాదర్ చిత్రంలో చిరంజీవితో కలిసి పనిచేయడం అద్భుతమైన అనుభవం అని బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ అన్నారు. చిరంజీవి తదుపరి చిత్రం 'గాడ్‌ఫాదర్‌'లో తాను ప్రత్యేక పాత్రలో నటిస్తున్నట్లు సల్మాన్‌ఖాన్‌ తెలిపారు. 

ట్రెండింగ్ వార్తలు

‘చిరంజీవితో కలిసి పనిచేయడం అద్భుతమైన అనుభవం. చిరు నాకు చాలా కాలంగా తెలుసు. అతను నాకు స్నేహితుడయ్యారు. అదే సమయంలో అతని కుమారుడు (రామ్ చరణ్) కూడా స్నేహితుడే. అతను ఆర్ఆర్ఆర్‌లో అద్భుతంగా నటించాడు. ఆయన పుట్టినరోజు సందర్భంగా, సినిమా విజయం సాధించిన సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేశాను. నేను వారి గురించి చాలా గర్వపడుతున్నాను. అతను చాలా గొప్పగా చేస్తున్నాడు. అది చూస్తుంటే చాలా గర్వంగా అనిపిస్తుంది. కానీ సౌత్ ఇండియాలో మన సినిమాలు పెద్దగా ఆడకపోవడం నాకు ఆశ్చర్యం కలిగిస్తోంది’ అని సల్మాన్ అన్నారు.

సౌత్ ఇండియన్ సినిమాలు చూడటం కూడా తనకు చాలా ఇష్టమని సల్మాన్ ఖాన్ తెలిపారు. ‘సినిమా నిర్మాతలు నా దగ్గరకు వస్తే తమిళం, తెలుగు సినిమాలు తీసుకురారు. హిందీ సినిమాల కోసం నా దగ్గరకు వస్తారు..’ అని సల్మాన్ ఖాన్ అన్నారు.