Fighter OTT Release: హృతిక్ రోషన్ ‘ఫైటర్’ కూడా డంకీనే ఫాలో కానుందా? స్ట్రీమింగ్ డేట్ ఇదే!
18 March 2024, 14:58 IST
- Fighter OTT Release Date: ఫైటర్ సినిమా ఓటీటీలోకి వచ్చేందుకు సిద్ధమవుతున్నట్టు తెలుస్తోంది. స్ట్రీమింగ్ డేట్ వివరాలు కూడా చక్కర్లు కొడుతున్నాయి. హృతిక్ రోషన్ నటించిన ఈ ఏరియల్ యాక్షన్ మూవీ కోసం చాలా మంది ఎదురుచూస్తున్నారు.
Fighter OTT Release: హృతిక్ రోషన్ ‘ఫైటర్’ కూడా డంకీనే ఫాలో కానుందా?
Fighter OTT Release: బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్ నటించిన ఫైటర్ సినిమా ఫుల్ హైప్ మధ్య ఈ ఏడాది జనవరి 25న విడుదలైంది. దేశభక్తితో కూడిన ఈ చిత్రం రిపబ్లిక్ డేకు ఒక్క రోజు ముందు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఏరియల్ యాక్షన్ థ్రిల్లర్ మూవీగా వచ్చిన ఫైటర్ పాజిటివ్ టాకే తెచ్చుకుంది. సిద్ధార్థ్ ఆనంద్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం భారీ వసూళ్లను దక్కించుకుంది.
ఫైటర్ సినిమా ఓటీటీలోకి ఎప్పుడొస్తుందా అని చాలా మంది ప్రేక్షకులు ఎదురుచూస్తున్నారు. నెట్‍ఫ్లిక్స్ ఓటీటీ ప్లాట్‍ఫామ్ ఈ మూవీ డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను దక్కించుకుంది. అయితే, ఫైటర్ మూవీ మార్చి 21వ తేదీన స్ట్రీమింగ్‍కు రానుందని సమాచారం బయటికి వచ్చింది.
నెట్‍ఫ్లిక్స్ ఓటీటీలో మార్చి 21వ తేదీనే ఫైటర్ అడుగుపెడుతుందనే టాక్ చక్కర్లు కొడుతోంది. అయితే, దీనికి ఇంకా మూడు రోజుల సమయమే ఉన్నా.. ఇప్పటి వరకు స్ట్రీమింగ్ డేట్‍పై అధికారిక ప్రకటన వెల్లడికాలేదు. అయితే, ఈ చిత్రం సడెన్‍గానే స్ట్రీమింగ్‍కు వస్తుందనే వాదన వినిపిస్తోంది.
డంకీనే ఫాలో కానుందా?
షారుఖ్ ఖాన్ హీరోగా నటించిన ‘డంకీ’ సినిమా గత డిసెంబర్‌లో థియేటర్లలో రిలీజ్ అయింది. ఈ మూవీ ఈ ఏడాది ఫిబ్రవరి 15వ తేదీన నెట్‍ఫ్లిక్స్ ఓటీటీలో స్ట్రీమింగ్‍కు వచ్చింది. అయితే, అప్పుడు ఎలాంటి ముందస్తు ప్రచారం లేకుండా డంకీ చిత్రం నెట్‍ఫ్లిక్స్‌లో సడెన్‍గా అడుగుపెట్టింది. ఇప్పుడు.. ఫైటర్ కూడా దాన్ని ఫాలో అవుతుందని తెలుస్తోంది. ముందుగా పెద్ద ప్రచారం లేకుండా మార్చి 21న నెట్‍ఫ్లిక్స్ ఓటీటీలో ఫైటర్ స్ట్రీమింగ్‍కు రానుందని టాక్ వినిపిస్తోంది. మరి ఏం జరుగుతుందో చూడాలి.
ఫైటర్ గురించి..
ఫైటర్ సినిమాలో హృతిక్ రోషన్ సరసన దీపికా పదుకొణ్ హీరోయిన్‍గా నటించారు. ఈ చిత్రానికి సిద్ధార్థ్ దర్శకత్వం వహించారు. ఈ మూవీలో అనిల్ కపూర్, కరణ్ సింగ్, అక్షయ్ ఒబెరాయ్, రిషబ్ సాహ్నీ, అషుతోశ్ రాణా, గీతా అగర్వాల్, తలాత్ అజీజ్ కీలకపాత్రలు పోషించారు. ఎయిర్ ఫోర్స్ పైలెట్లు చేసే ఓ మిషన్ చుట్టూ ఈ మూవీ స్టోరీ ఉంటుంది. ఈ చిత్రానికి సంచిత్ బల్హారా, అంకిత్ బల్హారా, విశాల్ - చంద్రశేఖర్ సంగీతం అందించారు.
ఫైటర్ మూవీ ప్రపంచవ్యాప్తంగా సుమారు రూ.340కోట్ల గ్రాస్ కలెక్షను రాబట్టిందని అంచనా. వయాకామ్ 18 స్టూడియోస్, మార్ఫిక్స్ పిక్చర్స్ పతాకాలపై మమతా ఆనంద్, అజిత్ అంధారే, అంకు పాండే, రామోన్ చిబ్, కెవిన్ వాజ్ సంయుక్తంగా నిర్మించారు.
లాల్ సలామ్ అప్పుడేనా!
కోలీవుడ్ సూపర్ స్టార్ రజినీకాంత్ కీలకపాత్ర పోషించిన లాల్ సలామ్ సినిమా కూడా ఈవారంలోనే నెట్‍ఫ్లిక్స్ ఓటీటీలోకి వస్తుందని తెలుస్తోంది. మార్చి 22వ తేదీన ఈ చిత్రం స్ట్రీమింగ్‍కు రానుందనే అంచనాలు ఉన్నాయి. అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. విష్ణు విశాల్, విక్రాంత్ ప్రధాన పాత్రలు పోషించిన ఈ చిత్రం ఫిబ్రవరి 9న థియేటర్లలో రిలీజ్ అయింది. అయితే, నెగెటివ్ టాక్‍తో ఏ మాత్రం అంచనాలను అందుకోలేకపోయింది. రజినీ కూతురు ఐశ్వర్య ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు.